హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Weather: ఇవాళ తీరం దాటనున్న వాయుగుండం... ఏపీకి భారీ వర్షాలు..!

AP Weather: ఇవాళ తీరం దాటనున్న వాయుగుండం... ఏపీకి భారీ వర్షాలు..!

ఈ ప్రభావంతోఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు శ్రీలంకలో తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.ఇవాళ వాయుగుండం తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతోఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు శ్రీలంకలో తీరం దాటే అవకాశముందని చెబుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో నిన్నటి నుంచే ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం నటి సాయంత్రానికి పశ్చిమ దిశగా పయనించి తర్వాత దిశను మార్చుకుని రేపటికి శ్రీలంకలో తీరం దాటనుంది.

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 24 గంటల్లో నెల్లూరు , చిత్తూరు , ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ , గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికను జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. మంగళవారం మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం రేపు సాయంత్రం వరకు పశ్చిమ దిశగా పయనించి... ఆ తర్వాత దక్షిణ నైరుతిగా దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటనుంది.

ఈ ప్రభావంతో ఏపీలోని నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

First published:

Tags: Local News, Visakhapatnam, Vizag