Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM BANK ROBBERY IN VISKHA DISTRICT MAN ENTERED WITH GUN AND TOOK THREE LAKHS FROM CASHIER NGS VSP

Crime News: పట్టపగలే షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే తుపాకీతో బెదిరించి బ్యాంకు దోపిడీ

బ్యాంక్ దోపీడీ

బ్యాంక్ దోపీడీ

Crime News: బ్యాంక్ లో అంతా బిజీ బిజీగా ఉన్నారు.. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కస్టమర్లలా ఓ వ్యక్తి బ్యాంక్ లోకి ఎంటర్ అవ్వడంతో ఎవరూ పట్టించుకోలేదు.. ఎవరూ ఊహించని విధంగా తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ తీసి.. బెదిరించి అక్కడ నుంచి నగదు ఎత్తుకుపోయాడు.

ఇంకా చదవండి ...
    Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకూ నేరల సంఖ్య పెరుగుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దోపీడీలు ఇలా రోజు ఎక్కడో ఒకచోటు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత అనకాపల్లి జిల్లా (Anakapalli District)లో ఓ బ్యాంక్‌ (Bank) ను మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగానే లూటీ అయ్యింది. అనకాపల్లి పట్టణంలోని కసింగకోట నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌ (Grameena Vikash Bank) లో చోరీకి పాల్పడ్డాడు దుండగుడు.  ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి హెల్మెట్ పెట్టుకుని బ్యాంకులోకి ప్రవేశించాడు.  అతడిని చూసినవారు బ్యాంక్ కస్టమర్ అనుకున్నారు.  ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అలా ఎంటర్ అయిన దుండగుడు తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో సిబ్బందిని బెదిరించి 3 లక్షల రూపాయల నగదు దోచుకుపోయాడు. అది కూడా పట్టపగలు బ్యాంక్ సిబ్బందితో పాటు ఇతర కస్టమర్లు ఉన్న సమయంలోనే.. తుపాకీతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

    సరిగ్గా మధ్యాహ్నాం 2.00 గంటల ప్రాంతంలో.. సాధారణంగా ఆ సమయంలో బ్యాంక్ సిబ్బంది లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అయితే బ్యాంకులో ఉన్న క్యాష్ ను లెక్కపెట్టి తరువాత లంచ్ బ్రేక్ తీసుకుందానుకుంటున్నాడు క్యాషియిర్. సరిగ్గా అదే సమయంలో ఓ దుండగుడు హెల్మెట్ ధరించి బ్యాంకులోకి తాపీగా ప్రవేశించాడు. నేరుగా క్యాష్ లెక్కపెడుతున్న క్యాషియర్ ప్రతాప్ రెడ్డి కౌంటర్ దగ్గరకు వెళ్లి గన్ తో బెదిరించాడు. మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి తన బ్యాగులోపెట్టాలంటూ తుపాకీతో బెదిరించాడు. దీంతో భయపడిపోయిన క్యాషియర్ ప్రతాప రెడ్డి మొత్తం 3 లక్షల 31,320 లను ఆ దుండగుడికి అప్పగించేశాడు. ఆ తరువాత సదరు దుండగుడు నువ్వు సేఫ్ అంటూ హిందీలో మాట్లాడి వచ్చినంత తాపీగా బయటకు వెళ్లిపోయాడు.

    ఇదీ చదవండి : అన్నను అంటే చెల్లికి కోపం రాదా? కేటీఆర్ కు షర్మిల కౌంటర్

    అయితే సరిగ్గా క్యాషియర్ క్యాష్ లెక్క పెట్టే సమయంలోనే దుండగుడు రావటం క్యాష్ ఇవ్వమని తుపాకీతో బెదిరించటం క్యాషియర్ ఏమాత్రం ప్రతిఘటించకుండా ఇచ్చేయటంతో పోలీసులు బ్యాంకు సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి అదే ప్రాంతానికి చెందినవాడా? ముందుగానే రెక్కీ నిర్వహించి దోపిడీకి వచ్చాడా? అతని చేతిలో ఉన్నది నిజమైన తుపాకీయేనా? ఈ దోపిడీలో సిబ్బంది సహకారం ఉందా? లేక బయట వ్యక్తులు ఎవరైనా ఇంకా ఈ దోపిడీలో ఉన్నారా..? రోజు ముందుగానే లంచ్ చేసే ఆ క్యాషియర్ ఆలస్యంగా ఎందుకు లంచ్ చేశాడు.. నువ్వు సేఫ్ అని అతడు ఎందుకు చెప్పాడు.. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bank, Crime news, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు