హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఈ పంటతో అందం.. ఆరోగ్యమే కాదు.. రెట్టింపు ఆదాయం కూడా..? ఎలా సాగు చేయాలి..? పెట్టుబడి ఎంత..?

Vizag: ఈ పంటతో అందం.. ఆరోగ్యమే కాదు.. రెట్టింపు ఆదాయం కూడా..? ఎలా సాగు చేయాలి..? పెట్టుబడి ఎంత..?

X
స్ట్రా

స్ట్రా బెర్రీ పంటలతో భారీ లాభాలు

Vizag: వింటర్ సీజన్ వచ్చిందంటే పర్యాటకులు తప్పక వెళ్లాల్సిన ప్లేస్ లంబసింగి.. అయితే అందమైన లోకేషన్లే కాదు.. ఎంతో అందంగా కనిపించే స్ట్రాబెర్రీ తోటలు చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ స్ట్రాబెర్రీ వల్ల అంద.. ఆరోగ్యమే కాదు.. ఎన్నో లాభాలు కూడా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

శీతాకాలం (Winter) లో పొగమంచుతో.. మేఘాలు నేలను తాకేట్టు కనిపించే అందమైన ప్రదేశం లంబసింగి. అందుకు వింటర్ లో లంబసింగి (Lambasingi) ని చూసేందుకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అంతేకాదు అక్కడి అందాలను చూసినవారంతా.. ఆంధ్రా ఊటి (Andhra Ooty) అని అభిప్రాయపడతారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) తూర్పు కనుమలలోని ఉన్న.. లంబసింగి రోజు రోజుకు బెస్త్ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. అయితే లంబసింగి అంటే కేవలం అందమైన లోకేషన్లు.. మంచు కురిసే పచ్చని పర్వతాలే కాదు.. అక్కడ పండే స్ట్రాబెర్రీ (Stra Berry) తోటలు కూడా.. ప్రత్యేక ఆంకర్షణగా నిలుస్తున్నాయి. వాటి చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో పర్యాటకులు, స్థానికులు స్ట్రా బెర్రీ తోటలను చూసేందుకే వస్తున్నారు. ఓ వైపు మంచు తెరల చాటున చల్లటి వాతావరణం.. కళ్లు తిప్పుకోకుండా చేసే సుందరమైన ప్రదేశాలు మాత్రమే కాదు.. స్ట్రాబెర్రీ తోటలు కూడా ఈ ప్రాంతానికి ఆకర్షణగా నిలుస్తున్నాయి..

అందుకే లంబసింగి ని 'ఆంధ్ర కాశ్మీర్' అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో శీతాకాలంలో మంచు కురిసే ఏకైక ప్రదేశం కూడా ఇదే. 2012 సంవత్సరంలో ఉష్ణోగ్రతలు సున్నా స్థాయికి పడిపోయిన తర్వాత ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. ఇది సముద్ర మట్టానికి 1,000 మీటర్ల ఎత్తులో ఉన్న చింతపల్లి , లంబసింగిలో పదేళ్ల క్రితం స్ట్రాబెర్రీల మొదటి ఉత్పత్తిని రుచి చూసింది. మంచి దిగుబడి, లాభాలతో ఉత్సాహంగా ఉన్న రైతులు అప్పటి నుండి ఈ ప్రాంతంలో స్ట్రాబెర్రీల సాగును పెంచారు.

లంబసింగిలోని స్ట్రాబెర్రీ సాగు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్ట్రాబెర్రీ సీజన్ నవంబర్ నాటికి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అక్టోబరు, నవంబర్‌లలో అకాల వర్షాలు, తుఫానుల కారణంగా జాప్యం జరిగింది. గతేడాది కొందరు రైతులు ఈ సమయానికి 200 కిలోలకు పైగా విక్రయించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 50 నుంచి 60 కిలోల వరకు మాత్రమే విక్రయించారు.

ఇదీ చదవండి : టీడీపీ ఎంపీల రాజీనామా..! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా..! కారణం ఇదే?

లంబసింగి పరిసర ప్రాంతాల్లో 10 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు జరుగుతోందని లంబసింగి రైతుల్లో ఒకరైన సంతోష్ తెలిపారు. ఐదుగురు మిత్రులు కలిసి పెట్టిన స్ట్రాబెరి తోట లాభాల బాటలో నడుస్తుందోని అన్నారు. పండ్లను ప్రస్తుతం కిలో  500, 200 గ్రాములు  100కు విక్రయిస్తున్నారు.  రాబోయే కొన్ని వారాల్లో గరిష్ట పంటకోత కాలం రాబోతోంది. జనవరిలో ఎక్కువ మంది సందర్శకులు వస్తారని మేము ఆశిస్తున్నాము,  అని అతను చెప్పాడు. వారానికి 50వేల నుండి లక్ష రూపాయలు వరకు ఆదాయం వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. పెద్ద ఎత్తున లంబసింగి వస్తున్న పర్యాటకలు కొనుగోలు చేస్తున్నారంటూ చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Farmer, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు