P Anand Mohan, Visakhapatnam, News18. TDP Leader: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu). అలాగే అధికార వైసిపిని ఒక ఆట ఆడేసుకునే నేతగా ముందు వరుసలో ఉంటాడు . ముఖ్యంగా వైసీపీ అధినేత పేరు ఎత్తితో.. ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ని ను అత్యధికంగా తిట్లు తిట్టిన టీడీపీ నేత ఎవరైనా ఉన్నారా అంటే.. ముందుగా చెప్పాల్సింది అయ్యన్న పేరు మాత్రమే. విశాఖలో వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్న ఆయనపై కేసులు పెట్టడం తప్ప.. ఆయన్ను ఏమీ చేయలేకపోతున్నారు వైసీపీ నేతలు.. ఆయనా ఆయన పై కేసులు పెట్టడం తప్పా.. అరెస్ట్ చేయడం అంతా ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే టీడీపీ నేతల్లో ఆయనపై నమోదైన కేసులు మరెవరిపైనా నమోదు అవ్వలేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.. అయినా ఒక్క కేసులో కూడా ఆయన్ను టచ్ చేయలేకపోయారు పోలీసులు.. దీంతో ఆయన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదన్నది పోలీసులకు అర్థం అవుతోంది. బుధవారం కూడా మరోసారి పోలీసులు విఫలయత్నం చేశారు.
నర్సీపట్నంలో బుధవారం రాత్రి పదకొండు గంటల సమయానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు 41-ఎ నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చింది. అర్థరాత్రి వరకు ఆయన కోసం అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. దీంతో ఏ క్షణంలోనైనా అయ్యన్నను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది.
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అక్కడి వైసీపీ నాయకుడు రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై పోలీసులు ఐపీసీ 153 (ఏ), 502 (2), 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం సీఐ రఘు, నల్లజర్ల ఎస్‌ఐ ఐ.అవినాష్, దేవరపల్లి ఎస్‌ఐ కె.శ్రీహరిరావులు ప్రైవేటు వాహనంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు నర్సీపట్నంలోని కృష్ణాదేవిపేట రోడ్డులో గల అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద లేరని పీఏ రామచంద్రరావు తెలియజేయడంతో మధ్యాహ్నం 1.30 గంటల వరకు వేచి ఉండి, ఇంటి గోడకు నోటీసు అంటించి వెళ్లిపోతున్నామంటూ బయటకు వచ్చారు.
ఇదీ చదవండి : ఉక్రైన్ లో రష్యా దాడులతో ఉలిక్కిపడ్డ సిక్కోలు.. కారణం ఏంటో తెలుసా..?
వారు తిరిగి వెళ్లిపోకుండా అయ్యన్న ఇంటి సమీపంలోనే మకాం వేయడంతో ఆయన్ను అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది. కేవలం నోటీసు ఇచ్చి వెళ్లిపోతామని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అర్ధరాత్రి వరకు నర్సీపట్నంలోనే మకాం వేయడం, స్థానిక పోలీసులు, స్పెషల్ పార్టీతో కలిసి అయ్యన్నపాత్రుడు ఇంటి సమీపంలో మోహరించడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే అనుమానంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నర్సీపట్నం చేరుకున్నారు.
ఇదీ చదవండి : ఏపీ సర్కార్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. విజయవాడలో నిరసనలు
అయితే.. దీనిపై అయ్యన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారించిన హైకోర్టు తదుపరి ఆదేశాలు నిలిపేయాలని పేర్కోంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయనకు ఊరట లభించింది. దీంతో నర్శీపట్నంలోకి అయ్యన్న ఇంటి వద్ద కోలాహలమే కనిపించింది. మా నాయకుడు సింహం అంటూ క్యాడర్ జోరు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ayyannapatrudu, Visakhapatnam