హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag News: జీవం ఉట్టిపడటం అంటే ఇదే.. వారెవా ఏం టాలెంట్ గురూ..! చరిత్రకు జీవం పోస్తున్నారు..

Vizag News: జీవం ఉట్టిపడటం అంటే ఇదే.. వారెవా ఏం టాలెంట్ గురూ..! చరిత్రకు జీవం పోస్తున్నారు..

ఏయూలో ఆకట్టుకుంటున్న శిల్పకళా ప్రదర్శన

ఏయూలో ఆకట్టుకుంటున్న శిల్పకళా ప్రదర్శన

'శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు'' అని ఒక కవి రాసిన మాట అక్షరసత్యం. అయితే అందం మాత్రమే కాదు, నాటి రాజుల కీర్తిని, వారి పరిపాలనా తీరును తెలియజెబుతూ చరిత్రలో నిలిచిపోయాయి శిల్ప నిర్మాణాలు. ఆలోచనలకు కృషిని మేళవిస్తే నవీన ఆవిష్కరణలకు, అద్భుత కళాకృతులకు అంతే ఉండదని నిరూపిస్తున్నారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌(Fine arts) విద్యార్థులు.

ఇంకా చదవండి ...

Setti Jagadeesh, News 18, Visakhaptnam

'శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు'' అని ఒక కవి రాసిన మాట అక్షరసత్యం. అయితే అందం మాత్రమే కాదు, నాటి రాజుల కీర్తిని, వారి పరిపాలనా తీరును తెలియజెబుతూ చరిత్రలో నిలిచిపోయాయి శిల్ప నిర్మాణాలు. ఆలోచనలకు కృషిని మేళవిస్తే నవీన ఆవిష్కరణలకు, అద్భుత కళాకృతులకు అంతే ఉండదని నిరూపిస్తున్నారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌(Fine arts) విద్యార్థులు. అపురూప కళాఖండాలు తీర్చిదిద్ది చూపరులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ ఫోటో కావాలన్నా వెంటనే ఫోన్‌ తీసీ గుగుల్‌ ఫోటోస్‌లో చూసుకుంటారు. ఇంకొంతమంది గుర్తుగా అవే ఫోటోలను ఫ్రేమ్‌ కట్టించుకుని చూసుకుంటారు. కానీ కొన్ని ఏళ్లకు ముందు కెమెరా లేని కాలంలో రాజులు, నాయకుల ఫొటోలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం..ఎలా అంటారు..?

అప్పట్లో కెమెరాలు లేకపోయినా…అచ్చుగుద్దినట్లు ఆ రాజులు, రాణుల ఫొటోలను గీయగలిగే నైపుణ్యమున్న చిత్రకారులు ఉండేవారు. చిత్రకారులతో పాటు అందమైన శిల్పాలు చెక్కే నగీషీలు కూడా ఉండేవారు. అలాంటి చిత్రకారులు, శిల్పుల వల్లే ఇప్పటికీ కళకు వన్నె తగ్గలేదు. పాత కాలపు కళాకారులతో బొమ్మలు వేయించడం మానేశారు. చిత్ర కళాకారులు ప్రస్తుత సమాజంలో కనుమరుగై పోతున్నారు.

ఇది చదవండి: ఏపీలో కేజీఎఫ్ తరహా గోల్డ్ మైన్స్..? ఆ కొండల కింద అంతా బంగారమే..


ప్రాచీన కళకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి

ఆంధ్రా విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. బీఎఫ్‌ఏ(BFA), ఎంఎఫ్‌ఏ(MFA) ఆఖరి సెమిస్టర్‌ విద్యార్థులు తమ ప్రతిభతో ఏయూ విశిష్టతకు మరింత వన్నె తీసుకొచ్చారు. నేర్చుకున్న విద్యతో తీర్చిదిద్దిన కళారూపాల ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శన ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో ఏర్పాటు చేశారు.

ఇది చదవండి: ముగ్గురు మిత్రుల వినూత్న ఐడియా.. ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..!


ఆకట్టుకుంటున్న శిల్పాలు, చిత్రకళలు

బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ ఆఖరి సెమిస్టర్‌ విద్యార్థులు 24 మంది 130కి పైగా చిత్రాలు, ఆకృతులను రూపొందించి ప్రదర్శనలో ఉంచారు. మట్టి, చెక్క, సిమెంట్‌, బ్రాంజ్‌, ఫైబర్‌, పాత ఇనుము, తదితర వస్తువులతో తయారుచేసిన శిల్పాలు, పెయింటింగ్స్‌ వంటివి సందర్శకుల మనసు దోచుకుంటున్నాయి. సామాజిక స్పృహను తెలిపే వివిధ రకాల బొమ్మలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.

ఇది చదవండి: అవకాయ పేరు చెబితే హడలిపోవాల్సిందే..! పచ్చడి మెతుకలకూ దిక్కులేని జీవితం..


ప్రదర్శన లో తీర్చిదిద్దిన కళారూపాలను నగరవాసులు, పలువురు విద్య వేత్తలు ఆసక్తిగా తిలకించారు. ప్రతి విద్యార్థి వారి మేదస్సుతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రతిఒక్కరి మన్ననలు పొందారు. శరీరంలో అవయవాలు వాటి పనితీరును వివరిస్తూ విద్యార్థి ఈ కళాప్రదర్శనలో ప్రతిఒక్కరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ కోర్స్ చేస్తే చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు, అందరూ ఈ కోర్స్ వినియోగించుకోవాలని విద్యార్థులు తెలిపారు.

ఇది చదవండి: వేసవిలో మాత్రమే దొరికే ఫ్రూట్‌.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలెక్కువ.. తింటే వదిలిపెట్టరు..!


మనదేశ శిల్పకళలకు వందల ఏళ్ల చరిత్ర

భారతీయ శిల్పకళను పరిశీలిస్తే విభిన్న ప్రాంతీయ కళా రీతులు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన శాస్త్రీయ విజ్ఞానమును గ్రంధరూపములో నిక్షిప్తము చేయబడి దక్షిణ భారత ఆలయ శిల్ప శైలికి ప్రామణిక గ్రంథముగా ఈనాటికి నిలచి ఉన్న గ్రంథము కాష్యప శిల్ప శాస్త్రము. భారత దేశంలోని చాలా పురాతన ఆలయాలు ఈ కశ్యప శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించ బడినాయి. వివిధ దేవాలయాలలో స్తంబాలపై వివిధ దేవతా మూర్తులు, ఇతర కళాకృతులను చెక్కి ఆలయానికి అపురూప శోభకు కల్పిస్తారు.

ఇది చదవండి: వీళ్ల చేతుల్లో ఏదో అద్భుతం ఉంది.. ఏం చెేసినా జీవం ఉట్టిపడాల్సిందే..!


భారతీయ చరిత్ర రచనకు శిల్పాలు చేసిన దోహదం అపురూపమైంది. శాతవాహనుల చరిత్రనీ, బౌద్ధం, జైనం, శైవం వంటి మతాల ఉత్థాన పతనాలని అర్థం చేసుకోడానికి ఉపకరించింది శిల్పాలే. తెలుగువారి ఘన చరిత్రనీ, తెలుగు భాష ప్రాచీనతనీ తెలుసుకోడం తెలుగుశిల్ప కళావైభవం ద్వారానే సాధ్యమైంది. ఏ దేశ చరిత్ర చూసినా, ఏ జాతి వికాసాన్ని గమనించినా శిల్పాల ప్రాశస్త్యం కనిపిస్తుంది. అందమైన గోపురాలు, ప్రాకారాలు, కోటలు, విగ్రహాలు, తోరణాలు, సుందర భవనాల నిర్మాణంలో శిల్పుల పాత్ర అమోఘం, అనిర్వచనీయం.

ఇది చదవండి: అక్కడ ఏ టిఫిన్ అయినా 10 రూపాయలే..! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..


రాజుల కాలంలో అద్భుత ప్రాచుర్యం పొందిన శిల్పకళావైభవం

మన తెలుగు నేల విషయానికి వస్తే…. తెలుగువారి శిల్పరీతుల్లో శాతవాహన శిల్పరీతి విశిష్టమైంది. తెలంగాణ నేలపై కాకతీయుల శిల్ప కళావైభవం ప్రత్యేకమైంది. కళలు, సాహి త్యం, తెలుగు భాషా వికా సాం కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందినంతగా మరే రాజుల కాలంలోనూ అభి వృద్ధి చెందలేదు. కాకతీయులు ఏ రంగాన్ని కదిలిస్తే ఆ రంగం కోటి ప్రభలతో వెలుగొందింది. కాకతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం విరివిగా కొనసాగింది. తెలుగు వారి శిల్ప కళా విన్యాసం ఆ నల్లని కఠిన శిలలపై వెన్నెలలా ప్రవహించింది. చరిత్రకే కాదు, వర్తమానంలోనూ వినూత్న భావాల వ్యాప్తికి విగ్రహాలు, ప్రాకారాలు చక్కటి ప్రతీకలు. కనుకనే బుద్ధుడు, కారల్‌ మార్క్స్‌, జ్యోతిబా ఫూలే, అంబేద్కర్‌ వంటి వారి విగ్రహాలు సమభావనని ఉద్దేశింపజేసే శిల్పాలుగా సదా స్ఫూర్తినిస్తున్నాయి.

ఇది చదవండి: కోస్తాకు సీమకు మధ్య స్వీట్ ఫైట్.. పూతరేకులకు పోటీ.. కాజాకు కాంపిటీషన్


శిల్పకళను కాపాడుకోవటం ఆవశ్యకం

ఈ రీతిన చరిత్రకు దర్పణంగా నిలిచిన శిల్పకళను నాలుగు కాలాల పాటు కాపాడుకోవటం అవసరం. ప్రస్తుత సమాజం లో శిల్ప కల అంతరించి పోతుందని… అలా అవ్వకుండా భావితరాలను ఆలోచింపచేసి, ఆసక్తిని పెంచేలా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Visakhapatnam

ఉత్తమ కథలు