Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA UNIVERSITY BOYS HOSTE BACK SIDE FOUND A PROSTITUTION DEN WHAT HAPPENED THERE NGS VSP

Andhra University: ఛీ ఛీ.. క్యాంపస్ లో పాడు పనులా? బాయ్స్ హాస్టల్ వెనుక వ్యవహారం చూస్తే మైండ్ బ్లాంక్

ఆంధ్ర యూనివర్సిటీ (ఫైల్)

ఆంధ్ర యూనివర్సిటీ (ఫైల్)

Andhra University: అందో అందమైన క్యాంపస్.. అంతేకాదు.. ఉన్నత విద్యాలు అందించే చదువులు తల్లి.. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాడు పనులు చేయడం ఏంటి..? అది కూడా బాయ్స్ హాస్టల్ వెనుకాలే.. అక్కడ బయటపడ్డ డెన్ చూసిన వారెవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఏం జరుగుతోందంటే..?

ఇంకా చదవండి ...
  Andhra University: భారత దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న క్యాంపస్ లలో ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) ఒకటి.. ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ చదవిన ఎందరో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఇక మన దేశంలో ఎందరో ప్రముఖులు చదివినప క్యాంపస్ గా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది వందల సంఖ్యలో మంచి మంచి పదవులతో క్యాంపస్ నుంచి బయట పడుతుంటారు. కేవలం విద్య విషయంలోనే కాదు.. చూసేందుకు కూడా ఏయూ చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసిన పచ్చని చెట్లు.. విశాలమైన క్రీడా మైదానాలు.. ఆడిటోరియంలు.. పురాతన కట్టడాలు.. విశాలమైన రోడ్లతో.. అందో అందమైన ప్రదేశంగా.. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వివిధ దేశాల నుంచి.. రాష్ట్రాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వస్తూ ఉంటారు. అలాంటి క్యాంపస్ లో సమాజం సిగ్గు పడే పనులు వెలుగులోకి వచ్చాయి. వేలమంది అమ్మాయిలు.. క్యాంపస్ లో ఉంటారు.. అలాంటి చోట ఈ పాడుపనులు ఏంటి అంతా నివ్వెర పోతున్నారు.. ఈ కొత్త పోకడలు ఎక్కడికి దారి తీస్తుందో నే భయపడేలా చేస్తోంది. తాజా పరిస్థితి చూస్తుంటే.. డ్రగ్స్‌ (Drugs) వాడకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్శిటీ (University) లోని చెట్లుచేమ మాటున కొత్త కోణాలు వెలుగులోకి రావడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. బయటకు కనిపించని స్థావరాల్లో రహస్యంగా మీనీ డెన్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

  అందమైన క్యాంపస్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ (AU Engineering College) బాయ్స్ హాస్టల్‌ (Boys Hostel) వెనుక ఉన్న పొదల్లో, ఏకంగా ఓ మినీ డెన్‌నే ఏర్పాటు చేసి వ్యభిచారం, మందు పార్టీలు నిర్వహిస్తున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ సుందరీకరణ పనుల కోసం హాస్టల్ వెనుక పొదల్ని తొలగిస్తే అసలు విషయం వెలుగులో్కి వచ్చింది. ఆ ప్రాంతం శుభ్రం చేయాలని ప్రయత్నించే క్రమంలో వ్యభిచార బాగోతం బయటపడింది. వెదురు చెట్లు దట్టంగా పెరగడంతో ఆ చెట్లపైనే ఓ మంచె ఏర్పాటు చేసేశారు కంత్రీగాళ్లు. వాటిపై ఏకంగా పరుపులు వేశారు. పైకి ఎక్కడానికి నిచ్చెన పెట్టి పని కానిస్తున్నారు. దట్టమైన పొదలు ఉండటంతో, అక్కడేం జరుగుతుందో ఇన్నాళ్లూ బయటకు తెలియలేదు.

  ఇదీ చదవండి : మరిగించి నూనె మళ్లీ వాడుతున్నారా? చాలా ప్రమాదకరం.. ఈ విషయాలు తెలుసుకోండి.. ఆ నూనెను ఏం చేయాలంటే..?

  ఇదే అదునుగా దీన్నో వ్యభిచార కేంద్రంగా మార్చినట్టు తెలుస్తోంది. ఆ పొదల్లో ఎక్కడ చూసినా కండోమ్‌లు, సిగరెట్‌ ప్యాకెట్లు, మందు బాటిళ్లే కనిపించాయి. ఈ పొదల దగ్గర కొన్ని వందల కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. అక్కడి పరిస్థితి చూస్తే.. ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది ఈజీగా ఊహించవచ్చు. ఈ పొదల దగ్గర మద్యం బాటిళ్లతోపాటు కొన్ని సిరెంజ్‌లు దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీటన్నిటిని చూసి అవాక్కయ్యారు వర్సిటీ అధికారులు. ఈ వ్యవహారం వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందని అనుమానిస్తున్నారు.

  ఇదీ చదవండి : కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టం.. వైసీపీ నేతలకు బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్

  ఇప్పటికే విశాఖలో డ్రగ్స్ బాగా విస్తరించాయనే అనుమానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా డ్రగ్స్ ఇంజెక్షన్లను తీసుకునేందుకే వీటిని ఉపయోగించారా, లేక ఈ ప్రాంతం డ్రగ్స్‌ దందాకి అడ్డాగా మారిందా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా వస్తున్న గంజాయి, డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇన్నాళ్లూ దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతోంది. అసలు ఈ సెటప్ అరేంజ్‌ చేసింది ఎవరు? ఈ వ్యవహారంతో వర్శిటీలో ఎవరికైనా లింకులు ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. క్యాంపస్‌లోకి వందలాది మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? గుట్టల కొద్దీ కండోమ్ ప్యాకెట్స్‌ దొరకడం ఏంటి? డ్రగ్స్ సిరెంజ్‌లు పడి పడిఉన్నాయంటే అసలేం జరుగుతోంది? అని స్థానికులు నివ్వెర పోతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Andhra university, AP News, Visakha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు