VISAKHAPATNAM ANHRA UNIVERSITY TO FREEZE THESE COURSES FOR ONE YEAR DUE TO THESE REASONS FULL DETAILS HERE PRN VSP
Andhra University: విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ షాక్.. ఈ కోర్సులకు గుడ్ బై..! కారణం ఇదే..!
ఆంధ్రా యూనివర్సిటీ (ఫైల్)
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University). ఈ వర్సిటీలో వందలాది కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ అంటే చాలా ప్రాముఖ్యత ఉంది.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University). ఈ వర్సిటీలో వందలాది కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ (Graduation in Andhra University) అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మకుటాయమానమైన ఈ వర్సిటీలో పలు కోర్సులకు అధికారుల మంగళం పలికారు. అధ్యాపకుల కొరత, కోవిడ్ (Covid-19) కారణాలతో పాలకులు స్వస్తి చెప్పారు. వందల విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను నిలిపివేయడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న పలు కోర్సులకు పాలకులు స్వస్తి చెబుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిషరీస్ సైన్స్, అగ్రికల్చర్ బయో టెక్నాలజీ, సంస్కృతం, యోగా, జర్నలిజంలో ఒక్కో విభాగం, ఆర్కియాలజీ, కెమిస్ర్టీ డిపార్ట్మెంట్ పరిధిలోని ఎన్విరాన్మెంటల్ కెమిస్ర్టీ, మెరైన్ కెమిస్ర్టీ, ఇన్ ఆర్గానిక్ కెమిస్ర్టీ, న్యూక్లియర్ కెమిస్ర్టీ, ఫిలాసఫీ విభాగాల్లో అడ్మిషన్లు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కఏడాదిలో దాదాపుగా 15 కోర్సులను నిలిపివేయడానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత, కోవిడ్ కారణాలుగా చెబుతున్నారు. కొవిడ్ వల్ల అడ్మిషన్లు తక్కువగా వుంటాయని, ఈ ఏడాదికి మాత్రమే ఆయా కోర్సులను ఫ్రీజ్ చేసినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కారణం ఇదే..
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 936 మంది అధ్యాపకులకుగాను ప్రస్తుతం 230 మంది మాత్రమే ఉన్నారు. మరో 706 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ అవుతున్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో యూనివర్సిటీలోని అనేక విభాగాల్లో బోధనపై ప్రభావం పడుతోంది. కొన్ని విభాగాలను గెస్ట్, కాంట్రాక్టు ఫ్యాకల్టీతో నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఇబ్బందికర పరిస్థితి వున్న విభాగాల్లో కొన్ని కోర్సులను అధికారులు నిలిపివేస్తున్నారు. యూనివర్సిటీల్లోని ఖాళీలను వీలైనంత తొందరగా భర్తీ చేస్తే, మిగిలిన విభాగాలనైనా కాపాడుకునేందుకు అవకాశముందని విద్యార్థులు కోరుతున్నారు.
ఏయూలో కోర్సులను నిలిపివేయడం లేదని, కొవిడ్ వల్ల అడ్మిషన్లు తక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ ఏడాదికి ఫ్రీజ్ చేస్తున్నామని ఏయూ చెబుతుంది. వచ్చే ఏడాది నుంచి ఆయా కోర్సులను పునఃప్రారంభిస్తామంటున్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. యూనివర్సిటీలో ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న కోర్సులను నిలిపివేయడం దారుణమని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కొవిడ్‌ను సాకుగా చూపించి కోర్సులు నిలిపివేయాలని నిర్ణయించడం సమంజసం కాదని వాపోతున్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.