Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM AP GOVERNMENT AND NGOS STARTED HOUSE FOR HOMELESS PEOPLE IN NARSIPATNAM ANAKAPALLI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VSJ NJ

Vizag News: నిరాశ్రయుల కోసం ప్రత్యేక షెల్టర్‌ హోమ్‌.. పట్టెడన్నం కోసం ఎదురుచూపులు..

అనకాపల్లి

అనకాపల్లి జిల్లాలో నిరాశ్రయుల కోసం వసతిగృహం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నంలో షెల్టర్‌ ఫర్‌ అర్బన్ హోమ్‌ లెస్‌ పేరుతో (Shelter for Urban Homeless) ఓ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు.

  Setti Jagadeesh, News 18, Visakhaptnam

  ప‌గ‌లంతా క‌ష్టప‌డి చాలా మంది శ్రమ జీవుల‌కి ఉండ‌టానికి ఇళ్లు లేక రాత్రిళ్లు రోడ్ల ప‌క్కన ప‌డుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దయనీయ స్థితిలో ఉన్న వారు అనాథలు, ముసలివాళ్లు, దివ్యాంగులు, మతిస్థిమితం లేని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిరాశ్రయుల వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నంలో షెల్టర్‌ ఫర్‌ అర్బన్ హోమ్‌ లెస్‌ పేరుతో (Shelter for Urban Homeless) ఓ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. NGOలు, మెప్మా సిబ్బంది (MEPMA), పురపాలక సిబ్బంది (Municipal staff), పోలీస్ వారి సహకారముతో టీమ్‌లుగా ఏర్పడి రాత్రి వేళల్లో నిరాశ్రయలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు గుర్తించి వారికి ఈ కార్యక్రమం పై అవగాన కల్పిస్తున్నారు.

  నిరాశ్రయులు వారి అంతట వాళ్లే వసతి గృహాలకు వచ్చి.., వినియోగించుకోవాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశం. ఎందుకంటే ఎవ్వరిని నిర్బంధంగా ఈ వసతి గృహలలోనికి తీసుకురాకూడదు మరియు వచ్చినవారి నుండి ఏ విధమైన గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డు, ఓటరు కార్డు, రేషన్ కార్డు అడగకూడదు.

  ఇది చదవండి: తెలుగోడి పంచ్‌ పవరే వేరప్పా..! బాక్సింగ్‌లో మిర్చిలాంటి కుర్రాడు..!


  జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ
  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ప్రతి నెలకు ఒకసారి కనీసం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ సమావేశాలకు మున్సిపల్‌ కమిషనర్లు ఎన్‌జీఓలు హాజరయ్యేలా చూడాలి. ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు మినిట్స్ రూపంలో తయారు చేసి సంబందిత ఆఫీసర్లకు మరియు ఎన్.జి.ఓ (NGO)లకు పంపించి అమలయ్యేలా చూడాలి. మరియు మినిట్స్ కాపీలను మెప్మా హెడ్ ఆఫీస్‌కు క్రమం తప్పకుండా పంపించాలి.

  ఇది చదవండి: టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన వ్యాపారి ఐడియా..! అందరి చూపు అతనివైపే..!


  యు.ఎల్.బి. స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ:
  యు.ఎల్.బి స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సక్రమంగా పనిచేసేలా మున్సిపల్‌ కమిషనర్లకు జిల్లా స్థాయి సమావేశాలలో కలెక్టర్ల ద్వార ఆదేశాలు ఇప్పించి.. ఆయా కమిటీల రిపోర్ట్‌లను ఎప్పటికప్పుడు మెప్మా హెడ్ ఆఫీస్ కు తదుపరి చర్య నిమిత్తం పంపించాలి.

  ఇది చదవండి: వైజాగ్ లో బెస్ట్ షాపింగ్ స్పాట్ ఇదే.. అక్కడ దొరకనిదంటూ ఏదీ లేదు..


  బయో మెట్రిక్ హాజరు పద్ధతి:
  బయో మెట్రిక్ హాజరు పద్ధతి షెల్టర్‌(Shelter) నిర్వహణ సిబ్బందికి తప్పనిసరి. దీని ఆధారంగా షెల్టర్ మేనేజర్ మరియు కేర్ టేకర్ పారితోషకం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చెప్పినప్పటికీ స్థానికంగా వీటి నిర్వహణ ఏ మాత్రం బాగాలేదని చెప్పవచ్చు.

  ఇది చదవండి: 150ఏళ్ల నాటి అస్థిపంజరం.. దశాబ్దాల నాటి జంతువులు.. ఈ ల్యాబ్ చూస్తే ఆశ్చర్యపోతారు..


  నర్సీపట్నంలో రాత్రిళ్లు ఎవ‌రూ రోడ్లపై నిద్రపోవ‌డానికి వీల్లేద‌ని ఏర్పాటు చేసిన ఈ వసతి గృహాన్ని.. ఇప్పుడు అధికారులు గాలికి వదిలేశారు. నిర్వాహకులు ఎంత మొరపెట్టుకున్నా అధికారులకు అంతుపట్టడం లేదు. ప్రస్తుతం దాత‌లు ముందుకు వ‌చ్చి నిరాశ్రయుల వ‌స‌తి గృహానికి భోజ‌నం ఇస్తేనే మూడు పూటలా వారికి భోజనం లేదంటే పస్తులే.

  ఇది చదవండి: అన్నిదేశాల చేపలు ఒకే చోట.. ఔరా అనిపిస్తున్న విశాఖ వాసి


  అపరిశుభ్రంగా ఉన్న వసతిగృహ పరిసరాలు..
  ఆశ్రమం చుట్టుపక్కల వ్యర్ధాలు మురికి కాలవలతో అపరిశుభ్రంగా ఉండడంతో నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ అధికారులు పట్టించుకోని శుభ్రం చేయాలని కోరుతున్నారు.

  ఇది చదవండి: పిన్నిస్ ఉంటే చాలు..? ఎలాంటి బైక్ తాళమైన తుస్సే..? వీళ్లది మాములు టాలెంట్ కాదు..!


  ప్రస్తుతం దాతల మీద ఆధారపడ్డ షెల్టర్‌ హోమ్‌
  మున్సిపల్ అదికారులు, స్థానిక ప్రజా ప్రతినిదులు పట్టించుకుని … అంద‌రూ ఈ వ‌స‌తి గృహాన్ని వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇప్పటి వరకు ఈ ఆశ్రమం లో 256 మంది వరకు పునరావాసం కల్పించారు. ప్రభుత్వం , దాతలు సహాయం అందజేస్తే మరింత నిరాశ్రయులకు సేవలు అందిస్తామని మేనేజర్ శ్రీనివాస్ తెలుపుతున్నారు. అధికారులు ఉద‌యం అల్పాహారం, మధ్యాహ్నం,రాత్రిళ్లు భోజ‌నం ఏర్పాటుచేయ‌గ‌లిగితే ఎక్కువ మంది అనాథ‌లు ఈ వ‌స‌తి గృహాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందంటున్నారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిరాశ్రయులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని నిర్వాహకులు శ్రీనివాస్‌ కోరుతున్నారు.

  ఇది చదవండి: స్కేటింగ్‌ నేర్చుకోవాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్‌..! అక్కడ కోచింగ్ ఫ్రీ.. వివరాలివే..!


  అడ్రెస్: నర్సీపట్నం మండలం, పెద్ద బొడ్డేపల్లి, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 531116
  ఫోన్ నెంబర్‌: 79930 27399

  ఎలా వెళ్లాలి: నర్సీపట్నం బస్ స్టేషన్ నుండి అనకాపల్లి వెళ్ళే మార్గం లో పెద బొడ్డేపల్లి సెంటర్ కి ఆటో, బస్ సౌకర్యం ఉంటుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు