హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP-BRS: ఏపీ, తెలంగాణ సీఎంల స్కెచ్ మామూలుగా లేదుగా..? శారదా పీఠం నుంచే బీజం పడే ఛాన్స్..?

YCP-BRS: ఏపీ, తెలంగాణ సీఎంల స్కెచ్ మామూలుగా లేదుగా..? శారదా పీఠం నుంచే బీజం పడే ఛాన్స్..?

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్)

వైఎస్ జగన్, కేసీఆర్ (ఫైల్)

YCP-BRS: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల స్కెచ్ మామూలుగా లేదా..? శారదా పీఠంలో కలియక తరువాత వ్యూహాల విషయంలో వేగంగా అడుగులు వేయనున్నారా? ఇంతకీ ఇద్దరి పొలిటికల్ ప్లాన్ ఏంటి..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ (YCP), విపక్ష పార్టీలు టీడీపీ(TDP)-జనసేన (Jansena) మధ్య 2024 ఎన్నికల ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) రూపంలో మరో పొలిటికల్ పార్టీ హడావుడి చేసేందుకు సిద్ధమైంది. అయితే  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy).. తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇద్దరు కలసి భారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఉంది. విశాఖ వేదికగా ఇద్దరు సీఎంలు ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం అన్ని పార్టీల్లో కలుగుతున్నాయి. ఈ నెల 28 తేదీన విశాఖపట్నం (Visakhapatnam) లోని శారదా పీఠంలో రాజశ్యామల యాగం జరగబోతోంది.

విశాఖ శ్రీ శారదాపీఠం ఆధిష్టాన దైవం రాజశ్యామలా అమ్మవారి శత సహస్ర యాగంలో పాల్గొనేందుకు అనేక మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు వార్షికోత్సవాలకు తరలి వస్తున్నారు. 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాగంలో పాల్గొంటారు. 

అదే రోజు ఉదయం పంజాబ్‌ గవర్నరు బన్వర్‌లాల్‌ పురోహిత్, సాయంత్రం తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణ హాజరవుతారు. 30వ తేదీన హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌, తెలంగాణ గవర్నరు తమిళిసై కూడా వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు.

ఇదీ చదవండి : రెబల్ ఎంపీ.. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ప్లేస్ ఫిక్స్ అయ్యిందా?

అలాగే యాగంలో పాల్గొనేందుకు జగన్ వైజాగ్ వస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ ఒకసారి రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చారు. ఇదే సమయంలో తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా హాజరవుతారు. కేసీఆర్ ఇప్పటికి మూడుసార్లు రాజశ్యామల యాగం చేయించిన విషయం తెలిసిందే.  ఇందులో ఒకసారి జగన్ కూడా పాల్గొన్నారు. మొదటినుండి జగన్ కు విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేద్రస్వామిపైన బాగా గురుంది. స్వామి పీఠంలో చేయించే యాగాల్లో అప్పుడప్పుడు పాల్గొంటునే ఉంటారు.

ఇదీ చదవండి : మంత్రి క్రేజ్ మామూలుగా లేదుగా.. సినిమా రిలీజ్ ఈవెంట్ లా బర్త్ డే వేడుకలు..?

ప్రత్యక్షంగా జగన్ కు సంబంధంలేకుండా స్వామి ఇదివరకు కూడా రాజశ్యామల యాగం చేయించారు. చివరిలో తీర్ధ, ప్రసాదాలు తీసుకోవటానికి మాత్రమే జగన్ వెళ్ళారు. కానీ కేసీఆర్ అలాకాదు  యాగం జరిగినన్ని రోజులు పూర్తి దీక్షలో ఉంటారు.  భార్యతో కలిసి యాగ క్రతువులో ప్రతిరోజు  ప్రత్యక్షంగా పాల్గొంటారు. తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకే రెండురాష్ట్రాల్లోను యాగాలు మొదలవబోతున్నాయి.

ఇదీ చదవండి : పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. వారసత్వంగా ఎదగలేదు..? పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరా

అధికారంకోసం, శతృవులపై విజయం కోసం రాజశ్యామల యాగాన్ని చేయిస్తే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇప్పుడు ఈ యాగం చేయడం వెనుక కేసీఆర్, సీఎం జగన్ ను గెలిపించాలనే కోరిక కూడా ఉంది అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వేగంగా అడుగులు వేస్తుండడం వెనుక జగన్ వ్యూహాలు కూడా ఉన్నాయనే ప్రచారం ఉంది.

ఇదీ చదవండి: మొన్నటి వరకు అసమ్మతితో ఉన్న ఆ నేతకు అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చారా..? ఆ ఆఫర్ ఏంటంటే..?

ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గాల్లో అత్యధిక శాతం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆ ఓట్లు అన్నీ టీడీపీ , జనసేన కూటమికి పడితే.. వైసీపీకి నష్టం తప్పకపోవచ్చు.. అందులో భాగంగానే కాపు ఓట్లు చీల్చేలా వ్యూహం ఉంది అంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆ సామాజిక వర్గం నేతలే ఎక్కువగా చేరేలా స్కెచ్ వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, CM KCR

ఉత్తమ కథలు