హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ప్రైవేట్ బస్సులు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీకి అద్దె బస్సులు కావలెను..!

ప్రైవేట్ బస్సులు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీకి అద్దె బస్సులు కావలెను..!

విశాఖలో

విశాఖలో కొత్త బస్సులకు ఆర్టీసీ టెండర్లు

విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో రోజురోజుకీ ఆర్టీసీ (APSRTC) ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వాళ్లకు సమయానికి బస్సులు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో రోజురోజుకీ ఆర్టీసీ (APSRTC) ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వాళ్లకు సమయానికి బస్సులు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త బస్సులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశాలకు ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాన్ని చేరేందుకు సన్నహాలు చేస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్ ప్రకారం రద్దీ తగ్గించేందుకు అధికారులు టెండర్లకు ఆహ్వానం పలుకుతున్నారు. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు బస్సులు దొరక్క ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్టీసీ ఆధీనంలో ఉన్న కొన్ని బస్సులు చివరి దశకు చేరుకోవడంతో డిపోకే పరిమితం అవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని నూతన బస్సులకు టెండర్ల ఆహ్వానం పలికారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.

  విశాఖపట్నంలో త్వరలో కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. వాటిని అవసరమైన రద్దీ మార్గాల్లో తిప్పనున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 83 బస్సులు కేటాయించారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న వీటికి టెండర్లు ఆహ్వానించగా ఇప్పటికే 25 ఖరారయ్యాయి. అద్దె బస్సుల్లో ఇంకా టెండరు ఖరారు కావాల్సిన 58 బస్సులకు వచ్చే నెల 12 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని విశాఖ జిల్లా ప్రజారవాణాధికారి అప్పలరాజు తెలిపారు.

  ఇది చదవండి: వీళ్లు మారరు..! ఎన్ని ఫైన్‌లు వేసినా వీళ్లు ఇంతే..! కళ్లు కనిపించడం లేదా..?

  మొదటి టెండరుకు పెద్దగా స్పందన కనిపించలేదు. టెండరు పూర్తి అయిన తర్వాత యజమానులు ముందుకొస్తున్నారు. మొదట తక్కువ సంఖ్యలో టెండర్లు రావడంతో 25 బస్సులు తీసుకున్నారు. మిగతా బస్సుల కోసం మరో మారు టెండర్లు ఆహ్వానం పలికింది ఆర్టీసీ. ఈ అద్దె బస్సులను రద్దీ రూట్లలో తిప్పెందుకి సన్నాహాలు చేస్తున్నారు.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  విశాఖ ఆర్టీసీలో టెండర్లు పూర్తయిన తర్వాత రానున్న మరికొన్ని అద్దె బస్సులను విశాఖ నుంచి అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ , సోంపేట పాలకొండ, మందస, రూట్లలో తిప్పుతాం అని అధికారులు స్పష్టం చేశారు. అలాగే పాత గాజువాక విజయనగరం , సింధియా కొత్తవలస, ద్వారకా కాంప్లెక్స్‌ నుంచి దేవరాపల్లి, అనకాపల్లి, ఎలమంచిలి, భీమిలి మార్గాల్లో, ఆర్కేబీచ్ పెందుర్తి కొత్తవలస, సింహాచలం-చోడవరం, సింహాచలం విజయనగరం, సింహాచలం-సింధియా రూట్లలోనూ నడిపేందుకు అధికారులు ప్రణాళిక చేశారు.

  విశాఖపట్నంతో పాటు అనకాపల్లి జిల్లాకు ఈ అద్దె బస్సులు రానున్నాయి. వీటిని అనకాపలి-నర్సీపట్నం, అనకాపల్లి టు పాయకరావుపేట, నర్సీపట్నం టు విశాఖ, నర్సీపట్నం టు చోడవరం మార్గాలకు కొన్ని బస్సులు కేటాయిస్తాం అని అధికారులు తెలిపారు. ఎవరైనా టెండర్ పాల్గొనేవారు ఏపీఎస్ఆర్టీసీ ప్రధాని వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలు కావలసిన వాళ్లు డిపోకు వస్తే క్లుప్తంగా వివరిస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Apsrtc, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు