Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA PRADESH NEWS VISAKHAPATNAM TRIBAL FARMERS CHANGE THEIR ROUTE FARMING NGS VSP

Tribal Farming: చిరు ధాన్యాలతో భారీ లాభాలు.. రూటు మార్చిన ఏజెన్సీ రైతులు..?

చిరు ధాన్యాల సాగుతో లాభాలు గడిస్తున్న గిరిజన రైతులు

చిరు ధాన్యాల సాగుతో లాభాలు గడిస్తున్న గిరిజన రైతులు

Tribal Farming: గిరిజన రైతులు రూటు మార్చారు.. సంప్రదాయ పంట వరిసాగును తగ్గించి. సిరి ధాన్యాల సాగువైపు అడుగులు వేస్తున్నారు. మరి గిరిజన ప్రాంతాల్లో చిరు ధాన్యాల సాగు సాధ్యమేనా..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?

  P Anand Mohan, News18, Visakhapatnam

  Tribal Farming:  ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh) లో గిరిజన రైతులు.. ఇప్పుడు రూటు మార్చారు.. వరి సాగుపైనే  ఆధారపడకుండా సరైన ధరల వచ్చే పంటల్ని ఎంచుకుని మరీ పండిస్తున్నారు. కొందరు స్వచ్చంధ సంస్థల సహకారంతో.. వారి సలహాలతో చిరుధాన్యాల (Small Grains) వైపు అడుగులు వేస్తున్నారు  గిరిజనులు. అంతేకాదు లాభాల బాటలో పయనిస్తున్నారు కూడా.  ఏజెన్సీ (Agency) లో వరి సాగును తగ్గించి చోడి నాట్లు ముమ్మరం చేశారు. అయితే దీంతో మరో ప్రయోజనం కూడా ఉంది.. ఎందుకంటే వరి సేద్యం ఖర్చుతో కూడుకున్నది.. ఎరువుల అవసరం కూడా ఎక్కువే. అందుకే వరికి అంత పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడడం కంటే.. సేంద్రీయ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగు సులభంగా జరుగుతోంది. దీంతో ఆ వైపు గిరిపుత్రులు అడుగులు వేస్తున్నారు.

  విశాఖ మన్యం (Visakha Agency) లో రాగి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవిలో కూడా వర్షాలు పడడంతో మే నెలాఖరు, జూన్‌ మొదటి వారంలో గిరిజన రైతులు నారుమడులు సిద్ధం చేసుకుని విత్తనాలు జల్లారు. నెల రోజుల్లో నారు ఎదగడంతో కొద్ది రోజుల నుంచి పొలంలో నాట్లు వేస్తున్నారు. ఏజెన్సీలో సాగు చేసే చిరుధాన్యాల పంటలో రాగి మొదటి స్థానంలో వుండడంతో దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పంటను సాగు చేస్తుంటారు.  ఏజెన్సీ వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. ఇందులో 46 వేల హెక్టార్లలో వరి, 28 వేల హెక్టార్లలో చోడి పంటను సాగు చేస్తుంటారు. నీటి సదుపాయం ఉన్న పల్లపు ప్రాంతాల్లో వరి పంటను, మెట్ట, కొండవాలు ప్రాంతాల్లో చోడిని వేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి మెత్తబడడంతో దుక్కి పనులు పూర్తి చేసి, చోడి నాట్లు వేస్తున్నారు. చోడి పంటకు నీటి అవసరం చాలా తక్కువ వుంటుంది. దీంతో మెట్ట భూములతోపాటు కొండవాలు ప్రాంతాల్లో సైతం చోడి పంట పండుతుంది. అధిక పోషక విలువలు వుండడంతో గిరిజనుల బియ్యంకన్నా రాగులనే ఆహారంగా తీసుకుంటుంటారు.

  ఇదీ చదవండి : ఏపీలో మంగళవారం నుంచి వానలే వానలు.. సాగుకు రెడీ అవుతున్న రైతులు

  సాధారణంగా చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నువ్వు వంటి నూనె పంటలను సాగు చేసే రైతులు విత్తనాలను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీనిని వెదజల్లే పద్ధతి అంటారు. ఇందుకు ఎక్కువ మొత్తంలో విత్తనం అవసరం అవుతుంది. పైగా పొలంలో మొక్కల మధ్య సమాన దూరం వుండదు. కొన్నిచోట్ల మొక్కలు పలుచగా, మరికొన్నిచోట్ల ఒత్తుగా వుంటాయి. దీనివల్ల ఆశించిన దిగుబడి రాదు. నారు నాటే పద్ధతిలో సాగు చేస్తే విత్తనం ఖర్చు తగ్గడంతోపాటు పంట దిగుబడి రెట్టింపు అవుతుంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వచ్చి అవగాహన కల్పించడంతో గిరిజన రైతులు కొంతకాలం నుంచి నారు నాటే విధానంలో చోడి పంటను సాగు చేస్తున్నారు.

  ఇదీ చదవండి : ప్రధాని టూర్ లో భద్రతా వైఫల్యంపై బీజేపీ ఆగ్రహం.. నల్లబెలూన్లు ఎగురవేసింది వారే అంటూ పోలీసుల వివరణ

  వేసవిలో కురిసే చెదురు మదురు వర్షాలకు దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేసుకుంటారు. ఇదే సమయంలో నారుమళ్లలో విత్తనాలు చల్లుతారు. జూన్‌ చివరి వారం నుంచి ప్రధాన పొలంలో నాట్లు వేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకోరు. కుటుంబ సభ్యులంతా పొలం బాట పడతారు. మగవాళ్లు నాగలితో చాళ్లు చేస్తుంటే, మహిళలు, పిల్లలు నాగటి చాళ్లలో చోడి నారు నాటుతుంటారు. ఈ పంట చేతికి వస్తే గణనీయంగా లాభాలు వస్తాయని ఏజెన్సీలో అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు అంతా చిరు ధాన్యాల సాగువైపు అడుగులు వేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Farmers, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు