Setti Jagadeesh, News 18, Visakhapatnam
రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆసుపత్రిలను నాడు-నేడు విధా నంలో అభివృద్ధి చేయడంతో పాటు, పూర్తిస్థాయిలో మౌలికవ సతులు కల్పిస్తుంది. తాజాగా. అత్యవసర సమయాల్లో వినియోగించే 108 వాహనాలను ఇక నుంచి డయాలసిస్ రోగులకు సైతం ఉచితంగా రవాణా సేవల ను అందిస్తున్నారు. సదరు రోగి ప్రస్తుతం డయాలసిస్ చేయించుకునే ఆసుపత్రికి వారంలో ఎన్ని సార్లు అవసరం అయితే అన్ని సార్లు ఉచితంగానే ఈ సేవలను పొందేలా వినూత్నంగా చర్యలు తీసుకుంటుంది. దీంతో డయాలసిస్ రోగులంతా రూపాయి ఖర్చు లేకుండా వారి ఇంటి వద్ద నుంచే ఆసుపత్రికి తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. కిడ్నీ రోగంతో డయాలసిస్ చేయించుకుంటున్న రోగులంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.
నెలకు 200 మంది రోగులకు సేవలు
డయాలసిస్ రోగులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు నెలకు సుమారుగా 200 మంది వరకూ రోగులను 108 అంబులెన్స్ల ద్వారా వెళ్ళవచ్చు. కిడ్నీ రోగంతో డయాలసిస్ చేయించుకుంటున్న రోగులంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. ప్రతి నెల డయాలసిస్ కొరకు ప్రైవేటు వాహనాల్లోనూ సొంత వ్యక్తులు సొంత వాహనాలు ద్వారా తీసుకువచ్చి డయాలసిస్ చేయించుకొని తీసుకు వెళ్లేవారు.
వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని ప్రకటన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడంతో తాజాగా నిర్ణయం తీసుకుంది. వారికి పెన్షన్ ఇస్తూ ఉచిత రవాణా కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అనేకమంది డయాలసిస్ తో బాధపడే రోగులు సురక్షితంగా ఆసుపత్రికి చేరుకోవచ్చు. ప్రభుత్వం ఉచితంగానే రోగులకు ఆసుపత్రులకు తరలించడంతో చాలా మంది ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకపోవడంతో చాలా వరకూ ఉపశమనం పొందుతున్నారు. ఇకపై వారానికి ఒకసారి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Apsrtc, Local News, Visakhapatnam