Anand Mohan Pudipeddi, Visakhapatnam,News18.
Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల స్వప్పం సాకారమవుతోంది. ఎప్పటి నుంచి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (International Airport) కోసం ఎదురుచూస్తున్న వారికి కోర్టు శుభవార్త చెప్పింది. భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) నిర్మాణానికి లైన్ క్లియర్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు (AP Highcourt) పూర్తిగా ఎత్తేసింది. ఇప్పటికే ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తరువాత ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ.. ఇతర కారణాలతో పలువురు రైతులు తరువాత తరువాత కేసును ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్ (GMR)తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది.
తాజా తీర్పును టీటీడీ చైర్మన్, వైఎస్సార్ సిపి విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి స్వాగతించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం విశాఖ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం తనను కలిసిన విలేకరులతో సుబ్బారెడ్డి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.
అన్ని కుదిరితే ఈనెల నుంచే దీనికి సంబందించిన ప్రక్రియ మొదలపెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ విశాఖ పరిపాలన రాజధాని చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా ప్రయత్నాలు ఎవరు చేసినా తప్పేనని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత అధికారులేదేనని టిడిపి నాయకుడు అయ్యన్నపాత్రుడు ఉదంతాన్ని ప్రస్తావించారు.
ఇదీ చదవండి : మూడు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరిక
తాజా కోర్టు తీర్పు ఉత్తరాంధ్ర ప్రజలకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎయిర్ పోర్టుకు తోడు బీచ్ కారిడర్ పనులు వేగవంతం కానున్నాయి. భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు బీచ్ కారిడార్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఇప్పటికే కేంద్రం ఆమోదం లభించింది. మొత్తం రూ.1,400 కోట్లు ఇస్తామని, భూసేకరణకు నిధులు ఉపయోగించనున్నారు.
ఇదీ చదవండి : ఏపీలో ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
విశాఖపట్నం పోర్టు నుంచి ఆర్‌కే బీచ్, రుషికొండ మీదుగా భీమిలి వరకు, అక్కడి నుంచి భోగాపురం వరకు బీచ్ వెంబడి ఆరు వరుసల రహదారి నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దీనిని రెండు బిట్లుగా విభజించారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు ఒక బిట్, భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మరో బిట్. ఇందులో ఇప్పటికే భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు వేసే కారిడార్‌కు కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు.. బీచ్ కారిడార్ పూర్తి అయితే.. ఉత్తరాంధ్ర రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airport, Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizianagaram