Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA PRADESH POLITICAL NEWS YELAMANCHALI SITTING MLA TENSION ABOUT HIS SEAT NGS VSP

YCP Politics: ఆ ఎమ్మెల్యేపై వ్యతిరేక స్వరం వినిపించడానికి కారణం ఎవరు..? అంతా పథకం ప్రకారమే జరుగుతోందా..?

ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ కు సీటు లేనట్టేనా?

ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ కు సీటు లేనట్టేనా?

YCP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల మూడు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా.. సిట్టింగ్ లకు వర్గపోరు తప్పడం లేదు. అయితే అదే పార్టీ కీలక నేతలే ఈ గొడవలకు కారణమనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏ నియోజకవర్గం.. అక్కడ వర్గ పోరుతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యే ఎవరు..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  P. Anand Mohan, News18, Visakhapatnam.

  YCP Politics: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) లో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే.. ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. దశాబ్ధంన్నర కాలంగా తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతటి సీనియర్ నేత.. ఇప్పుడు సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మొన్నటి వరకు ఆయన నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులే..? వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారా..? అంతేకాదు వారంతా నేరుగా మంత్రితో టచ్ లోకి వెళ్లారా..? ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతోందా అనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే అలర్ట్ అవ్వకపోతే కష్టాలు తప్పవంటూ ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారంట.. ఇంతకీ ఎవరా నేత అంటే..? యు.వి.రమణమూర్తి రాజు  (U.V. Ramanamurthy Raju) అలియాస్ కన్నబాబు.. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఆయనకు ఇప్పుడు వర్గ పోరు తప్పడం లేదు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా (Anakapalli District) యలమంచిలి ఎమ్మెల్యే అయిన ఆయనకు రెండు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉంది. అందుకే నియోజకవర్గంపై గట్టిపట్టు సాధించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగిన కన్నబాబు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ గ్యారెంటీ లేదనే ప్రచారం ఇప్పుడు గందరగోళంగా మారింది.

  వయోభారమో, లేక ఇతర కారణాల రీత్యా ఇక్కడ అభ్యర్ధి మార్పు అనివార్యమనే సంకేతాలు అధిష్టానం నుంచి అందుతున్నాయనే సమాచారం ఉంది. ఎమ్మెల్యే సైతం ఇప్పటికే మానసికంగా సిద్ధమైనట్టు టాక్‌. తన కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ కాబోయే ఎమ్మెల్యే అభ్యర్ధి అంటూ లీకులు ఇస్తున్నారట కన్నబాబు. అందుకుతగ్గట్టే.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ సుకుమార్‌ వర్మను ముందుంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కన్నబాబే అయినప్పటికీ వ్యవహారాలు నడిపించేది మాత్రం సుకుమార్ వర్మనే అన్నట్లుగానే ప్రచారం ఉంది.  ఇలాంటి తరుణంలోనే నియోజకవర్గంలో కొత్త రాజకీయ కలవర పెడుతున్నాయ్. మొన్నటి వరకు ఆయనకు అనుకూలంగా ఉన్న అచ్యుతాపురం మండలానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నట్టు టాక్. జిల్లా మంత్రులు అమర్నాథ్, ముత్యాల నాయుడిని నేరుగా కలవడంతో.. వివాదం మరింత ముదురుతోంది. తనను పక్కన పెట్టి మంత్రులను కలవడాన్ని ఆయన్న జీర్ణించుకోలేకే.. వేధింపులకు పాల్పడుతున్నారనేది ఆయ మండల కార్యకర్తల ప్రధాన ఆరోపణ. అక్కడితో ఆగకుండా కన్నబాబు రాజు కక్ష సాధింపుల నుంచి విముక్తి కల్పించాలని ఓ ఎంపీటీసీ నేరుగా సీఎం జగన్‌కు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

  ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి చంద్రబాబు నాయుడు పోటీ..? కారణం ఇదేనా..?

  ఈ వివాదానికి అంతటికీ ఓ మంత్రే కారణమన్నది.. కన్నబాబు వర్గీయుల వాదన.. ఇంతకాలం ఎమ్మెల్యేపై భయంతోనే, పార్టీ మీద విధేయత కారణంగానో పనిచేసిన ద్వితీయ శ్రేణి నేతలకు.. ఇప్పుడు మంత్రి అండ దొరకడంతో.. నిరసన గళం వినిపిస్తున్నారనే టాక్ కూడా ఉంది.

  ఇదీ చదవండి : అమ్మవారి గుడిలో ఎవరూ లేకున్నా గజ్జల చప్పుళ్లు, గాజుల మోతలు.. వింత చూసేందుకు ఎగబడ్డ జనం

  తాజా పరిణామాలతో ఎమ్మెల్యే అలెర్ట్ అయ్యారు.. ఈ వ్యవహారాల వెనుక లోగుట్టును పసిగట్టి ఓ అడుగు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అసమ్మతి గళం వెనుక అసలు సూత్రధారి ఓ మంత్రికి అత్యంత సన్నిహితుడనేది ఎమ్మెల్యే కన్నబాబురాజు అనుమానం. దీంతో యలమంచిలిలో టిక్కెట్ తనకు ఇవ్వని పక్షంలో ఆప్షన్ హైకమాండ్ తీసుకుంటుందని చెప్పుకుంటున్నారట.

  ఇదీ చదవండి : బ్రహోత్సవాల కోసం సర్వం సిద్ధం.. ఉప్పుతో గోవిందుడి బొమ్మ గీసిన భక్తుడు.. చూస్తే వావ్ అనాల్సిందే

  కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న స్ధానం కావడంతో ఇక్కడి నుంచి పోటీకి అధికార పార్టీలో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు బలహీనంగా ఉన్నాయని వైసీపీ లెక్క. టిక్కెట్‌ ఆశించే వారి సంఖ్య సహజంగానే పెరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పోటీలో నుంచి పుట్టుకు వచ్చిందే తాజా అసమ్మతి అని ఎమ్మెల్యే వర్గం అభిప్రాయపడుతోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు