Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM AQUARIUM NAMED MATSYADARSHINI WILL GIVE YOU DIFFERENT EXPERIENCE IN VIZAG RK BEACH ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag: మత్స్యదర్శిని మిమ్మల్ని మాయ చేస్తుంది.. అదో అద్భుత ప్రపంచం

మత్స్యదర్శిని

మత్స్యదర్శిని

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యటకానికి కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం (Visakhapatnam). వైజాగ్ ఆర్కే బీచ్‌ (Vizag RK Beach) కు అభిముఖంగా ఏర్పాటు చేసిన మత్య్సదర్శిని నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. రకరకాల చేపలు, వారి గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించే మ్యూజియం ఇది.

ఇంకా చదవండి ...
  Setti Jagadeesh, News18, Visakhapatnam

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పర్యటకానికి కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం (Visakhapatnam). వైజాగ్ ఆర్కే బీచ్‌ (Vizag RK Beach) కు అభిముఖంగా ఏర్పాటు చేసిన మత్య్సదర్శిని నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. రకరకాల చేపలు, వారి గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని అందించే మ్యూజియం ఇది. ఈ మత్స్యదర్శిని ఆక్వేరియం చూశారంటే... అందమైన చేపలు చూడాలనుకునే మీ కల నిజమవుతుంది. మీ పిల్లలకు ఇదో సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈదుతున్న చేపపిల్లలను చూస్తే ఎంత అలసిన మనసుకు అహ్లాదంగా ఉంటుంది. రొటీన్‌ లైఫ్‌తో బిజీగా ఉండేవాళ్లు ఆక్వేరియంలో చేపపిల్లలను చూస్తూ రిలాక్స్‌ అవుతుంటారు. అందుకే చాలా మంది ఇళ్లలో ఆక్వేరియాలను ఏర్పాటుచేసుకుంటారు. అందులోనూ కలర్‌ఫుల్‌ చేపలపిల్లలను చూస్తుంటే మనసు ఎటో తేలిపోతుంది.

  మత్య్సలోకంలోకి అడుగుపెడితే..!
  టిక్కెట్‌ తీసుకుని లోపలకు వెళ్లగానే ఇక్కడ మనకు రకరకాల జాతులు కనువిందుచేస్తాయి. ఈ ఆక్వేరియంలో దాదాపు ఇరవై రకాల పరిమాణాల్లో వాటర్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో వాటర్‌ను ఏరోజు కారోజు ఫ్రెష్‌గా ఉంచుతారు. వివిధ జాతులకు చెందిన రంగు రంగు చేపలు ఇక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. చిన్నచిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపలు ఇక్కడ కనిపిస్తాయి.
  ఈ మత్య్సదర్శిని ఆక్వేరియాన్ని జీవీఎంసీ ఏర్పాటుచేసి లీజుకు ఇచ్చింది. తొలుత మునిసిపల్‌ కమిషనర్‌ బంగ్లాలో ఉన్న మత్స్యదర్శినిని తర్వాత ఆర్కే బీచ్‌ సమీపంలోకి మార్చారు. 1990 సంవత్సరం వరకు మునిసిపల్ కమిషనర్ యాజమాన్యంలో ఉన్న బ్రిటిష్‌ బంగ్లాలో ఈ మత్స్యదర్శిని ఉండేది. తర్వాత టూరిస్టులను ఆకర్షించేందుకు దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. ఆర్కేబీచ్‌ రోడ్‌లో మత్య్సదర్శిని ఆక్వేరియం పేరిట ఓపెన్‌ చేశారు.

  ఇది చదవండి: ఆటోగ్రాఫ్‌.. మిక్కీమౌస్‌.. ఫస్ట్‌ లవ్‌.. ఇవన్నీ మొక్కల పేర్లే సుమీ..! కావాలంటే మీరే చూడండి..!


  ప్రధాన ఆకర్షణగా విదేశీ చేపలు
  ఈ ఆక్వేరియంలో విదేశాలకు చెందిన రకరకాల చేపలను ప్రదర్శనలో ఉంచారు. అందులో లాంగ్ హార్న్ కౌ ఫిష్, నెమలి వ్రాస్సే, ఎలక్ట్రిక్ రే, పోర్క్ పైన్ ఫిష్, రెడ్ స్క్విరెల్ ఫిష్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆక్వేరియంలో కనిపించే కొన్ని సముద్ర చేపలు స్టార్ ఫిష్, టెన్టకిల్ ఎనిమోన్లు మరియు సీ ఎనిమోన్లు ఉన్నాయి. సింగపూర్‌, మలేషియా తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన రకరకాల చేపలతో అలరారే మత్స్యదర్శినిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.

  ఇది చదవండి: వైజాగ్ వెళ్తే ఇక్కడికి వెళ్లడం అస్సలు మర్చిపోవద్దు.. ఫుడ్ లవర్స్ కి ఇదే బెస్ట్ ఛాయిస్


  పర్యాటకులు ఫిదా
  ఈ ఫిష్‌ ఆక్వేరియం పర్యాటకులను ఫిదా చేస్తుంది. మత్య్సలోకానికేమైనా వచ్చామా అనేంతగా అట్రాక్ట్‌ చేస్తుంది. ఆక్వేరియం అందాలు చూడతరమా అంటున్నారు టూరిస్టులు. ఈ ఆక్వేరియం అంతా ఏసీ ఎఫెక్ట్‌తో చల్ల చల్లగా ఉంటుంది.

  ఇది చదవండి: విశాఖకే తలమానికం ఆ ప్రాంతం.. కానీ ఇప్పుడు శిథిలావస్థలో..


  సెల్ఫీలు దిగుతూ సందడి
  పిల్లల ఆనందానికి అవధులుండవ్‌…పెద్దలు సైతం చిన్న పిల్లల్లా మారి ఇక్కడ ఎంజాయ్‌ చేస్తూంటారు. చేపపిల్లలతో కలసి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తుంటారు. నగరవాసులైతే వీకెండ్స్‌, వీలు దొరికినప్పుడల్లా ఇక్కడకు వచ్చి వాళ్లకున్న ఒత్తిడిని దూరం చేసుకుని…తిరిగి మళ్లీ ప్రశాంతంగా వెళ్తుంటారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  పిల్లలకు విజ్ఞానం, వినోదం అందించే ఆక్వేరియం
  మత్స్యదర్శిని ఆక్వేరియం పిల్లలకు మత్స్య సంపద పై విజ్ఞానాన్ని పెంచుతుంది. రంగురంగుల చేపల పిల్లలను దగ్గర నుండి చూస్తే పిల్లలు ఎంతో ఆనందిస్తారు. ఎంతో ఆసక్తిగా వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు.  మత్స్య దర్శిని టైమింగ్స్
  వారంలో ఏడు రోజులు ఈ ఆక్వేరియం తెరిచే ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏ సమయంలోనైనా మీరు వెళ్లి ఈ ఆక్వేరియంలోని చేపలను తిలకించవచ్చు.
  ఎంట్రీ ఫీ : చిన్నపిల్లలకు రూ. 20/-, పెద్దవాళ్లకు రూ.60/-
  అడ్రస్‌: బీచ్‌ రోడ్‌, పాండురంగపురం, చిన్న వాల్తేర్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌ - 530003
  మత్స్య దర్శిని ఆక్వేరియం ఫోన్‌ నెంబర్‌: +91 9652027812

  Vizag Matsya Darshini_Map

  ఎలా వెళ్లాలి..?
  మత్స్యదర్శిని అక్వేరియం రామకృష్ణ బీచ్‌లో ఉంది. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్టాండ్‌ నుంచి అక్కడికి చేరుకోవడానికి బస్సు, ఆటో సౌకర్యం ఉంది. ప్రైవేట్ క్యాబ్‌లు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు