Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గిరిజన యువతకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం (AP Government) పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. వారికి జాబ్ మేళాలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) లో ఐదు నైపుణ్యశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు. సాయికుమార్ తెలిపారు. రాష్ట్ర నైపు ణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాలూరు ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పార్వతీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్, సీతంపేట ఐటీఐలో నైపుణ్యా భివృద్ధి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ వివరాలను ప్రకటించారు.
గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశా లలో డేటా ఎంట్రీ ఆపరేటర్, సూయింగ్ మిషన్ ఆపరేటర్ కోర్స్ కు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. ఈ కోర్సులకు 8వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు అర్హులు. వివరాలకు సెల్: 63034 93720, 8978878557 నంబర్లను సంప్రదించాలి.
సాలూరు ప్రభుత్వ ఐటిఐలో ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన యువకులకు అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్, ఫిట్టర్ ఫ్యాబ్రికేషన్ కోర్స్ కు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు సెల్: 9494777553, 96662 00617 నంబర్లను సంప్రదించి కోర్సులలో చేరవచ్చు.
సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డేటా ట్స్ ఎగ్జిక్యూటివ్ కోర్స్ లకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పి స్తారు. ఇంటర్మీడియట్, కున్న యువతీ, యువ కులు అర్హులు. వివరా లకు సెల్: 8555909899, 63051 10947 నంబర్లను సంప్రదించి కోర్సులో చేరవచ్చు.
పార్వతీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రిటైల్ సేల్స్ అసోసియేషన్, మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్ కోర్సులకు శిక్షణ ఇస్తారు. స్వయ ఉపాధిని ప్రోత్సహిస్తారు. పదవ తరగతి, డిగ్రీ చదువుకున్న వారు అర్హులు. వివరాలకు సెల్: 93818 85611, 9391742042 నంబర్లకు సంప్రదించాలి. సీతంపేట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అసిస్టెం ట్ ఎలక్ట్రిషియన్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్లను నిర్వహిస్తున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో పూర్తిచేసిన యువకులు అర్హులు. వివరాలకు సెల్: 70320 60773, 9502407824 నంబర్లను సంప్రదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam, Vizianagaram