హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: పాములంటే భయమా.. ఈ వీడియో చూస్తే..! మీ భయం పటాపంచలవుతుంది…!

Vizag: పాములంటే భయమా.. ఈ వీడియో చూస్తే..! మీ భయం పటాపంచలవుతుంది…!

X
పాములంటే

పాములంటే భయపడేవారు ఈ వీడియో చూడండి

Vizag: పాముని చూస్తే ఎవ్వరికైనా గుండె అదరాల్సిందే.. అల్లంత దూరం పరిగెత్తాల్సిందే..! అలాంటిది ఎంత పెద్ద పామునైనా సరే చాకచక్యంగా ఎవ్వరికి ఎలాంటి హాని కలగకుండా పట్టుకుంటాడు విశాఖపట్నంకు చెందిన పాముల నాగరాజు.

Neelima Eaty, News18 Visakhapatnam

Vizag Snake Catcher : సాధారణంగా చాలామందికి పాములన్నా, వాటిగురించి మాట్లాడుతున్నా చచ్చేంత వణుకు. కలలో పాము కనిపించినా చలి జ్వరం తెచ్చుకునే వాళ్లు ఉంటారు. కానీ ధైర్యంగా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ భయాలన్నీ పటాపంచలవుతాయి. పాముని చూస్తే ఎవ్వరికైనా గుండె అదరాల్సిందే...అల్లంత దూరం పరిగెత్తాల్సిందే..! అలాంటిది ఎంత పెద్ద పామునైనా సరే చాకచక్యంగా ఎవ్వరికి ఎలాంటి హాని కలగకుండా పట్టుకుంటాడు విశాఖపట్నంకు చెందిన పాముల నాగరాజు. వానాకాలం, వరదల సమయంలో పాములు ఎక్కువగా ఎక్కడంటే అక్కడ సంచరిస్తుంటాయి. ఒక్కోసారి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి. అలాంటి సమయంలో కంగారు పడకుండా కాస్త అలోచనతో తనకు కాల్‌ చేయమంటున్నాడు నాగరాజు.

విశాఖపట్నంలోని యారాడ కొండపై సింధియా సమీపంలో నివసిస్తున్న నాగరాజుకు… పాములు పట్టడంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ ప్రయాణంలో నాగరాజు ఎన్నో విషపూరితమైన పాములను చూశాడు. ఇప్పటివరకు దాదాపు పదివేలకు పైగా పాములను పట్టుకున్నట్లు నాగరాజు తెలిపారు. విశాఖలో ఏ ఇంట్లో అయినా ఆఫీస్‌లలో అయినా పాములు ప్రవేశిస్తే… వెంటనే నాగరాజుకు కాల్‌ వెళ్తుంది. 

ఫోన్‌ కాల్‌ చేసే వాళ్లలో చాలామంది భయంగా..టెన్షన్‌గా మాట్లాడుతుంటారని నాగరాజు చెబుతున్నారు. కొంతమంది పాములు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని కొట్టి చంపుతుంటారు. భయంతో అలా ఎప్పుడూ చేయోద్దని.. వాటికి కూడా భూమిపై జీవించే హక్కు ఉంటుందంటున్నాడు నాగరాజు.

పాములలో విషసర్పాలు మరియు విషం లేని పాములు ఉంటాయి. ఈ పదేళ్లలో పాములు పట్టే సమయంలో చాలా సార్లు పాముకాటుకు గురయ్యాడు.. ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నాడు.. కానీ ఏ రోజు ఏ పామును చంపలేదు.

ఇదీ చదవండి : ఫుడ్ లవర్స్ కు సరికొత్త అనుభూతి.. కలర్‌ఫుల్‌ చేపల మధ్య కూర్చుని టేస్ట్ ఎంజాయ్‌ చేయోచ్చు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

పాములకు మనం ఏమైనా చేస్తామేమో నని భయంతో కాటేస్తాయని…వాటికి హాని చేయకుండా ఉండే సైలెంట్‌గా పక్కకు వెళ్తాయంటున్నాడు నాగరాజు. మనం వాటిని ఏమైనా హాని కలిగించాలని ప్రయత్నించినా.. చికాకు పెట్టినా.. అవి మనల్ని కాటు వేయడానికి ప్రయత్నిస్తాయంటున్నాడు నాగరాజు.

ఇదీ చదవండి: గోదావరి మహోగ్రరూపం.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు.. నేడు సీఎం ఏరియల్ సర్వే..

