హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sea Disappeared: ఏపీలో విచిత్రం.. రాత్రికి రాత్రే సముద్రం మాయం.. అసలేం జరిగిందంటే..!

Sea Disappeared: ఏపీలో విచిత్రం.. రాత్రికి రాత్రే సముద్రం మాయం.. అసలేం జరిగిందంటే..!

అంతర్వేది వద్ద వెనక్కి వెళ్లిన సముద్రం

అంతర్వేది వద్ద వెనక్కి వెళ్లిన సముద్రం

Bay of Bengal: బంగాళాఖాతంలో కొన్నిరోజులుగా విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఓ చోటల ఎగసిపడుతున్న సముద్రం.. మరోచోట కనిపించకుండా పోతోంది.

  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన తీరప్రాంతం (Coastal Andhra) ఉంది. అమదైన పల్లెలు, బీచ్ లు తీరప్రాంతంలో ఉన్నాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని, మత్స్యకారులకు జీవనాధారాన్ని కల్పించే సముద్రంలో గత కొన్ని రోజులుగా విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా (East Godavari) అంతర్వేదిలో సముద్రపు అలలు స్థానికులను అందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రం పెద్ద పెద్ద అలలతో ముందుకు రావడం.. అనంతరం వెనక్కి వెళ్లిపోవడంతో కలకలం రేగుతోంది. అంతర్వేది తీరంలో సముద్రం ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కివెళ్లింది. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ ప్రదేశం అంతర్వేది. బంగాళాఖాతంలో గోదావరి నది (Godavari River) కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది తీరంలో సాధారణంగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. నిత్యం సముద్రం ముందుకు చొచ్చుకొస్తూ స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇళ్లను ముంచేస్తుంటుంది. బుధవారం కూడా అలలు ముందుకొచ్చి ఓ హోటల్ ను ముంచెత్తాయి. దీంతో అది ధ్వంసమైంది. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో స్థానికులంతా భయాందోళనకు గురై అటువైపు వెళ్లడం మానేశారు.

  ఐతే గురువారం ఉదయం తీరప్రాంతానికి వెళ్లిన వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. నిన్న ఎగసిపడిన అలలు ఈరోజు మాయమయ్యాయి. ఆ మాటకొస్తే అక్కడ సముద్రం లేదు. కేవలం ఇసుక మేటలు మాత్రమే కనిపిస్తున్నాయి. సముద్రం 100 కాదు 200 మీటర్లు కాదు ఏకంగా 2 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. ఐతే ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో మాత్రం సముద్రపు నీరు ముందుకు చొచ్చుకొచ్చింది. గత నెలరోజులుగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో ఆటపోట్లకు గురయ్యే సముద్రం 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది.

  ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ కు ముప్పు పొంచిఉందా..? సముద్రంలో కల్లోలం దేనికి సంకేతం..?


  ఇటీవల కాకినాడ తీరానికి 290 కిలోమీటర్ల దూరంలోని సముద్ర గర్భంలో భూ కంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఏపీ తీరప్రాంతంలో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఐతే ఇప్పుడు ఏకంగా 2కిలోమీటర్లు వెనక్కివెళ్లడంతో ఏ క్షణాన్నైనా ముందుకు దూసుకొస్తుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనూహ్య మార్పులకు కారణాలేంటో తేల్చాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

  ఇది చదవండి: ఈయన 75 ఏళ్ల బాహుబలి.., పరుగుపెడితే పతకాల పంటే..!


  ఇటు ఉప్పాడ తీరంలో ను ఇదే పరిస్థితి,గత రెండు వారాల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉప్పాడ తీరం వెంబడి రాకాసి అలలు ఎగసిపడి కోతకు గురవుతూ.., సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి ఉప్పాడ తీరం వెంబడి బీచ్ రోడ్డును తాకుతు కెరటాలు ఎగసిపడే వి. కాని నిన్న జరిగిన పరిణామం NGRI శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కడం లేదు. ప్రస్తుత పరిస్థితికి సముద్రంలో భూకంపానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా..? ప్రకంపనల కారణంగా సముద్రం ఒకచోట ముందుకు.. మరోచోట వెనక్కి వెళ్లిందా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. హైదరాబాద్ సునామీ హెచ్చరికల కేంద్రం నుంచి, NGRI శాస్త్రవేత్తలు కూడా ఈ పరిణామంపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bay of Bengal, East Godavari Dist

  ఉత్తమ కథలు