Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.Vegetable Farming: చాలామంది ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ (Focus on Investments) చేస్తున్నారు.అందులోనూ భూముల పైనా.. వ్యవసాయ భూములపైనా పెట్టు బడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. వ్యవసాయం (Cultivation) అంటేనే నష్టాలు తప్పవనే పరిస్థితి నెలకొంది. మరి అందులోనూ లాభాలు సాధించడం ఎలా... ఎలాంటి పంటలతో లాభాలు సాధించాలి.. అంటే.. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు.. సంప్రదాయ పంటలే పెద్ద దిక్కుగా ఉండేవి.. వరి రైతు వరి.. అరటి రైతు అరటి.. కొబ్బరి తోటలు ఇవే కనిపించేవి.. మార్పు అనేదే ఉండేది కాదు.. నేడు ప్రపంచీకరణతో అంతా మారిపోయింది.. రైతూ మారిపోయాడు. కాలంతో పాటు పరుగులు తీస్తున్నాడు.
అందుకే అంతా అధిక ఆదాయం వచ్చే పంటల వైపు చూస్తున్నారు. ఏడాదికి సుమారు మూడు నుంచి నాలుగు పంటలు వచ్చే కూరగాయల సాగుపై ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఎందుకంటే ఎకరా సాగు చేస్తే ఖర్చులు పోను సుమారు లక్ష వరకూ ఆదాయం వస్తుందని సమాచారం. అదే వరి అయితే ఏడాదంతా కష్టపడితే రెండు పంటలే.. ఆ పంట చేతికందుతుందో లేదో కూడా సందిగ్ధమే. దీంతో కూరగాయల సాగుపై ఆసక్తి పెరిగింది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండడం.. పెద్దగా కూలీల అవసరం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి పని చేసుకునే వెలుసుబాటు ఉండడంతో కూరగాయల సాగుకు పలువురు మొగ్గు చూపుతున్నారు. అయితే తెగుళ్లు, వైరస్, వాతావరణం ద్వారా నష్టం కలిగినప్పటికి మళ్లీ రెండు మూడు నెలల్లో వేరొక పంట వేయడానికి అవకాశం ఉండడంతో నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు వ్యవసాయ నిపుణులు.
ఇదీ చదవండి : వీరప్పన్ ను మొదట అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఎవరో తెలుసా..? ఇప్పటికీ ఆయనకు పూజలు చేస్తున్నారా?
ముఖ్యంగా బెండకాయ, దొండకాయ, కాకరకాయ, ఆనబ, వంకాయ, చిక్కుడు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ములక్కాయలు, దోస, టమాటా, పొట్ల తదితర స్వల్పకాలిక రకాల కూరగాయల పంటలు పండిస్తూ రైతులు జీవనోపాధి పొందుతున్నారు. సంవత్సరం పొడవునా వివిధ రకాల కూరగాయలు పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, రావులపాలెం, మూలస్థానం మార్కెట్లతో పాటు హైదరాబాద్, మద్రాసు లాంటి ప్రదేశాలకు భారీ ఎత్తున ఎగుమతులు చేస్తుంటారు.
ఇదీ చదవండి : పెట్టుబడి లేని వ్యవసాయం.. లాభాలే లాభాలు.. ప్రయోజనాలూ ఎన్నో..?
బొప్పాయి, ఆగాకర, గోరుచిక్కుడు తదితర రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. సంవత్సరంలో ఏడేనిమిది నెలలకు మంచి గిట్టుబాటు ధర ఉంటుం దని.. నాలుగైదు నెలలు కోసిన కోత ఖర్చులు కూడా రాక నష్టపోవాల్సి ఉంటుందని రైతులంటున్నారు.
సొంత భూముల గల రైతుల కంటే కౌలు రైతులే ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎకరా, అర ఎకరం భూములు కౌలుకు తీసుకొని ఏడాది పొడవునా పంటలు సాగు చేస్తారు. ఏడాదికి ఖర్చులు పోనూ లక్ష వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఆ మూడు గంటలు ఏం జరుగుతోంది..? పోలీసులనూ వెంటాడుతున్న భయం
కూరగాయలు సాగు చేసే రైతులు ఎక్కువ మంది కౌలు రైతులు కావడం వల్ల ప్రభుత్వం అందించే సబ్సిడీపై శ్రద్ధ వహించడం లేదు. వీరికి కౌలుకార్డులు లేకపోవడం ఆ పథకాలపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో సబ్సిడీలు పొందలేకపోతున్నామని చెబుతున్నారు. కూరగాయల పందిళ్లు సిమ్మెంటు స్థంభాలతో వేస్తే ఎకరానికి లక్ష వరకు సబ్సిడీ వస్తుందని మరో లక్ష రైతులు పెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Farming, Organic Farming, Vegetables