Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM AZADI KA AMRIT MAHOTSAV AT ANDHRA UNIVERSITY HUGE RALLY 300 FEET NATIONAL FLAG VISAKHAPATNAM NGS NJ VSJ

Vizag: ఏయూలో భారీ మువ్వన్నెల జెండా రెప రెపలు.. వేడుకగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌

ఏయూలో

ఏయూలో జాతీయ జెండా రెప రెపలు

Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ దేశ వ్యాప్తంగా వేడుకలా జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివ్సిటీలో భారీ మువన్నెల జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఎన్ని అడుగుల జెండానో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Setti Jagadesh, News 18, Vizag

    Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ (Prime Minster Modi) పిలుపు మేరకు అన్ని సంస్థలు భారీ జెండాను ఎగురవేస్తున్నాయి. దీంతో యావత్ భారత దేశంలో దేశభక్తి ఉప్పొగుతోంది. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్ర యూనివ్సిటీ (Andhra University) లో 300 అడుగుల మువన్నెల జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దేశ సార్వభౌమత్వం, జాతి సమైఖ్యత, పౌరుల్లో సమైఖ్యతను చాటిచెప్పి.. దేశ భక్తిని పెంపొందించడమే లక్షంగా ఏయూ అధికారులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

    స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కేంధ్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ పేరిట జరుగుతున్న విభిన్న కార్యక్రమాల్లో బాగంగా విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో భారీ జాతీయ పతాక ప్రదర్శ నిర్వహించినట్లు ఏయూ విసీ ప్రసాద రావు (VC Prasada Rao) తెలిపారు.



    యువతలో దేశభక్తి, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించే దిశగా 300 అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్‌ సౌత్‌ ఇండియా 2020గా ఎంపికైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ (Charisma Krishna) పాల్గోని ఆకట్టుకున్నారు.

    ఇదీ చదవండి : మిస్ సౌత్ ఇండియాగా అంధ్రా అమ్మాయి.. ఛరిష్మా కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఇదే

    ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పెద్ద ఎత్తున వర్సిటీలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీసీ ప్రసాదరావు తెలిపారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిటీ నుంచి ఎందరో ఉద్యమకారులు పుట్టుకొచ్చారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్లు హర్‌ ఘర్‌కా తిరంగ కార్యక్రమంలో భాగంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ప్రసాదరావు తెలిపారు.

    ఇదీ చదవండి: ఒక్కసారి ఈ జెండాను చూడాలంటే కష్టమే..? త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ.. పొడుగు ఎంతంటే?

    ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగం వద్ద ఈ భారీ ర్యాలీ ప్రారంభమైంది. అక్కడ నుంచి కెమికల్ ఇంజినీరింగ్, ప్రిన్సిపాల్ ఆఫీస్‌, ఈసీఈ (ECE) విభాగం, మెకానికల్, సివిల్ (CIVIL), ఆర్కిటెక్చర్ డిపార్టమెంట్‌, ఎస్పీ ఆఫీస్‌ మీదుగా ఏయూ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ వరకు చేరుకుంది.

    ఇదీ చదవండి : వరలక్ష్మీ వ్రతం మహత్యమా..? గడప ముందుకే వచ్చి పిండకుండానే పాలిస్తున్న గోమాత.. మీరే చూడండి

    ఈ ర్యాలీ ప్రదర్శనలో దారిపొడవునా విద్యార్థులు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. భారీ మువ్వన్నెల జెండాతో సాగిన ర్యాలీ విశాఖ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ పేరి శ్రీనివాసరావు అభినందించారు.

    ఇదీ చదవండి : చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయ్యిందా..? ఢిల్లీ వేదికగా జోరు పెంచుతారా?

    పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని దేశభక్తి చాటుకున్నారు. ఆగస్టు15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం యూనివర్సిటీలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. జాతీయగీతాలాపన నుంచి జెండావందనం వరకు ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Andhra university, AP News, Azadi Ka Amrit Mahotsav, Local News, Visakhapatnam

    తదుపరి వార్తలు