బంగారు పూత తాచుపాము:    కొండచిలువ, నాగుపాము, జెర్రి గొడ్డు..ఇలా ఏ రకం పామునైనా పట్టుకుంటానంటున్నారు నాగరాజు. మొన్నామధ్య సింధియాలోని నావల్ క్వార్టర్స్ దగ్గర పది అంగుళాల బంగారు పూత తాచు పామును పట్టుకున్నాడు. ఈ రకమైన పాము శేషాచలం అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.

ఇదీ చదవండి : ఏపీలో గోతుల మధ్య రోడ్లు వెతుక్కోవాలా? నేటి నుంచి పవన్ డిజిటల్ క్యాంపెయిన్.. వెల్లువలా ట్వీట్లు

పూజిస్తారు…కానీ కనిపిస్తే భయపడతారు..!:   అటవీ ప్రాంతాల్లో, గుబురుగా ఉండే గుట్టల్లోనూ పాములు ఎక్కువగా ఉంటుంటాయి. అందకే పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలంటున్నాడు. ఎక్కడ లేని విధంగా మన దేశంలో పాములను పూజించే సంప్రదాయం ఉంది. నాగదేవతగా ఊరురా కొలుస్తూ దండాలు పెడుతూ ఉత్సవాలు చేస్తుంటారు. అదే ప్రజలు నిజజీవితంలో పాములను చూస్తే దండం పెట్టిన చేతులతోనే చంపడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇదీ చదవండి : నేడు డ్రైవర్లకు శుభవార్త.. విశాఖ పర్యటనలో నగదు విడుదల.. రాని వాళ్లకి మరో ఛాన్స్.. ఏం చేయాలాంటే?

పాలు, గుడ్లు ముట్టుకోవు..!: ప్రజలు నాగుల చవితిని పురస్కరించుకుని పాములకు పాలు, గుడ్లు అందజేస్తారని…అయితే పాములు వాటిని ముట్టుకోవంటున్నాడు నాగరాజు. ఎందుకంటే అవి ఆక్సిజన్ పీల్చుకుని జీవించగలవంటున్నారు.

ఇదీ చదవండి: పక్కా ప్లాన్ తో 11 మందిని పెళ్లాడిన నిత్య పెళ్లి కొడుకు.. గుట్టు ఎలా రట్టైందంటే?

పామును పట్టడం చూస్తే భయం పోతుంది..!:  మాములుగా చాలామందికి పాములన్నా, వాటిగురించి మాట్లాడుతున్నా చచ్చేంత వణుకు. కలలో పాము కనిపించినా చలి జ్వరం తెచ్చుకునే వాళ్లు ఉంటారు. కానీ ధైర్యంగా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ భయాలన్నీ పటాపంచలవుతాయి. నాగరాజు పాములను పట్టుకోవడం ప్రత్యక్షంగా చూసిన ఎంతో మందికి పాములపై ఉన్న భయం పోయిందంటారు.

ఇదీ చదవండి: కొడుకు కోసం ఖరీదైన కారు.. కలెక్షన్ క్వీన్ అంటూ టీడీపీ రచ్చ.. వైసీపీ వెర్షన్ ఏంటంటే?

నాటు వైద్యం వద్దు..! : పాము కాటువేస్తే…ఇంటి నివారణలు లేదా పసరా కోసం నాటువైద్యం లాంటివి పాటించొద్దని నాగరాజు సూచిస్తున్నారు. దయచేసి సమీపంలోని ఆసుపత్రికి వెళ్తే ప్రమాదపు అంచుల నుంచి కోలుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి : అదివో అల్లదివో.. ఆధ్యాత్మిక ప్రాంతం.. మరింత ఆహ్లాదకరంగా మారిన దృశ్యం.. మీరూ చూడండి

మీరు విశాఖపట్నం…అక్కడ పరిసరాల్లో నివసించేవారయితే… మీరు మీ ప్రాంతంలో ఎక్కడైనా పామును చూస్తే వెంటనే తనకు కాల్‌ చేయమంటున్నాడు నాగరాజు. తను రాకపోయినా తనకింద ఇంకా నలుగురు ఉద్యోగులు ఉన్నారని వాళ్లు వచ్చి పాములను పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెడతారని నాగరాజు తెలిపారు.


ఫోన్‌ నెంబర్‌: +91 7569135128, నాగరాజు

అడ్రస్‌: సింధియా, యారాడ కొండ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌- 530005.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Snake, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు