Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA PRADESH VIRAL NEWS BIG SOUNDS FROM AMMAVARI TEMPLE IN VIZIANAGARAM NGS

Wonder Temple: అమ్మవారి గుడిలో ఎవరూ లేకున్నా గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు.. వింత చూసేందుకు ఎగబడ్డ జనం

అమ్మవారి ఆలయంలో ఎవరూ లేకున్నా గజ్జల చప్పుళ్లు.. గాజుల శబ్ధాలు

అమ్మవారి ఆలయంలో ఎవరూ లేకున్నా గజ్జల చప్పుళ్లు.. గాజుల శబ్ధాలు

Wonder Temple: ఇప్పటికే మన దేశంలో సైన్స్ కు అందని అతీత శక్తులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దేవాలయాల్లో జరిగే వింతలు మన సైన్స్ కి అంతు చిక్కడం లేదు. తాజాగా ఓ ఆలయం లోపల నుంచి మనుషులు లేకపోయినా.. గజ్జల చప్పులు.. గాజుల మోతలతో దద్దరిళ్లిం.. ఆ శబ్ధాలకు కారణం అదే అంటున్నారు భక్తులు.. ఇంతకీ ఏం జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Wonder Temple: టెక్నాలజీ పరంగా మనం ఎంత ముందుకు వెళ్తున్నా.. ఇప్పటికే సైన్స్‌కి అందని అతీత శక్తి ఏదో ఉందని నమ్మేవారే ఎక్కువ.. ముఖ్యంగా కొన్ని ఆలయాల్లో జరిగే వింతలు సమాధానం లేని ప్రశ్నలుగానే ఉంటున్నాయి. చాలా దేవలయాల్లో జరిగే వింతలు.. అప్పటి నిర్మాణాలు ఇప్పటికి వాటి మర్మం అంతుచిక్కడం లేదు. అందుకే ఇంకా చాలామంది దేవుడు, దేవతలు.. గ్రామ దేవతలను నమ్ముతుంటారు. వారి అతీత శక్తుల కారణంగానే ఆ వింతలు జరుగుతున్నాయని నమ్ముతుంటారు. అలా కాదని నిరూపించేందుకు ఆధారాలు చాలాచోట్ల దొరకడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ వింత అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.. అది ఒక గ్రామ దేవత ఆలయం.. అప్పుడప్పుడు మాత్రం అక్కడ రద్దీ ఉంటుంది.. ఆ ఆలయంలో ఎవరూ లేకపోయినా.. లోపల నుంచి గజ్జల చప్పుళ్లు.. గాజుల మోతలు వినిపిస్తున్నాయి. జనం భారీగా ఉన్నట్టు వింత వింత శబ్ధాలు వినిపిస్తున్నాయి. కానీ మొత్తం పరిశీలిస్త ఆ దగ్గర్లో జనం లేరు.. ఎక్కడ నుంచి ఆ శబ్ధం వస్తున్నాదో అంతు చిక్కడం లేదు..

    ఈ వింత ఘటన పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) లో చోటు చేసుకుంది. ఇప్పల పోలమ్మ గుడిలో గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటీ శబ్ద రహస్యం.? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురంలోని నాయుడు వీధిలో ఉన్న ఇప్పల పోలమ్మ గుడి దగ్గర దృశ్యాలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. అందుకే అక్కడ ఏ పండుగా.. జాదత లేకపోయినా.. ఆ వింత చూసేందుకు గుడి దగ్గర చాలామంది గుమిగూడారు.



    అలా గుమిగూడిన వారంత లోపలో ఏదో జరుగుతోంది అంటూ వినడానికి ఒకరిని ఒకరు తోసుకుంటూ గేటు దగ్గరకు వెళ్లి వింటున్నారు. చెవులు గేటుకు దగ్గరగా పెట్టి వింటే లోపల చాలామంది ఉండి ఆ శబ్ధాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. కానీ లోపల ఎవరూ లేరంటున్నారు. దీంతో ఆ విషయం ఆ చెవినా, ఈ చెవినా పడి ఊరంతా పాకింది. ఇంకేముంది అందరూ ఇలా పొలోమంటూ గుడి దగ్గరకు చేరుకున్నారు. గుడిలో నుంచి పసుపు వాసనతో పాటు గాజులు, గజ్జెల మోతాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. వాటిని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.



    ఇప్పల పోలమ్మ అనే దేవత చాలా శక్తి వంతమైనదని భక్తుల విశ్వాసం. అప్పుడప్పుడు గ్రామంలో చాలా మందికి పూనకం వస్తుందని.. అమ్మవారు తనకు కావాల్సింది అడిగి చేయించుకుంటుందని స్థానికులు చెప్తున్నారు. అమ్మవారి కోరిక మేరకు జాతర కూడా జరుపుతుంటారు. అయితే ఈ సారి జాతర లేటైంది అంటున్నారు. అందుకే అమ్మవారు ఇలా జాతర చేయాలని తమకు గుర్తు చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి : బ్రహోత్సవాల కోసం సర్వం సిద్ధం.. ఉప్పుతో గోవిందుడి బొమ్మ గీసిన భక్తుడు.. చూస్తే వావ్ అనాల్సిందే

    లేదంటే గ్రామానికి ఏదో అరిష్టం జరగబోతోందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. ఆలయం దగ్గరకు చేరుకున్నారు. గుడిలో శబ్దాలు ఏంటి.. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, VIRAL NEWS, Vizianagaram

    తదుపరి వార్తలు