Setti Jagadeesh, News 18, Visakhapatnam
సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే నగరం నుండి పల్లెటూరుకు అధిక సంఖ్యలో ప్రజలు వెళుతూ ఉంటారు. ఎక్కువ శాతం ఆర్టీసీ (APSRTC) లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు అధిక శాతం వసూలు చేసేవారు కానీ ఎప్పటినుండి అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ ప్రయాణాలు సాగుతాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి ఇంటికి వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్తలు చెప్పింది. సంక్రాంతి పండగకు ఊరు వెళ్లే వారికి రాయితీని ప్రకటించింది. రానూపోనూ ఆర్టీసీలో టిక్కెట్టును ముందుగా బుక్ చేసుకుంటే వారికి తిరుగు ప్రయాణంలో (ఏసీ, నాన్ ఏసీ ఏ బస్సుకైనా) 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. సంక్రాంతి ప్రయాణికులకు ఆర్టీసీ మరో ఆఫర్ ఇచ్చింది ప్రతి సంవత్సరం దసరా, సంక్రాంతి పండగల సమయంలో చాలామంది ప్రయాణికులు ఇంటికి వెళ్తూ ఉంటారు అప్పుడు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ స్పెషల్స్ బస్ లు ఏర్పాటు చేసి అధిక ధరలు వసూలు చేసేవారు.
కానీ ఈ సంవత్సరం అది లేదు.. ఈసారి సంక్రాంతికి మాత్రం స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేయడం లేదని చెప్పారు. దసరా బస్సులో అదనపు చార్జీలు లేకుండా నడపడం జరిగింది. అలా నడపడంతో అదనపు చార్జీ లేకుండానే ఆశించిన స్థాయిలో ఆదాయమూ సమకూరింది. దీంతో ఈ సంక్రాంతికి కూడా అదనపు చార్జీలు లేకుండా బస్సులు నడపాలని అధికారులు తెలపడం జరిగింది.
ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభం
ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్లే ప్రయాణికుల కోసం ఇదివరకే ఆన్లైన్ బుకింగ్ ప్రారంభించడం జరిగింది. దూరప్రాంతాలకు వెళ్లే వారు కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రానూపోనూ టిక్కెట్టును ముందుగా బుక్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణం చార్జీలో 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు తిరుగు ప్రయాణంలో ఏ బస్సులో ప్రయాణించినా టిక్కెట్టుపై 10 శాతం రాయితీ వర్తిస్తుందన్నారని నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్లే ప్రయాణికులు ఈ apsrtconline.inవెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Apsrtc, Local News, Sankranti 2023, Visakhapatnam