హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Yoga Course: యోగాను కెరీర్ గా మార్చుకోవాలి అనుకుంటున్నారా? త్వరపడండి.. గడవు ముగుస్తోంది..!

Yoga Course: యోగాను కెరీర్ గా మార్చుకోవాలి అనుకుంటున్నారా? త్వరపడండి.. గడవు ముగుస్తోంది..!

X
యోగా

యోగా నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం

Yoga Career: ఒకప్పుడు యోగా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు యోగా గురించి తెలియని వాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చిన తరువాత అందరికీ యోగా పై ఆసక్తి పెరిగింది. యోగా ట్రైనర్స్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉంది..? ఇలాంటి డిమాండ్‌ ఉన్న కోర్సు మీరు చేయాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి..

ఇంకా చదవండి ...

Neelima Eaty, News18, Visakhapatnam.

Yoga course: తెలుగు రాష్ట్రాల్లో యోగా (Yoga) కు క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి (Corona Virus) భయ పెట్టిన తరువాత.. అందరికీ యోగాపై అవగాహన పెరిగింది. యోగా చేయడంతో మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవచ్చు. యోగా అనేది ఒక మహా మంత్రం.. అలాంటి యోగాతో  మనకి తెలియని లాభాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి యోగాని కెరీర్‌ (Career) గా ఎంచుకోవాలని అనుకుంటున్నారా? త్వరపడండి. డిప్లొమ ఇన్ యోగా (Diploma in Yoga) అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆంధ్ర యూనివ్సిటీ (Andhra University) , డిపార్ట్ మెంట్ఆఫ్ యోగా, కాన్సియస్నెస్ (Department of yoga and consciousness) యోగా అడ్మిషన్స్ మొదలు పెట్టారు. అందులో చేరాలి అనుకుంటే టెన్త్, ఇంటర్ పాస్ అయితే చాలు. మీరు యోగా కోర్సు జాయిన్ అవడానికి అర్హత ఉన్నటే. ఇంటర్‌ తర్వాత నాలుగు రకాలుగా ఈ యోగా కోర్స్‌ అందుబాటులో ఉంది. సర్టిఫికేట్‌ కోర్సు, డిప్లొమా కోర్సు, పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ డిప్లొమా చేయోచ్చు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించండి. http://www.audoa.in వెబ్‌సైట్‌కు వెళితే… అక్కడ యోగా కోర్సు చేయడానికి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తి వివరాలు(details)నింపి, రిజిస్ట్రేషన్‌ ఫీ కోసం మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్‌లో డీడీ నింపి ఐదు వందలు చెల్లించాలి. అలా నింపిన అప్లికేషన్ ఫామ్‌ను ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్స్ జరిగే మెయిన్ ఆఫీస్‌లో ఉన్న బాక్స్‌లో వెయ్యాలి.

ఇదీ చదవండి : ఎయిర్‌క్రాప్ట్‌ల గురించి తెలుసుకోవాలనుందా? ఈ మ్యూజియాన్ని సందర్శించాల్సిందే.. ప్రత్యేకతలు ఇవే

1.యోగా సర్టిఫికేట్ కోర్స్(Yoga certiifiate course): మూడు నెలల సమయం

2.యోగా డిప్లొమా కోర్సు(Yoga Diploma Couse): ఈ కోర్స్ గడువు కాలం ఆరు నెలలు.

3.యోగా పోస్ట్ గ్రాడయుయేషన్ డిప్లొమా(Yoga Post Graduaction Diploma) - సంవత్సరం కోర్స,

4.యోగా మరియు కాన్సియస్నెస్(Yoga and consciousness) - రెండు సంవత్సరాలు

ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆఫీస్ చిరునామా: పెద్ద వాల్టైర్, విశాఖప్టణం.

దరఖాస్తు సబ్‌మిట్ చేయడానికి చివరితేది:

ఈ నెల 18 నుంచి కౌన్సెలింగ్‌ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్‌లోనే ఉంటుంది.

మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి: http://andhrauniversity.info/arts/yoga/index.html

yoga village

రామకృష్ణ బీచ్ రోడ్, విశాఖపట్నం.యోగా విలేజ్ ఆఫీస్ టైమింగ్స్: ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటలు, మధ్యాహ్నం 3గంటలు నుంచి రాత్రి 7గంటలు వరుకు మాత్రమే. ఆదివారాలు కూడా తెరిచే ఉంటుంది. కాంటాక్ట్ నంబరు: 0891-2566640, 0891-2566625

First published:

Tags: Andhra Pradesh, AP News, Vizag, Yoga

ఉత్తమ కథలు