హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan Vizag Tour: విశాఖ టూర్ కు సిద్ధమైన సీఎం జగన్.. రాజధానిపై క్లారిటీ ఇస్తారా..?

YS Jagan Vizag Tour: విశాఖ టూర్ కు సిద్ధమైన సీఎం జగన్.. రాజధానిపై క్లారిటీ ఇస్తారా..?

జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు సీఎం జగన్‌. ఈ సంధర్భంగా కరోనా పరిస్థితులపై అధికారులను హెచ్చరించారు..

జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు సీఎం జగన్‌. ఈ సంధర్భంగా కరోనా పరిస్థితులపై అధికారులను హెచ్చరించారు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) శుక్రవారం విశాఖపట్నం (Visakhapatnam) లో పర్యటించబోతున్నారు. సీఎం ఎప్పుడు వైజాగ్ వెళ్లడం సాధారణమే కానీ.. ఈ పర్యటన మాత్రం కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది.

  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) శుక్రవారం విశాఖపట్నం (Visakhapatnam) లో పర్యటించబోతున్నారు. సీఎం ఎప్పుడు వైజాగ్ వెళ్లడం సాధారణమే కానీ.. ఈ పర్యటన మాత్రం కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం రాజధాని అంశం. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి పలు ముహూర్తాలు కూడా పెట్టారు. ప్రియమైన స్వామి స్వరూపా ఆశీస్సులతో రాజధాని పనులు ముమ్మరం చేయాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే కోర్టు జోక్యంతో మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారు. ఆ బిల్లు ఉపసంహరణ తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెడుతున్నారు. మరి రాజధానిపై క్లారిటీ ఇస్తారా..? విశాఖ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారు.

  సీఎం జగన్ తొలిసారి ఓ పాలనా పరమైన కార్యక్రమానికి తొలిసారి విశాఖ వస్తున్నారు. గతంలో రెండు మూడు సార్లు విశాఖ వచ్చినా.. శారద పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకోవడమే.. లేదా ఒడిశా, శ్రీకాకుళం వెళ్తూ విశాఖలో ఆగడమో తప్ప.. నేరుగా విశాఖ వచ్చిన సందర్భం లేదు. గతంలో ఓ సారి అనుకున్నా ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ సారి సీఎం జగన్ పర్యటనపై ఆసక్తి నెలకొంది.

  ఇది చదవండి: ఏపీలో చాపకింద నీరులా ఒమిక్రాన్..? కోనసీమలో కొత్త వేరియంట్ కలకలం..!


  విశాఖ పర్యటన ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం నగరం, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభలో ఆయన ఏం మాట్లాడుతారు అన్నది కూడా ఉత్కంఠ పెంచుతోంది. ఎందుకంటే గతంలో అనేక సార్లు విశాఖనే ఏపీకి పరిపాలన రాజధాని అని ప్రకటిస్తూ వచ్చారు.

  ఇది చదవండి: అల్లు అర్జున్ పుష్పకు లైన్ క్లియర్.. ఏపీలో టికెట్ల రేట్లపై విచారణ వాయిదా..


  ఇటీవల మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. మరోసారి ఎలాంటి సమస్యలు లేకుండా బిల్లు ప్రవేశ పెడతామన్నారు. దీనిపై ఇప్పటికే విశాఖ ప్రజల్లో కాస్త ఆగ్రహం ఉంది. రాజధాని అని ప్రకటించి వెనుకడుడు వేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారు.. రాజధానిపై క్లారిటీ ఇస్తారా.. సైలెంట్ అవుతారా.. అన్నది ప్రశ్న.

  ఇది చదవండి: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం స్కెచ్.. ఫైర్ బ్రాండ్ ధైర్యంగా ఎదుర్కొంటారా..?


  మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత వైఎస్ జగన్ తొలిసారిగా విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించాలని ప్రతిపాదించిన బిల్లు అది. దీన్ని వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇదివరకు ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నిరసన ప్రదర్శనలను సైతం నిర్వహించారు. ఇప్పుడు వారంతా నిరసనలు తెలిపే అవకాశం లేకపోలేదు.. విశాఖ వచ్చిన తరువాత ఈ సమస్యపై స్పందిచకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. మరోవైపు శ్రీరామ నవమి నాటికి విశాఖ రాజధాని పనులు ప్రారంభమవుతాయని గతంలో ఓ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దానిపై క్లారిటీ ఇస్తారా లేదో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Visakhapatnam

  ఉత్తమ కథలు