హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Army Recruitment Rally: నిరుద్యోగులకు షాక్... కీలక రిక్రూట్మెంట్ ర్యాలీ వాయిదా..

Army Recruitment Rally: నిరుద్యోగులకు షాక్... కీలక రిక్రూట్మెంట్ ర్యాలీ వాయిదా..

విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వాయిదా

విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వాయిదా

ఒకవైపు కరోనా. ఇంకో వైపు ఉద్యోగ పరీక్ష. 65 వేల మంది ఉద్యోగార్ధుల ఎదురుచూపు. ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్ మెంట్ (Vizag Army recruitment Rally) కథ.

P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

ఒకవైపు కరోనా. ఇంకో వైపు ఉద్యోగ పరీక్ష. 65 వేల మంది ఉద్యోగార్ధుల ఎదురుచూపు. ఇదీ క్లుప్తంగా విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్ మెంట్ కథ. యువకులు ఉద్యోగం కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తూ ఉండిపోయారు. కానీ కోవిడ్ కారణంగా రిక్రూట్ మెంట్ నిర్వహించలేమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. నిర్ణీత సమయానికి ఈ‌ ఏడాది ఇండియన్ ఆర్మీ విశాఖపట్నంలో రిక్రూట్ మెంట్ నిర్వహించాలి. ఓపెన్ ర్యాలీ సెలక్షన్స్ ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించడానికి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి 65 వేల మంది ఉద్యోగులు ఇప్పటికే అప్లికేషన్ పెట్టారు. దీనికి హాల్ టికెట్లు ఆగస్టు 9వ తేదీ నుండి విడుదల చేస్తామని ఇంతకుముందు తెలిపారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో సెలక్షన్ కొరకు ఏర్పాట్లు చేశారు.

మూడు రోజులుగా విశాఖపట్నం ఆర్మీ సెలక్షన్ వాయిదా పడిందని కొన్నిరకాల వీడియోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని ఉద్యోగార్ధులు అంటున్నారు. విశాఖపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని‌ అంటున్నారు. ఇదే విషయాన్ని ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ధృవీకరించింది. వాయిదాకి సంబంధించిన సమాచారాన్ని అప్ లోడ్ చేసింది. ఇప్పటికే 2019 తర్వాత ఒక ఆర్మీ నోటిఫికేషన్ కూడా జరగకపోవడం వల్ల ఎంతోమంది ఉద్యోగార్థులు వయో పరిమితి మించిపోయి అర్హత కోల్పోయారు.

ఇది చవండి: ఏపీలో విజృంభిస్తున్న మరో మహమ్మారి... అస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం..


ఇప్పుడు వేల మంది ఆర్మీ ఉద్యోగార్థులు ఆశగా ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ కోసం వేల రూపాయలు ఖర్చు చేసి వివిధ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కరోనా కేసులు, వర్షం కారణంగా చూపించి పోస్ట్ పోన్ చేయడంతో బాధాకరంగా ఉందని‌ ఉద్యోగార్ధులు అంటున్నారు. గత నెలలో గుంటూరు ఆర్మీ ర్యాలీ వర్షంలో‌ జరిగిందని, సెలక్షన్ నిర్వహించి ఉద్యోగార్థులకు న్యాయం చేశారని‌ గుర్తుచేశారు.

ఇది చదవండి: ఆషాఢమని పుట్టింటికి వచ్చిన నవ వధువు.. ఇంతలో మాజీ ప్రియుడు కలిశాడు.. ఆ తర్వాత...


విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగవలసిన రిక్రూట్ మెంట్ వాయిదా పడిందని విశాఖ సైనిక్ వెల్ఫేర్ బోర్డు కూడా ధృవీకరించింది. సెలక్షన్ కి కోవిడ్ నిబంధనలు ఉన్నాయని.. అందుకే పోస్ట్ పోన్ చేశామని చెప్పారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కి కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి సమాచారం ఇస్తున్నారు. యధావిధిగా ఆగస్టు 16 నుండి సెలెక్షన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని.. ఉద్యోగార్థుల అభ్యర్థన.‌ ఇక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా తక్కువ ఉన్నాయి.‌ ఇంకా ఒకవేళ వాయిదా వేసినట్లయితే మూడు దశ కరోనా విజృంభిస్తే మరొక రెండు నెలల నుంచి మూడు నెలలు వాయిదా వేసే అవకాశం ఉండడం వల్ల ఆర్మీ ఉద్యోగార్థులు మరింత నష్టపోయే అవకాశం ఉంది. కోవిడ్ ఈ విధంగా వేల మంది ఉద్యోగార్ధుల ఆశలపై ఇలా నీళ్ల చల్లేసింది.

First published:

Tags: Andhra Pradesh, Army jobs, Visakhapatnam

ఉత్తమ కథలు