ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) ఒకటి. ఏయూలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏయూ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలపై వర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10,11 తేదిల్లో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు సన్నద్ధం అవ్వాలని సూచించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఈ నెల 19, 20వ తేదిన నిర్వహించనున్నట్లు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా ప్రకటనలో తెలిపారు. మారిన పరీక్షల తేదీలను విద్యార్థులు గమనించి సకాలంలో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. అయితే ఇతర పరీక్షల తేదీల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సీటి అనుబంధ కళాశాలల్లోనూ పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఇందుకు సంబంధించి సమచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://exams.andhrauniversity.edu.in/ ను సందర్శించాలని అధికారులు సూచించారు. తదుపరి పరీక్షలు షెడ్యూల్‌ని కూడా అధికారులు సర్క్యూలర్‌లో పొందు పరిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra university, Local News, Visakhapatnam