Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ANDHRA PRADESH NEWS TRIBAL FACING WATER PROBLEMS IN VIZAG AGENCY AREA VSJ NJ NGS

Vizag: గుక్కెడు నీళ్ల కోసం యుద్ధం చేయాలా? చేతులు జోడించి వేడుకుంటున్న మహిళలు

నీళ్ల

నీళ్ల కోసం చేతులు జోడిస్తూ మహిళల ఆందోళన

Tribal Problems: దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ కా తిరంగ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యిందని ఉత్సవాలు చేసుకుంటున్నాం. కానీ ఇప్పటికీ విశాఖ ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల జీవితాలు మాత్రం మారడం లేదు. గుక్కెడు నీళ్ల కోసం చేతులు జోడించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadesh, News 18, Vizag.

  Visakhapatnam: దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav) , హర్‌ ఘర్‌ కా తిరంగ కార్యక్రమాలు జరుగుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయ్యిందని ఉత్సవాలు చేసుకుంటున్నాము. కానీ ఇప్పటికీ గిరిజనుల జీవతాలు (Tribal people Life) మాత్రం మారడం లేదు. ఆదివాసీ దినోత్సవాలు జరుపుకోవడం తప్ప ప్రభుత్వాలు తమను పట్టించు కోవడం లేదని పలు మార్లు నిరసనలు తెలిపినా పట్టించుకోవడం లేదని… గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ (Visakha Agency) లో జాజులు బంధ ఆదివాసి మహిళలు ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటున్న దృశ్యం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

  అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sita Rama Raju District) కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ శివారులో జాజులు, బంధ, కొందు తెగ ఆదివాసీలు నివసిస్తుంటారు. ఆ గ్రామంలో ఇప్పటికీ మంచినీరు కోసం గెడ్డ నీళ్లు తెచ్చుకుంటున్నారు. నీరు తెచ్చుకోవాలంటే చాపరాయి మీది నుండి నడుచుకుంటూ వెళుతూ నీళ్ల తెచ్చుకోవాలి. వర్షాకాలంలో చాపరాయి బాగా తడిసిపోవడంతో నీళ్లు తెచ్చుకునే సమయంలో కాలుజారి అనేకమంది మహిళలు పడిపోతున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మా గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని… చేతులు జోడించి జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు. తరచూ అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న PHCకి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లుగా మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం.

  ఇదీ చదవండి : దంపతుల కేసుతో పోలీసుల పరేషాన్.. బుగ్గ కొరికేశాడంటూ భర్తపై ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

  మంచినీటి సమస్య మాత్రమే కాదు... తమకు రోడ్డులు. అంగన్వాడి సెంటర్, పిల్లలకి స్కూలు. సౌకర్యం కల్పించాలని కోరుతూ అడ్డాకుల టోపీ ధరించి… అర్ధనగ్నంగా డోలిలతో ప్రదర్శన చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా , అనకాపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలైన అర్ల పంచాయతీ రోలుగుంట మండలం పెద్ద గురువు. పిత్రు గేడ్డ . నుండి మూలపేట పంచాయితీ జాజుల బంధ గ్రామం వరకు 4 కిలోమీటర్ల దూరం వరకు అడ్డాకుల ధరించి డోలితో అర్థనగ్న ప్రదర్శన చేసి 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసుకుంటూ జాజుల బంధ గ్రామంలో వినూత్నంగా ధర్నా నిర్వహించడం జరిగింది.

  ఇదీ చదవండి : విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపే వారి ఖాతాల్లోకి నగదు జమ..

  కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజుల బంధ, రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ కేంద్రం నుండి పెద్ద గురువు. పిత్రుగేడ్డ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కోందు తెగకు చెందిన 400 మంది జనాభా కొండ శిఖరంలో నివసిస్తున్నారు. తమ గ్రామాల్లో 70 మంది పిల్లలు 11 సంవత్సరాలలోపు ఉన్నారు. 12-14 పిల్లలు 15 మంది ఉన్నారు. కనీసం అంగన్‌వాడి సెంటర్ కూడా లేదు. ప్రభుత్వ స్కూలు కూడా లేదు. అయినా సరే నడిచి కుమ్మరుల గ్రామంలో స్కూల్‌కి వెళ్తుంటే.. అక్కడ స్కూల్‌ టీచర్‌ రావడం లేదని.. ఇంక పిల్లలను ఎలా చదివించుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

  ఇదీ చదవండి : సిస్టర్ అంటూ మాట కలుపుతాడు.. ఫోటోలు దిగుతాడు.. తరువాత ఏం చేస్తాడంటే?

  మా గ్రామస్థుల అందర్ని …. ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు చందాలు వేసుకొని డబ్బులతో ఆరు కిలోమీటర్ల దూరం రోడ్డు నిర్మాణం చేసుకున్నామని..భారీ వర్షాలకు అది కూడా కొట్టుకుపోయిందని వాపోతున్నారు.
  కొండకోనల్లో అడవుల మధ్య బతుకుతూ.. ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. కల్మషం లేని మనస్సు వారి సొంతం. డోలు చప్పుల్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు గిరిజనుల జీవన శైలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా… ఆదివాసీల జీవనస్థితిగతుల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించట్లేదు. నేటికి వైద్యం, విద్య, మౌలికవసతుల కల్పన వంటి వాటికి గిరిజన గ్రామాలు దూరంగానే ఉన్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam

  తదుపరి వార్తలు