Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ASANI CYCLONE EFFECT IN VISAKHAPATANAM VIZINAGARAM SRIKAKULAM DISTRICTS HEAVY RAINS FOR UTTARANDRA NGS VZM

Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుఫాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం.. విమానాలు రద్దు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cyclone Asani: ఏపీని మురో ముప్పు భయపెడుతోంది.. వాయు వేగంతో అసని తూఫాను దూసుకొస్తోంది.. తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం కనిపిస్తోంది. సముద్ర తీరంలో కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నాయి. మరోవైపు తుఫాను ఎఫెక్ట్ తో.. విమానాల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.

ఇంకా చదవండి ...
    Cyclone Asani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను మండు వేసవిలో తుఫాను ముప్పు (Cyclone Effect) భయపెడుతోంది. వాయు వేగంతో అసని తుపాను దూసుకొస్తోంది. ఈ అసని తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరమంతా అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీర ప్రాంతంలో కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ (Kakinada) కోనసీమ జిల్లాల తీర ప్రాంతం వెంబడి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విధ్వంసం లా వీస్తున్నాయి. వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తీవ్రత తగ్గి తుపానుగా బలహీనపడొచ్చు. మరింత బలహీనమై తీవ్ర వాయుగుండం వాయవ్య బంగళాఖాతం (Bay of Bengal) లోకి పయనించే అవకాశముందని అంచనా వేశారు. సుమారు గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుఫాను.. నిన్న రాత్రి విశాఖ (Visakha) కు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అది తీరానికి దగ్గరగా వస్తే గాలుల తీవ్రత రెట్టింపు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే తీరానికి దూరంగా పయనిస్తే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

    ఈ తుఫాను ప్రభావంతో.. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు తూర్పు గోదావరి (East Godavari) , విజయవాడ (Vijayawada), విశాఖపట్టణం (Visakhapantam), విజయనగరం (Vizianagaram), శ్రీకాకుళం (Srikakulam) లోనే గాక ఒడీశా (Odisha) లోని కోస్తా జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. గాలులు సుమారు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంటున్నారు. సముద్ర తీరంలో ప్రస్తుతం కెరటాలు భారీగా ఎగిసి పడుతున్నారు. కెరటాల ప్రభావానికి ఉప్పాడ తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతోంది.

    ఇదీ చదవండి: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో పొలిటికల్ హీట్.. సీఎం జగన్ తో మంత్రి బొత్స భేటీ

    మరోవైపు తుపాను ప్రభావంతో వాతావారణం అనుకూలంగా లేకపోవడంతో విశాఖకు విమాన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌, ముంబై, చెన్నై నుంచి విశాఖకు వచ్చే ఇండిగో విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్డీవో కార్యాలయాల కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే తీరప్రాంత మండలాల్లో ఉన్న ఉద్యోగులను సైతం అధికారులు అప్రమత్తం చేశారు. ఇండిగో అన్ని విమాన సర్వీసులను రద్దు చేయగా.. ఎయిర్ ఏషియా రెండు విమానాలను రద్దు చేసింది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక హెల్ప్ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు.

    ఇదీ చదవండి: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ

    మరోవైపు ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారుల సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. విశాఖ, విజయనగరం,శ్రీకాకుళం,ఈస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Heavy Rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు