Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM BAD NEWS TO DEVOTEES IN SIMACHALAM ONLY PASSES GAVE TO VIPS AND WHO GAVE LOT OF MONEY NGS VSP

Simhachalam: సామాన్యులకు దక్కని స్వామి వారి నిజరూప దర్శనం.. డబ్బున్నోళ్లకే అన్నింటికీ అనుమతి..? ఈవోలు చెప్పినవారికే ఛాన్స్

సామాన్యులకు దక్కని నిజరూప దర్శనం

సామాన్యులకు దక్కని నిజరూప దర్శనం

Simhachalam: సింహాచలం అప్పన్న నిజరూపదర్శనం ఇంత ఖరీదా..? స్వామిని అలా దర్శించుకోవాలి అంటే.. కేవలం డబ్బులు ఉన్నవాళ్లకే సాధ్యమా..? దర్శనాలు.. పాస్ లు అన్నీ వాళ్లకే..? అడిగితే నెట్టేస్తున్న లేడీ ఈవోలు?

  Simhachalam:  విశాఖపట్నంలోని  సింహాచలం (Simhachalam) చందనోత్సవం మొదట్లోనే రచ్చగా మారిపోతోంది. సామాన్య భక్తులకు (Devotees), డోనర్లకు అప్పన్న నిజరూపదర్శనం అవకాశమే లేదు. ఇదేంటని అడిగితే మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు. సాక్షాత్తూ ఆలయ ఈవోలే (Simhachalam EO) ఈ పని చేస్తున్నారు. 1000, 1200, 1500 అటూ రేట్లు పెట్టి అదీ కూడా ఎమ్మెల్యే (MLA), ఎంపీల సిఫార్సు (MPs Reference) లెటర్లు.. పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెబితే కానీ ఇవ్వడం లేదు. ఇదేమని అడిగిన ఓ డోనర్ని ఆదివారం సింహాచలం ఇన్ఛార్జి ఈవో శాంతి బయటకు నెట్టేశారు. ఇదంతా చూస్తున్న ఈవో సూర్యకళ (E.O SuryaKala) కూడా ఏమనకుండా ఉండిపోయారు. బయటకు వచ్చి భక్తులు మీడియా ముందు తమ బాధ వెళ్లగక్కుతున్నారు.

  విశాఖ (Visakha)లో మే 3న అప్పన్న నిజరూప దర్శనం ఉంది. దీన్ని చందనోత్సవం (Chandanothsavam) అని కూడా అంటారు. విశాఖ నుంచే కాక.. పక్క రాష్ట్రాలైన ఒడిషా ఛత్తీస్ ఘడ్ నుంచీ కూడ లక్షలాది మంది భక్తులు వస్తారు. చందనయాత్రగా చెప్పుకునే ఈ భక్తి కార్యక్రమం ఇప్పుడు సంపాదనా మార్గంగా మారిపోయిందంటున్నారు. దేవస్థానం పూర్తిగా చందనోత్సవాన్ని ఆదాయ మార్గంగా చూస్తోందని భక్తులు మండిపడుతున్నారు. ఒకప్పుడు ఆరువందల రూపాయల వీవీఐసీ టిక్కెట్లు ధర ఉంటే.. ఇప్పుడవి 1500 రూపాయలు అంటున్నారు. అలాగే అత్యంత తక్కువ టిక్కెట్ ధర మూడువందల రూపాయలు. అసలు ఉచిత దర్శనాలనేవి మచ్చుకైనా కనిపించబోవని ఇప్పటికే సింహాచలం దేవస్థానం చెప్పకనే చెప్పేసింది.

  ఇదీ చదవండి : ఏపీని కలవర పెడుతున్న డ్రగ్స్ సప్లై.. కొరియర్‌ ద్వారా రావడంపై విచారణ వేగవంతం

  మరోపక్క దేవస్థానానికి డోనర్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ దాతలకు డోనర్ పాస్ లు ఇవ్వడం కనీసం ధర్మం.  దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మాత్రం ఇక్కడ డోనర్లపై రంకెలు వేస్తున్నారు. కొందరు డోనర్లను బయటకు నెట్టేస్తున్నారు. తమకు పాస్ లు ఇవ్వాలని కోరడమే వీరు చేసిన తప్పైపోయింది. సింహాచలం ఈవో సూర్యకళ చందనోత్సవం విషయంలో సరిగ్గా నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సూర్యకళ ఒక్కరే చందనోత్సవం నిర్వహణ చేయలేరని ప్రభుత్వం చందనోత్సవానికి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ దేవస్థానం ఈవోను భ్రమరాంభను ప్రత్యేక అధికారిగా నియమించింది.

  ఇదీ చదవండి : భర్త కళ్లముందే భార్యను గ్యాంగ్ రేప్ చేసిన నిందుతుల అరెస్ట్.. పట్టించిన గాజులు, చెప్పులు.. ఎలా అంటే..?

  చందనోత్సవం ఏర్పాట్లన్నీ భ్రమరాంభ చూస్తున్నారు. దేవాలయం కొండపై వ్యవహారాలన్ని ఆమె చక్కదిద్దారు. అయితే ఈవో సూర్యకళ కేవలం పాస్ లు.. ఇతరత్రా టిక్కెట్ల జారీ చేయాల్సి ఉంది. అది కూడా ఆమె సరిగ్గా నిర్వహించడం లేదన్న విమర్శలు వచ్చాయి. భారీగా ధరలు కూడా పెంచేసి.. భక్తులకి అప్పన్నని దూరం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీటికి ఉదాహరణలే అన్నట్టు..  ఏకంగా మీడియా ముందుకు వచ్చి భక్తులు మండిపాడుతున్నారు.  ఓ డోనర్ ఏకంగా ఈవో, ఇన్ఛార్జి ఈవోలపై పై ఆరోపణలు చేశారు. తమకి పాస్ లు ఇమ్మని అడిగినందుకు.. నిర్దయగా బయటకు నెట్టారని ఆరోపిస్తున్నారు.

  ఇదీ చదవండి : పొరపాటున తనదే అనుకొని మరో బైక్ లో 2.80 లక్షలు.. చివరికి ఏమైందంటే?

  సింహాచలం దేవస్థానం ఇప్పుడు అప్పన్నని చాలా కాస్ట్లీగా మార్చేసింది. గతేడాదితో పోలిస్తే మూడింతలు రేట్లు పెంచేసింది.. అసలు అటువైపు చూడటానికే భయపడేలా చేస్తున్నారు. ఖరీదైన కొనాలని ముందుకెళ్లే వారికి.. పలు సిఫార్సు లెటర్లు అంటూ అడుగుతున్నారు. ఈ విషయాలపై ఈవో సూర్యకళను వివరణ అడిగితే.. ఇదంతా ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే జరుగుతోందని అంటున్నారు. దేవస్థానంలో ఎవరికీ ఇబ్బంది రాకుండా చూడటానికే ఇదంతా చేస్తున్నామని అన్నారు,
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు