హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Group Politics in YSRCP: తాడేపల్లికి చేరిన వైసీపీ గ్రూపు రాజకీయాలు.. సీఎం జగన్ మాటైనా వింటారా..?

Group Politics in YSRCP: తాడేపల్లికి చేరిన వైసీపీ గ్రూపు రాజకీయాలు.. సీఎం జగన్ మాటైనా వింటారా..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

2019 అసెంబ్లీ ఎన్నికల్లో (2019 Assembly Elections) ఘన విజయం సాధించి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) అక్కడక్కడా తలనొప్పులు తప్పడం లేదు.

  P. Anand Mohan, Visakhapatnam, News18

  2019 అసెంబ్లీ ఎన్నికల్లో (2019 Assembly Elections) ఘన విజయం సాధించి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) అక్కడక్కడా తలనొప్పులు తప్పడం లేదు. నాయకుల మధ్య వర్గపోరు పార్టీకి చెడ్డపేరు తెచ్చేదిగా ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి (East Godavari District) జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (MLA Jakkampudi Raja), రాజమహేంద్రవరం లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ల (MP Margani Bharath) మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) సమక్షంలోనే వారు ఒకరిపై మరొకరు నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో వాగ్వివాదానికి దిగడంతో అధిష్ఠానం ఈ అంశంపై దృష్టి సారించింది. ఒకవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ అధ్యక్ష పదవుల ఎంపికపై జిల్లాల్లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు, మంత్రులూ, ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా ప్రతిపక్షం కూడా చేయనంతగా ఏకంగా టెంట్లుకట్టి మరీ వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేస్తోంది.

  పైకి, పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు పదవుల కోసం ఇలాంటి ఆందోళనలు తప్పవంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేలిగ్గా తీసుకున్నట్లుగా చెప్పినప్పటికీ.., ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం తలతీసినట్లుగానే వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఏర్పడిన వివాదం చివరకు వైసీపీ అధిష్ఠానం వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారావు నుంచి ఈ ఇద్దరికీ పిలుపు వచ్చింది.

  ఇది చదవండి: పవన్-పేర్ని నాని మధ్య ట్వీట్ల వార్.., ఎవరూ తగ్గట్లేదుగా..!


  మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. గతంలో ఒకసారి పెద్దల సమక్షంలో తగువు తీర్చారు. తర్వాత రాజా, తన దృష్టి అంతా రాజానగరం నియోజకవర్గం మీదే పెట్టారు. సిటీ కోఆర్డినేటర్‌ ఆకుల సత్యనారాయణ వ్యక్తిగత కారణాలవల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎంపీ భరత్‌ సిటీలో రచ్చబండ-నగరబాట పేరిట డివిజన్లలో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు విబేధాలు ఏమైనా ఉన్నా ప్రచ్ఛన్నయుద్ధంగానే ఉండేవి. ఇటీవల సీతానగరంలో ఎస్టీ వర్గానికి చెందిన అధ్యాపకుడు దీపక్‌పై వైసీపీ నేతలు దాడి చేయడం, దాన్ని స్వయంగా ఎంపీ ఖండించడంతో ఎంపీ భరత్‌, రాజా మధ్య వివాదం రచ్చకెక్కింది.

  ఇది చదవండి: ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు... పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..?


  రాజానగరం నియోజకవర్గంలోని మూడు మండలాల వైసీపీ నేతలు సమావేశాలు నిర్వహించి ఎంపీ భరత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ఎంపీ కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత రాజా విలేకరుల సమావేశం పెట్టి ఘాటునే స్పందించారు. దానిపై భరత్‌ మరింత ఘాట్‌గా స్పందించడంతోపాటు వ్యక్తిగత దూషణలకు కూడా వెళ్లిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే తీరులో ఇద్దరు పట్టుదలకు, పౌరుషానికి పోయారు. ఈ పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయోననే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అధిష్ఠానం స్పందించింది. ఇద్దరూ రండి.. మాట్లాడదాం అంటూ వైవీ నుంచి పిలుపువచ్చింది. అక్కడ ఏమవుతుందో చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp