హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: షుగర్ ఉందని టెన్షన్ వద్దు.. అందుబాటులోకి సరికొత్త పరికరం.. ప్రత్యేకత ఏంటంటే?

Good News: షుగర్ ఉందని టెన్షన్ వద్దు.. అందుబాటులోకి సరికొత్త పరికరం.. ప్రత్యేకత ఏంటంటే?

షుగర్ ఉందని భయపడుతున్నారా? నో టెన్షన్

షుగర్ ఉందని భయపడుతున్నారా? నో టెన్షన్

Good News: డయాబిటిస్ తో ఇబ్బంది పడుతున్నవారికి శుభవార్త.. షుగర్ ను పూర్తిగా కంట్రోల్ చేసే నూతన పరికరాన్ని కనుగొన్నారు.. అది కూడా మన ఆంధ్రాప్రదేశ్ లోనే.. ఈ పరికరం పూర్తి ప్రయోజనాలు ఏంటంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

  Good News: ఈ రోజుల్లో ఎక్కుమంది ఫేస్ చేస్తున్న సమస్య షుగర్ (Sugar).. అయితే చాలామంది ముందే గుర్తించలేక.. తరువాత తగ్గించుకోవడానికి నానా తంటాలు పడతారు. ఇకపై ఎవరికీ అలాంటి టెన్షన్ లేదు.. ఎందుకంటే.. డయాబెటిస్ పరీక్ష కోసం సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించింది ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) . టైప్-2 డయాబెటిస్ ను సెకనులో పరికరం గుర్తుస్తుంది. ఒక్క రక్తపు చుక్కతో ఫలితాలు వస్తాయి అంటున్నారు. బయో ఫ్యాబ్రికేషన్ తో టెస్టింగ్ స్ట్రిప్ తయారీ. ఆరు నెలల పాటు స్ట్రిప్ ను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది అంటున్నారు.  ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మధుమేహంతో బాధపడేవారి సంఖ్య చాలా పెరిగింది. కారణాలు ఏవైనప్పటికీ, ఒక్కసారి షుగర్ బారినపడితే జీవితకాలం మందులు వాడకతప్పదు.

  డయాబెటిస్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అందుకు షుగర్ రోగులు క్రమం తప్పకుండా టెస్టు చేయించుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, మధుమేహ పరీక్ష కోసం ఉపయోగించే పరికరాలు కాస్త ఖర్చుతో కూడుకున్నవే. ఈ నేపథ్యంలో, విశాఖ (Visakha) లోని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు.

  ఈ కొత్త పరికరంతో టైప్-2 డయాబెటిస్ ను చిటికెలో తెలుసుకోవచ్చు. పైగా ఈ పరికరం అత్యంత చవకైనది. ఈ పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆంధ్రా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం రూపొందించింది. ప్రొఫెసర్ పూసర్ల అపరంజి నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది చూడ్డానికి ఓ పెన్ డ్రైవ్ లా కనిపిస్తుంది. ఇందులో వినియోగించే టెస్టింగ్ స్ట్రిప్ లను బయో ఫ్యాబ్రికేషన్ తో తయారుచేశారు. వీటిని 6 నెలల పాటు ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు.

  ఇదీ చదవండి : రేపు నంద్యాలకు సీఎం జగన్ .. మరో ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం.. కానీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

  ఒక్క రక్తపు చుక్కతో సెకను వ్యవధిలో ఫలితాలు వెల్లడవుతాయి. అంతేకాదు, ఈ పరికరాన్ని ఫోన్ లేదా ల్యాప్ టాప్ కు అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ టెస్టు వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. కాగా, ఈ షుగర్ టెస్టు పరికరం టెక్నాలజీపై ఆంధ్రా యూనివర్సిటీ పేటెంట్ కూడా పొందింది. దీన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

  ఇదీ చదవండి: ఒక్కసారి డబ్బు డిపాజిట్‌ చేస్తే.. ఆరు నెలల్లో రెండింతలు..! అసలు విషయం ఏంటంటే..?

  ఈ బయోసెన్సార్‌ పరికరంలో ఒక చుక్క బ్లడ్‌ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి అని చెబుతున్నారు. ఈ డివైజ్‌ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్‌ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్‌ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్‌ మెథడ్‌ ద్వారా చిప్స్‌ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్‌ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్‌ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి.

  ఇదీ చదవండి : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ బర్డ్స్.. దేవుడే కాపాడాడంటున్న యువతి కుటుంబం

  ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్‌ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్‌ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Andhra university, AP News, Diabetes, Vizag

  ఉత్తమ కథలు