హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

APSRTC: ఇకపై జేబులో డబ్బులు లేకపోయినా ఎంచక్కా బస్సు ఎక్కేయొచ్చు..!

APSRTC: ఇకపై జేబులో డబ్బులు లేకపోయినా ఎంచక్కా బస్సు ఎక్కేయొచ్చు..!

ఆర్టీసీలో

ఆర్టీసీలో డిజిటల్ పేమెంట్స్ కు శ్రీకారం

మీరు పర్సు మర్చిపోయి ఎప్పుడైనా బస్సు ఎక్కారా..! చిల్లర లేకుండా కండక్టర్ తో గొడవపడ్డారా..? ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి లైఫ్ ‌లో ఏదో ఒకరోజు జరిగే ఉంటాయి. ఇకపై ఎప్పుడైనా అలా జరిగితే కంగారు పడక్కర్లేదు..! కూల్ గా, మీ చేతిలో మొబైల్‌ తీస్తే చాలు..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  మీరు పర్సు మర్చిపోయి ఎప్పుడైనా బస్సు ఎక్కారా..! చిల్లర లేకుండా కండక్టర్ తో గొడవపడ్డారా..? ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి లైఫ్ ‌లో ఏదో ఒకరోజు జరిగే ఉంటాయి. ఇకపై ఎప్పుడైనా అలా జరిగితే కంగారు పడక్కర్లేదు..! కూల్ గా, మీ చేతిలో మొబైల్‌ తీస్తే చాలు.. ఆ ఫోన్ తోనే మీరు టిక్కెట్‌ కొనుగోలు చేసుకోవచ్చు. మీరు చదివింది నిజమే..! విశాఖపట్నం (Visakhapatnam) ఆర్టీసీ బస్సుల్లో (APSRCT) డిజిటల్‌ పేమెంట్స్ (Digital Payments)‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు విశాఖ ఆర్టీసీ అధికారులు డిజిటల్‌ పేమెంట్స్‌లో టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ద్వారక నగర్ డిపోలో ఈ సేవలను డి.పి.టి.ఓ అప్పలరాజు 15 రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభించారు.

  ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులకు ఈ సేవలు అందిస్తుండగా అతి త్వరలో అన్ని సర్వీసులకు విస్తరించనున్నారు. గతంలో ఊరెళ్లాలంటే బస్సు టికెట్‌కు సరిపడా చిల్లర జేబులో పెట్టుకుని మరి ప్రయాణించే రోజులు చూసాము. ఇకపై జేబులో డబ్బుల్లేకుండా డిజిటల్ పేమెంట్ చేసుకొని ఎంచక్కా ఆర్టీసీ బస్సుల్లో తిరిగేయోచ్చు. ఇటీవల పెద్ద నగరాల్లో ప్రయోగత్మాకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ తో ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ అమలవుతోంది. విశాఖపట్నంలో ప్రయాణికుల సౌకర్యార్థం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్స్ (UTS) టిమ్స్ మిషన్‌ల ద్వారా ప్రయాణికులకు డిజిటల్ పేమెంట్ అందిస్తున్నారు.

  ఇది చదవండి: విశాఖలో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌కు యమ క్రేజ్‌...! తినేందుకు క్యూ కడుతున్న నగరవాసులు..!

  ఈ మిషన్‌ల ద్వారా ప్రయాణికులు జేబులో డబ్బులు లేకపోయినా ఏటీఎమ్ కార్డ్, ఈ వాలెట్స్ ‌( గూగుల్ పే (Google Pay) , ఫోన్ పే (Phone Pay) , పేటీఎం (Paytm) ) వంటి యాప్స్ ‌తో పేమెంట్ చేయవచ్చు. ఈ డిజిటల్‌ పేమెంట్స్ ‌కు సంబంధించి కండక్టరు, డ్రైవర్లు పూర్తి స్థాయిలో శిక్షణ పొందారు. వీటితో యూపీఐ (UPI) ద్వారా ప్రయాణికులు అందరూ టికెట్ సొమ్మును డిజిటల్ పేమెంట్ రూపంలో సులువుగా చెల్లించవచ్చు. ఈ కొత్త ఆప్షన్‌తో ప్రయాణికులు ఎక్కడ ఉన్నా బస్సులో సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు.

  ఇది చదవండి: ఈ కోటను చూస్తే మైమరచిపోవాల్సిందే...! అంతటి అద్భుత నిర్మాణం ఎలా సాధ్యమైందంటే..!

  విశాఖపట్నంలో బస్సు ప్రారంభం అయిన తర్వాత కూడా గాజువాక, అనకాపల్లిలో ఉన్న ప్రయాణికులు తమ సీటు రిజర్వేషన్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. నగరహిత లావాదేవీలు ఉండడంతో తమకు చిల్లర సమస్య తప్పిందని డిజిటల్ పేమెంట్ కారణంగా ప్రయాణికులు కూడా సులభంగా పేమెంట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని కండక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

  ప్రయాణం చేయాలంటే సరిపడ చిల్లరతో ప్రయాణం చేసే తమకు డిజిటల్‌ పేమెంట్స్‌ పెట్టి చాలా మంచి పని చేశారంటూ ప్రయాణికులు అంటున్నారు. యూపీఐ పేమెంట్స్ అలవాటు అయిపోయి ఇబ్బందికరంగా ఉండేదని ఆర్టీసీలో కూడా ఆ సదుపాయం రావడంతో చాలా బాగుందంటూ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  ప్రారంభ దశలో కొన్ని సర్వీసులకు అందించామని త్వరలో అందరికీ అందిస్తామని తెలిపారు. సుధీర ప్రాంతాలకు వెళ్లే కొన్ని సర్వీసులకు మాత్రమే ప్రస్తుతం ఈ సర్వీసు అందుబాటులో ఉందని.., తదుపరి అన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులో యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Apsrtc, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు