హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Farming: పెట్టుబడి లేని వ్యవసాయం.. లాభాలే లాభాలు.. ప్రయోజనాలూ ఎన్నో..?

Farming: పెట్టుబడి లేని వ్యవసాయం.. లాభాలే లాభాలు.. ప్రయోజనాలూ ఎన్నో..?

లాభాలు తెచ్చి పెడుతున్న వలిసె పంట

లాభాలు తెచ్చి పెడుతున్న వలిసె పంట

Farming: ఏజెన్సీ ప్రాంతంలో పెద్దగా పెట్టుబడి లేకుండా..? లాభాలు తెప్పించే పంట ఏదైనా ఉంటే అది వలిసెల సాగు.. అయితే ఈ పంట వేయడానికి ఇదే సరైన సమయం.. అంతేకాదు ఈ పంటతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.పెట్టుబడి లేకుండా వ్యవసాయం (Farming) చేసేందుకు ఏజెన్సీ (Agency) లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పంటల దిగుబడి కూడా అలానే ఉంటాయి. ముఖ్యంగా మన్యం జిల్లా (Manyam District) లో ఏజెన్సీ వాసులకు లాభాల పంట పండిస్తోంది వలిసెల సాగు.. అయితే ఈ సాగుకు ఇదే అనువైన సమయం. అందుకే గిరిజన రైతాంగం ముందుకు వచ్చి అధిక విస్తీర్ణంలో నాట్లు వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక నూనె శాతం కలిగిన వలిసె పంటకు మన్యం జిల్లా ప్రసిద్ధి. పచ్చని పూలతో ప్రకృతి అందాలకు మరింత శోభను తీసుకురావడమే కాకుండా వంట నూనెగా వినియోగించడంతో పాటు, ఆహార పదార్థాల తయారీ, పరిశ్రమల్లో రంగులు, సబ్బుల తయారీలో ఈ గింజలను ఉపయోగి స్తారు. నూనె తీయగా వచ్చిన పొట్టును పశువుల దాణాగా, సేంద్రియ ఎరువుగా కూడా వినియోగిస్తుంటారు.
   పాడేరు రెవెన్యూ డివిజన్‌ (Paderu Revenue Division) పరిధిలో గతంలో సుమారు 16 వేల హెక్టార్లలో సాగయ్యే వలిసెల ఆకాశ పందిరి ఇటీవల తగ్గింది అనే చెప్పాలి.. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కలుపు ఉధృతి పెరగడం.. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడంతో  కేవలం ఆరువేల ఎకరాల్లో మాత్రమే ఈ పంట సాగవుతోంది. 


  వలిసెల సాగుకు సరాసరి వర్షపాతం 100 సెంటీమీటర్లు అవసరం. 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అనుకూలం. అలాగే ఉదజని 5 నుంచి 7 గల ఇసుక, ఒండ్రు, తేలికపాటి గరప నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. అయితే సెప్టెంబరు మొదటి వారం నుంచి అక్టోబరు మొదటి వారం వరకూ విత్తనాలు వేసుకోవడానికి చాలా అనుకూల సమయం అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
  ఇదీ చదవండి : ఆ మూడు గంటలు ఏం జరుగుతోంది..? పోలీసులనూ వెంటాడుతున్న భయం
  ఈ పంట ఎకరానికి ఐదు కిలోల విత్తనాలు అవసరం పడతాయి.  సాధారణంగా గిరిజన రైతులు విత్తనాలను వెదజల్లి, చెట్టు కొమ్మను నేలపైలాగి కలయబెడతారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు. వరుసల మధ్యలో 30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ విత్తుకుంటే అధిక దిగుబడి లభిస్తుందని.. భారీగా లాభాలు ఇస్తుందని చెబుతున్నారు.
  ఇదీ చదవండి : లోన్ యాప్ లపై సీఎం సీరియస్.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
  వలిసెలు విత్తిన 15 రోజుల తరువాత 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు కలుపు తీసుకోవాలి. ఈ పంటలో ప్రధానంగా ఆకాశ పందిరి (బంగారుతీగ) అనే సంపూర్ణ కాండ పరాన్నజీవి నాటిన నెల రోజుల్లో  పంటను ఆశించి అధికనష్టం కలిగిస్తుంది. ఇది నేలలో పడిన విత్తనం ద్వారా (వలిసెల విత్తనాల్లో ఆకాశపందిరి విత్తనాలు కలిసి వుండడం) మాత్రమే వ్యాప్తి చెందుతుంది. ఈ కలుపు మొక్క కాండ పరాన్న జీవిగా పంటకు ఆశించి నష్టపరుస్తుంది.
  ఇదీ చదవండి : కింగ్ నాగార్జున విజయవాడ ఎంపీగా పోటీచేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ..
  ఈ మొక్కకు ఆకులు లేకపోవడం వల్ల సొంతంగా ఆహారం సమకూర్చుకోలేదు. వలిసెల మొక్కపై హస్టోరియా అనే భాగాలతో అతుక్కొని అతిథి మొక్క  నుంచి కార్బోహైడ్రేట్స్‌ను గ్రహిస్తుంది. దీని వల్ల  దిగుబడి, నాణ్యత, మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. ఆకాశపందిరి  విత్తనాలు నేలలో వుంటూ 20 సంవత్సరాల పాటు మొలకెత్తే సామర్థ్యం కలిగివుంటాయి.  ఈ వలిసె ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అంటున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచుతాయని.. జీర్ణ వ్యవస్థ పని చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Farmers, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు