VCs controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) వీసీల వ్యహారం ఇప్పుడు పెద్ద దుమారంగా మారింది. ఇద్దరు వీసీలు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఒకరు రాజకీయ రంగు పులుపుకుంటే.. మరొకరు పూజల పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసిన తీరు అభ్యంతరకరంగా మారింది.. ఇంతకీ ఆ ఇద్దరి వీసీలు ఏం చేశారో తెలుసా.. విశాఖపట్నం (Visakhapatnam) లో ఉన్న ఆంధ్రాయూనివర్శిటీ (Andhra Pradesh University ) వైస్ ఛాన్సలర్ తీరు గత కొంతకాలంగా వివాదస్పందగానే ఉంటోంది. తాజాగా ప్రసాదరెడ్డి మరో వివాదంలో చిక్కు కున్నారు. విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. మార్చి 13న పోలింగ్ జరగనుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారని వామపక్షాలు, టీడీపీ, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీ( YCP MLC) అభ్యర్థి సీతం రాజు సుధాకర్ (Seetam Raju Sudakar) కు మద్దతుగా విశాఖలోని ఓ హోటల్లో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ , ధర్మాన, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఏయూ వీసీ ప్రసాదరెడ్డే నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ (Visakha) , శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram) జిల్లాల్లోని కాలేజ్‌లన్నీ ఏయూ కిందకే వస్తాయి. అందుకే ఆయా జిల్లాల్లోని ప్రైవేట్ కాలేజ్‌ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి.. వైసీపీకి ఓట్లు వేయాలని సూచించినట్లు వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. వెంటనే వీసీ ప్రసాదరెడ్డిని విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణలను వైసీపీ ఖండిస్తోంది. చేతకాని వాళ్లే ఇలాంటి ఫిర్యాదులు చేస్తారని ఆరోపించారు మంత్రి బొత్స. ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. వీసీని తప్పించాలంటూ విశాఖ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కే) వీసీ తీసుకున్న వింత నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్యాంపస్‌లో హోమం చేయాలని వీసీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హోమం చేయడానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేశారు. టీచింగ్ స్టాఫ్ 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ 100 రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. వీలైతే అంతకంటే ఎక్కువే ఇవ్వాలని వీసీ తెలిపారు. చందాల వసూళ్ల కోసం ఏకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌నే నియమించడం గమనార్హం. ఇంతకీ క్యాంపస్‌లో హోమం నిర్వహించాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా..?
ఇటీవల ఎస్కే యూనివర్సిటీలో వరుస మరణాలు సంభవించాయి. గడిచిన కొన్నాళ్లలో వివిధ కారణాలతో 25మంది సిబ్బంది మృతి చెందారు. దీంతో ఈ విషయంలో వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల అకాల మరణాలతో మృత్యుంజయ హోమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే మృత్యుంజయ హోమం, శాంతి హోమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చందాలు ఇవ్వాలని సర్క్యూలర్ జారీ చేశారు.
ఇదీ చదవండి : త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ.. మాజీ మంత్రులయ్యేది ఎవరు? ఉత్తరాంధ్ర నుంచి ఒకరు అవుట్
దీంతో ఎస్.కె యూనివర్సిటీలో తలపెట్టిన మృత్యుంజయ హోమం పై విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీలో కులాలు, మతాలుగా విడదీసే విధంగా ఈ మృత్యుంజయ హోమాలు చేయడం సరైన నిర్ణయం కాదని.. వెంటనే ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, రిజిస్టార్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, Andhra university, AP News, Visakhapatnam