Andhra Pradesh: సీఎం జగన్ పాలన మూడేళ్లేనా? ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉందా? బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

జగన్ పాలన మూడేళ్లేనా?

ఏపీ సీఎం ఎన్నేళ్లు పరిపాలిస్తారు.. ఇదే ప్రశ్న వైసీపీ నేతలను అడిగితే ముప్పై ఏళ్లు.. నలబై ఏళ్లు అంటూ గుక్క తిప్పుకోకుండా చెబుతారు.. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవా? సీఎం జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దే అయ్యే అవకాశం ఉందా? అసలు ఏపీలో త్వరలో ఏం జరగనుంది?

  • Share this:
    ఏపీ సీఎం జగన్ 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని.. అందుకే విపక్షాలకు కనీసం ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లు కూడా రావడం లేదని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలోనూ అధికార పార్టీ 5 లక్షల మెజార్టీని టార్గెట్ చేసింది. కచ్చితంగా తమ టార్గెట్ రీచ్ అవుతామంటున్నారు అధికార పార్టీ నేతలు.. మరో రెండు, మూడు టెర్మల్ వరకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ నే ప్రజలు కోరుకుంటారని వైసీపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు..

    బీజేపీ నేతలు మాత్రం జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీ జాతీయ నేత సునీల్ దేవదర్ సైతం అదే వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్ బెయిల్ రద్దవుతుంది అన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ రాజు సైతం బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను కోర్టు విచారణకు తీసుకుంది. దీంతో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ పెరిగింది.

    ఇదే సమయంలో ఏపీ సీఎం జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. తనకు తెలిసినంత వరకు ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్... సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదంటూ ఓ బాంబ్ పేల్చారు. అంటే ఆయన అర్థం ఏంటో మరి. జగన్ బెయిల్ రద్దు అయ్యి జైలుకు వెళ్తారని పరోక్షంగా చెబుతున్నారా? జమిలి ఎన్నికలు వస్తే ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతాయి అన్నది ఆయన ఉద్దేశమా అనే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రఘు రామ పిటిషన్ ను కోర్టు స్వీకరించిన కొన్ని గంటల్లోనే విష్ణు కుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారాయి.

    మ‌రోవైపు ఏపీ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంద‌ని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ, అధికార యంత్రాంగానికి క‌రోనావైర‌స్ నియంత్ర‌పై లేద‌ని ఎద్దేవా చేశారు ఆయన. క‌రోనా సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఇక‌, ఏపీలో రాత్రి కర్ఫ్యూ తుగ్లక్ చర్య అంటూ మండిప‌డ్డ విష్ణ‌కుమార్ రాజు.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చేయాల‌న్నారు.. రోగుల మందులపై 3 నెలల పాటు జీఎస్టీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాల‌ని డిమాండ్ చేశారు విష్ణు కుమార్ రాజు.
    Published by:Nagesh Paina
    First published: