శబరిమల(Sabarimala)యాత్రికులు, అయ్యప్ప (Ayyappa)దర్శనానికి వెళ్లే భక్తులు, స్వాములకు ఇదొక శుభవార్త. ఇప్పటి వరకు ఇరుముడితో పాటు అయ్యప్ప భక్తుడు వెంట తీసుకెళ్లే సంచిలో కొబ్బరి కాయలcoconutsను తీసుకెళ్లకూడదనే నిషేదాన్ని తొలగించారు అధికారులు. మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ, భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భద్రత తనిఖీలు నిర్వహించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(CISF)ప్రకటించింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల లగేజీలో కొబ్బరి కాయలను అనుమతించాలని దేశంలోని అన్నీ విమానాశ్రయాల సెక్యురిటీ సిబ్బందికి ఈమేరకు ఈ విషయాన్ని చేరవేసింది. చెక్-ఇన్ బ్యాగేజీలో ఇరుముడిని పెట్టాలని బెంగుళూరు(Bangalore)లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(Kempegowda International Airport)భద్రతా సిబ్బంది పలువురు యాత్రికులకు చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..
మతపరమైన సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకొని శబరిమల సీజన్లో క్యాబిన్ బ్యాగేజీలో కొబ్బరికాయలను తీసుకెళ్లేందుకు అనుమతించాలని తాము నిర్ణయించామని BCAS జాయింట్ డైరెక్టర్ జైదీప్ ప్రసాద్, వెల్లడించినట్లుగా ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. భక్తుల లగేజీ తనిఖీ విషయంలో జాప్యం జరగడంతో పాటు శబరిమల యాత్రికుల స్క్రీనింగ్ త్వరగా పూర్తి చేయడానికే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే స్క్రీనింగ్ సమయంలో ఇరుముడితో పాటు కొబ్బరి కాయలను తమ లగేజీ బ్యాగులో ఉంచవల్సిందిగా కోరడం జరిగింది.
భక్తులతో కొబ్బరి కాయలకు పర్మిషన్ ..
శబరిమలలోని అయ్యప్ప సన్నిధానంకు చేరుకునే భక్తులకు మార్గం మధ్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తోంది. ఏడాదిలో మూడు కోట్ల మందికిపైగా అయ్యప్పను దర్శిచుకునే భక్తుల్లో కేవలం ఈ మకరజ్యోతి దర్శన సమయంలోనే ఎక్కువగా ఉంటారు. కోటి మందికిపైగా దర్శించుకునే అయ్యప్ప మాలాధారణ స్వాముల్లో సగం మందికిపైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వెళ్తుంటారు.
జాగ్రత్తలు, సూచనలు..
అయితే ఏ విధంగా శబరిమల చేరుకున్న భక్తుల వాహనాలైనా నీల్కల్ దగ్గర నిలిపివేయబడతాయి. అక్కడి నుంచి దేవస్తానం వరకు వెళ్లే కేరళ ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.లని భక్తులు ఉపయోగించుకోవాలి. ఇవి ప్రతి 10నిమిషాల వ్యవధిలో ఒకటి ఉంటుంది. అలాగే సన్నిధానం చేరుకునేందుకు ఏటవాలుగా ఉన్న కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండ ఎక్కే క్రమంలో అయ్యప్పలు
ప్రతి 10నిమిషాలకు ఒక్కసారి ఆగి కాసేపు విశ్రాంతి తీసుకొని ముందుకు సాగడం మంచిది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండే వాళ్లు తప్పని సరిగా కొండ ఎక్కే మార్గంలో ఆక్సిజన్ పార్లర్లు, కార్డియాక్ సెంటర్లను సంప్రదించాలి. వీటితో పాటు రద్దీగా బాగా ఉన్న సమయంలో బస చేయకుండా పంబకు చేరుకోవడం మంచిది.
భక్తుల మేలు కోరుతూ..
పెద్దపాదయాత్రను రాత్రి వేళల్లో నిషేదించింది కేరళ ప్రభుత్వం. కాబట్టి పెద్దపాదం పగటి సమయంలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దపాదం యాత్రంలో ఎరిమేలి, అలుదానది, కాళకట్టి, కరిమల,పెరియారమట్టం, పంబ ప్రాంతాల్లో అయ్యప్ప సేవా సంఘం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాలతో పాటు వైద్య శిభిరాలు, అన్నదాన కేంద్రాలు ఉంటాయి వాటిని ఉపయోగించుకోవచ్చు.శబరిమలతో పాటు కేరళలో పాలిథిన్ బ్యాగుల వాడకం నిషేదం కాబట్టి ప్లస్టిక్ సంచులను వెంట తీసుకుపోవచ్చు.
ఆలయం తెరిచే సమయం ..
ఇరుముడితో పాటు నగదు, వస్తువులు, బ్యాగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వాముల వేషంలో దొంగలు పంబ నదిలో స్నానం చేసే సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు, అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.జనవరి 14న శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ప్రస్తుతం అంటే డిసెంబర్ 26వ తేది వరకు అయ్యప్ప సన్నిధానం తెరిచి ఉంటుంది. డిసెంబర్ 30నుంచి జనవరి 19వరకు ఆలయ తెరిచి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayyappa devotees, Kerala, National News, Sabarimala Temple