Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatna) లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ నిరసన గళం వినిపించారు. వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు తెలిపేందుకు వస్తుంటే ఎక్కడికక్కడ అడ్డంకులు వేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమానికి వెళుతుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, గృహనిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ విశాఖలోని జగదాంబ సెంటర్ వద్ద సిఐటియు నిరసన వ్యక్తం చేసింది. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడి మహిళలు పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జగదంబ సెంటర్ వద్ద కొంతసేపు రాస్తారోకో జరిపారు. దీంతో పోలీసులు, సిఐటియు నాయకులు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర కన్వీనర్ మనీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తెలంగాణలో అంగన్వాడీలకు ఇచ్చే జీతం కన్నా వెయ్యి రూపాయలు అదనంగా పెంచి ఇస్తామని మాట ఇచ్చి.. మాట తప్పారని పేర్కొన్నారు. దీనిని ఖండిస్తూ అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.
ప్రభుత్వ ఏర్పడిన తర్వాత వచ్చిన సచివాలయ ఉద్యోగులకు సైతం పర్మినెంట్ చేయడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల నుండి కూడా తాము విధులు నిర్వహిస్తున్న పర్మినెంట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో భాగంగానే అంగన్వాడీలు తమ హక్కుల కోసం పోరాడితే అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తక్షణం సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం తమకు జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మాత్రమే తాము అడుగుతున్నామని తెలిపారు. పెంచుతామని చెప్పడం తప్ప పెంచడం లేదని ఇలా అయితే ఎలా తాము కుటుంబంతో జీవనం ఎలా కొనసాగించాలని వాపోయరు. తమకి ఇస్తానన్న హామీలు వెంటనే నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని , ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అంగన్వాడీకార్యకర్తలు హెల్పర్స్ ప్రభుత్వంని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam