Setti Jagadeesh, News18, Visakhapatnam
Vizag: తొలకరి చినుకు పడితే చాలు.. నేలతల్లి తడిసి మురిసిపోతుంది…కానీ పిల్లల తల్లిదండ్రులు (Parents) మాత్రం కంగారు పడుతుంటారు. అందుకు ప్రధాన కారణం.. వానాకాలం ( Rainy Season)లో భయపెట్టే సీజనల్ వ్యాధులే (Viral Fevers).. సాధారణంగా వానలో ఆడుకోవాలని చిన్నారులు సరదాపడుతుంటారు. చినుకుల్లో తడవని బాల్యం దాదాపు ఎవ్వరికి ఉండదు. కానీ ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నారులు వానలో తడవకుండా పేరెంట్స్ జాగ్రత్త పడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్లకు జలుబు, దగ్గు (Cold and Cough) అంటూ.. రకరకాల ఫ్లూ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే వాళ్ల ఆరోగ్యంపై తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే పిల్లల ఆరోగ్యం పాడవ్వడానికి తల్లిదండ్రులే కారణం అవుతారు...
వాతావరణ మార్పులతో.. తొలకరి వాన నీళ్లు తాగడం వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. క్రిమికీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేది పిల్లల ఆరోగ్యం మీదే. ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వైరస్ దాడి మొదలవుతుంది. ఈ కాలం తీసుకొచ్చేఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో డాక్టర్ లక్ష్మీకాంత్ మాటల్లో తెలుసుకుందాం…
వర్షాకాలంలో మన ఇంటిని, చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచడం చాలా ఆవశ్యకమని లక్ష్మీకాంత్ తెలిపారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడంటే అక్కడ ఆడుకుంటుంటారు. నీరు నిల్వ ఉండటం వల్ల ఏ కొంచెం మురికి, దుమ్ము ఉన్నా సరే.. అక్కడ క్రిములు చేరుతాయి..అవి పిల్లల శరీరానికి అంటుకుని రకరకాల ఫ్లూ, చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
దోమల బెడద ఎక్కువ: ఈ వర్షాకాలంలో దోమలు పెరుగుతాయి. దోమలు కుట్టడం వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దోమల బెడద లేకుండా జాగ్రత్తలు వహించాలి. మస్కిటో రిపెల్లెంట్స్ (mosquito repellent), దొంతరలు లాంటివి వాడితే..కాస్త దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ కలుస్తున్న సీఎం జగన్-షర్మిల.. ఇడుపులపాయలో వైఎస్ ఫ్యామిలీ సమావేశం
స్కూల్‌కెళ్లే పిల్లల్లో అయితే ఒకరినుంచి మరొకరి వచ్చే ఫ్లూ వ్యాధులైన…జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో ఎవ్వరికైనా ఆ లక్షణాలు కనిపించగానే వెంటనే అప్రమత్తం అవ్వాలంటున్నారు డాక్టర్ లక్ష్మీకాంత్. పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు.. ఆడుకుంటున్నప్పుడు, వర్షంలో తడవడం.. లేదా.. వర్షంలో ఆడుకుంటున్నప్పుడు ఫ్లూ వైరస్‌లు వారిపై దాడి చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం, అలవాట్లపై పేరెంట్స్ చాలా అలర్ట్ గా ఉండాలి.
ఇదీ చదవండి: ఈ కర్రీ ప్యాకెట్ చాలా ఖరీదు వేయి రూపాయలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
కాచిచల్లార్చిన నీళ్లను తాగాలి: వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.. మనం తాగుతూనే పిల్లలకూ అవే నీటిని తాగడం అలవాటుచెయ్యాలి.
ఇదీ చదవండి: ప్రధాని మోదీ సభకు పవన్ ఎందుకు రాలేదంటే..? క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు.. ఏమన్నారంటే..?
కూలింగ్ వస్తువులకు దూరం: బయట దొరికే మజ్జిగ, నిమ్మరసం వంటి పండ్ల రసాలకు స్వస్తి చెప్పడం మంచిది. అలాగే ఐస్, కుల్ఫీ వంటి వాటికి కాస్త దూరంగా పెట్టాలి.
పండ్లు తినిపించాలి: పండ్లు వర్షాకాలం ఎక్కువగా దొరికే పియర్, బొప్పాయి, దానిమ్మ, నేరేడు, యాపిల్ వంటి పండ్లు ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఈ ఫ్రూట్స్ శరీరానికి అందడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
ఇదీ చదవండి: ఏపీలో వారందరికీ శుభవార్త.. ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా డబ్బులు.. అర్హత ఏంటంటే..?
ఆహారపదార్థాలు వేడి వేడిగా తినాలి: పిల్లలకు ఏ పూటకు ఆ పూట ఫ్రెఫ్ అండ్ హాట్‌గా వండి పెట్టడం మంచిది. ఉదయం, రాత్రి వేడివేడిగా వండి తినిపిస్తే మంచిది. చాలా మంది తల్లులు మొలకెత్తిన గింజలు పిల్లలకు ఇస్తుంటారు. కానీ.. వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండటం మంచిది. అలా ఇవ్వడం కంటే ఉడకబెట్టి ఇస్తే మేలంటున్నారు.
ఇదీ చదవండి: అధికార పార్టీకి బిగ్ షాక్ తప్పదా..? పవన్ ను కలిసిని ఇద్దరు వైసీపీ నేతలు ఎవరు..?
రెయిన్ ప్రూఫ్ జాకెట్ : పిల్లలు స్కూల్‌కి వెళ్లేటప్పుడు వర్షంలో తడవకుండా.. రెయిన్ జాకెట్ ఎప్పుడూ వాళ్ల బ్యాగ్‌లో ఉంచడం మంచిది. పాదాలు కూడా వర్షపు నీటిలో తడవకుండా.. వాటర్ ప్రూఫ్ షూ వాడితే అనారోగ్య సమస్యలకు కాస్త చెక్ పెట్టొచ్చు.
చేతులు కడగాలి: అది ఇదీ ముట్టుకోవడం వల్ల పిల్లల చేతులకు బ్యాక్టీరియా, వైరస్ లు నిండి ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి చేరకుండా. చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. బయట నుంచి రాగానే చేతులు శుభ్రం చేసుకునే అలవాటు నేర్పించాలి.
ఇదీ చదవండి : 2024 ఎన్నికల తర్వాత ఆస్తులమ్ముకోవాలి..? లేదా ఆత్మహత్యే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఈ కాలంలో పిల్లలకు ఏదైనా జలుబు, జ్వరం.. లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి తాత్కాలిక ఉపశమనానికి సొంత వైద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది. అందులోనూ కరోనా విజృంభిస్తున్న వేళ ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి సరైన వైద్యం చేయించాలని డాక్టర్ లక్ష్మీకాంత్ సూచిస్తున్నారు. చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Dengue fever, Local News, Vizag