S Jagadeesh, News18, Visakhapatnam
తెలుగువారు ఫుడ్ లవర్స్. అందునా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అయితే వెరైటీ వంటకాలు, మసాలా ఐటమ్స్ కు ఫిదా అవుతారు. అలాంటి వాటిలో ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది బొంగు చికెన్ (Bamboo Chicken). ప్రస్తుతం విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీలో బొంగు చికెన్ చాలా ఫేమస్. అందుకో అరకు టూర్ కు వెళ్లిన వారు బొంగు చికెన్ తినకుండా తిరిగిరారు. ఇప్పుడీ బొంగు చికెన్ వైజాగ్ సిటీలోనే దొరుకుతుంది. అదే రుచి, అదే క్వాలిటీతో. దీంతో ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బొంగులో చికెన్ వ్యాపారం మీదే విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఈ ఇదే బొంగులో చికెన్ విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో కూడా దొరుకుతుంది.
ఓ గిరిజన కుటుంబం ఏజెన్సీ నుండి బొంగులు (Bamboo) తీసుకువచ్చి ఎంతో రుచికరమైన ఈ చికెన్ నగర వాసులకు అందిస్తున్నారు. అక్కడికి అధిక సంఖ్యలో నగర వాసులు వెళ్లి రుచి చూస్తున్నారు. ఆహా ఏమి రుచి…అనరా మైమరిచి అంటూ లొట్టలేసుకుంటున్నారు. బొంగులో చికెన్ కేజీ రూ. 600, అర కేజి రూ. 300, పావు కేజీ రూ.150 చొప్పున మూడు విధాలుగా అమ్మకాలు జరుపుతున్నారు.
అరకు వెళ్లే వారిని ప్రకృతి అందాలతో పాటు మరో ప్రత్యేకమైన వంటకం ఆకర్షిస్తుంది.. అదే బొంగులో చికెన్. అంటే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. చికెన్‌ని వంటపాత్రల్లో కాకుండా ప్రకృతిలో దొరికే బొంగులో వండుతారు. మాంసానికి ఉప్పు, కారం దట్టించి దానిని వెదురు బొంగులో కూర్చి.. మంటపై ఉడికించి వేడివేడిగా పర్యాటకులకు వడ్డిస్తారు.
విశాఖ ఏజెన్సీలోని అరకులోయ నుంచి మారేడుమిల్లి వరకు గల పర్యటక ప్రాంతాల్లో మాత్రమే ఈ బొంగులో చికెన్ అందుబాటులో ఉంటుంది. అత్యంత రుచికరమైన ఈ వంటకాన్ని తయారుచేయడం కొంతమంది గిరిజనులకే సాధ్యపడుతుంది. విశాఖను మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు, ఈ బొంగు చికెన్ బ్రాండ్‌గా మారింది. అక్కడికి వెళ్లివచ్చిన జనాలు తమ స్నేహితులతో యాత్రా విశేషాలను చెప్పుకునే సమయంలో ఖచ్చితంగా బొంగులో చికెన్ విషయాన్ని ప్రస్తావించకుండా ఉండలేరు. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ బొంగులో చికెన్.
ఇప్పుడు ఇది వైజాగ్ సిటీలోనే దొరకుతుండటంతో నగరవాసులు, ఫుడ్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజు వారీ ఇంట్లో వండుకునే చికెన్ కన్నా, ఇది ఎంతో రుచికరంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ కి వెళ్లలేని నాన్ వెజ్ ప్రియులు ఇక్కడ బొంగు చికెన్ లొట్టలేసుకుంటు తింటున్నారు.. ఇది రుచికరం తో పాటు ఆరోగ్యం కూడా దీనివలన లభిస్తుందని నిర్వాహకులు కూడా చెప్తున్నారు.
బొంగు చికెన్ తయారీ విధానం :
ఇది తయారు చేసే విధానం చాలా సులభంగా వుంటుంది. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి దానికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, కారం, చికెన్ మసాలా , కొంచెం నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. లావుగా ఉన్న ఎదురు నరికి అందులో మసాలా దట్టించిన కోడి మాంసాన్ని ఎదురు బోగులో నిపాలి. రెండు వైపు లా ఆకులు కప్పి మంటలో 20 నిమిషాలు వరకు కాలిస్తే, వెదురులో వుండే సహజమైన నీటి ఆవిరికి మాంసం ఉడకడం వలన రుచి అదిరిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chicken, Visakhapatnam