AP Rains: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు అలర్ట్.. వింటర్ వచ్చినా వర్షాల ముప్పు వీడడం లేదు. వరుస భారీ వర్షాలు (Heavy Rains) భయపెడుతున్నాయి. ఇప్పటికే మాండూస్ తుఫాను (Mandours Cyclone) అలజడి రేపితే.. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు మండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కొన్ని చోట్ల కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ సూచించింది. ఎందుకంటే బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో మంగళవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి.. ఆ తరువాత క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతుందని ప్రకటించింది. ఇది ఈ నెల 16వ తేదీ తరువాత తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తూర్పు-ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మాండూస్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ మాండూస్ ఎఫెక్ట్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ ప్రజలే కాదు.. రైతులు అయితే తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పలు జిల్లాల్లో భారీగా పంట నష్టాన్ని గుర్తించారు. మండూస్ భయ వీడింది.. అంటే ఇప్పుడు మరో ముప్పు ఉందని హెచ్చరించడం అన్నదాతనలు కలవర పెడుతోంది.
మరో తుఫాను ప్రభావంతో.. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం లలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావంతో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : హిమాలయాలను తలపిస్తున్న శేషాచలం.. భక్తులకు మధుర జ్ఞాపకాలు అందిస్తున్న పొగ మంచు..
తాజా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన పెరుగుతోంది. అటు శ్రీలంకను ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్రంలోని డెల్టా జిల్లాలలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం రాత్రి మాండూస్ తుఫాను తీరం దాటడంతో తమిళనాడు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains