హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిందే.. లేకుంటే ఊరుకునేది లేదు..!

తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిందే.. లేకుంటే ఊరుకునేది లేదు..!

X
విశాఖలో

విశాఖలో ఆశావర్కర్ల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly) ఆశా వర్కర్ల సమస్యల పట్ల చర్చ జరగాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తమకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly) ఆశా వర్కర్ల సమస్యల పట్ల చర్చ జరగాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తమకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏపీఆశ వర్కర్స్ యూనియన్, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విశాఖ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ తమకు కనీస వేతనాలు ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాబ్ చార్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ తరపు నుండి కనీస వేతనాలు ఇవ్వకుండా పని ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఇస్తున్నారు. గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సర్వే కైనా సరే తాము తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలో ఏఎన్ఎం తోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ మరోపక్క తెలుపుతున్నారు.

ఇది చదవండి: ఏపీలో వరద అలర్ట్.. అధికారుల హెచ్చరిక

సచివాలయ డ్యూటీ సాయంత్రం అయ్యేసరికి ఎవరైనా గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి తరలించాలంటే ఆశ వర్కర్స్ తప్పనిసరిగా ఉండాలి. సాయంత్రం సమయంలో కూడా గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తీసుకువెళ్లి హాస్పిటల్లో పేరు నమోదు చేసే వరకు అక్కడే ఉండి సొంత ఖర్చులతో ఇంటికి రావాల్సి ఉంటుంది. ప్రతినెల స్కూల్లో విద్యార్థుల యొక్క ఆరోగ్యం నిమిత్తం డ్యూటీలు వేస్తున్నారు. ఇలా మరెన్నో ఎక్కువ పనులు తమకు చెప్తూ జీతాలు మాత్రం తక్కువ ఇస్తున్నారని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు వచ్చే అరకొర జీతాలకు పిల్లలతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam