VISAKHAPATNAM ARAKU COFFEE FARMERS MAY EAR PROFITS THIS YEAR AS YIELD INCREASED GRADUALLY IN VISAKHAPATNAM DISTRICT FULL DETAILS HERE PRN VSP
Araku Coffee: సిరులు కురిపిస్తున్న అరకు కాఫీ... గిరి రైతుల పంట పండినట్లే...
అరకు కాఫీ తోటలు (ఫైల్)
విశాఖపట్నం (Visakhapatnam) ఏజెన్సీవ్యాప్తంగా సుమారు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు (Coffee Plants) ఉన్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంటుంది.
ఓ మంచి కాఫీ... తీయ్యని అనుభూతిని కలిగిస్తుంది. మనస్సుకు నచ్చిన వారితో కబుర్లు చెబుతూ... కాఫీని ఆస్వాదించటం ఓ మధుర జ్ఞాపకం. ఇంతటి విశిష్ట కలిగిన కాఫీ పంట మన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోనూ పండుతోంది. అంతేనా అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను అందుకోవటంతో పాటు... కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. విశిష్టత కలిగిన కాఫీ తయారీలో కీలక పాత్ర వహిస్తోంది విశాఖపట్నం (Visakhapatnam). ఏజెన్సీలో ఎన్నో ఆకర్షణ కలిగిన ప్రకృతి విశేషాలు ఉన్నాయి. అందులో కాఫీ ఒకటి. ఇక ఈఏడాది కాఫీ తోటలు విరగ్గాశాయి. ఎరుపు, గోధుమ-పసుపు మిశ్రమ వర్ణాలతో పక్వానికి వచ్చిన పండ్లతో కాఫీ మొక్కలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. సాధారణ దిగుబడితో పోలిస్తే ఈ ఏడాది 20 నుంచి 25 శాతం వరకు అధికంగా వస్తుందని గిరిజన రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీవ్యాప్తంగా సుమారు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంటుంది. పూత, పిందె సమయాల్లో వాతావరణం అనుకూలిస్తే మరికొంచెం పెరుగుతుంది. ఏటా మార్చి నుంచి ఏప్రిల్ వరకుకాఫీ మొక్కలు పూతకు వస్తాయి. నవంబరు మొదటి వారం నుంచి కాఫీ పండ్లు పక్వానికి రావడం మొదలవుతుంది. డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు పండ్ల సేకరణ జరుగుతుంది. అయితే ఈసారి అక్కడక్కడా కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. డిసెంబరులో పండ్ల సేకరణ ఊపందుకుంటుంది.
కాగా ఈ ఏడాది కాఫీ తోటలు పూత దశలో వున్నప్పుడు వర్షాలు సమృద్ధిగా కురవడంతో కాపు ఆశాజనకంగా వుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 170 నుంచి 200 కిలోల వరకు దిగుబడి వస్తుందని, ధర కూడా బాగుంటే మంచి ఆదాయం లభిస్తుందని అంటున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గత ఏడాది కాఫీ పార్చ్మెంట్ (కాఫీ పప్పు) రూ.160కు కొనుగోలు చేసింది. ఈ ఏడాది కొనుగోలు ధరలను వచ్చే నెలలో జీసీసీ ప్రకటిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈ ఏడాది కొనుగోలు ధరలు పెరిగే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.
ఈ ఏడాది కాఫీ కాపు బాగుందని, వేసవిలో సమృద్ధిగా వర్షాలు పడడం, వాతావరణం అనుకూలంగా వుండడంతో పూత, పిందె బాగా వచ్చిందని అంటున్నారు. దీంతో ఎకరాకు 50 కిలోల వరకు దిగుబడి పెరిగే అవకాశాలు వున్నాయి. పలు ప్రాంతాల్లో ఇటీవల తోటలను పరిశీలించాను. కాపు బాగుందని, దిగుబడి పెరుతుందదని రైతులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.