Neelima Eaty, News18 Visakhapatnam
Vizag: ఫుడ్ లవర్స్ కొత్త అనుభూతులు కోరుకుంటున్నారు.. ఏదైనా సరికొత్తగా కనిపిస్తేనే రెస్టారెంట్ (Restaurant) వైపు చూస్తున్నారు.. లేదంటే లైట్ తీసుకుంటున్నారు.. అందుకే కరోనా (Corona) కష్టకాలం సమయం ఫుడ్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కస్టమర్లు రెస్టారెంట్లవైపు చూస్తున్నారు.. అలాంటి కస్టమర్లను అట్రాక్ట్ చేేసేందుకు హోటళ్ల యజమానులు సైతం కొత్త ఆలోచన పిల్లలకు భోజనం పెట్టడం అంటే పేరెంట్స్‌కు పెద్ద పరీక్ష లాంటిదే. వాళ్లకు నచ్చిన కార్టూన్ ఛానెల్స్, యూట్యూబ్ (Youtube), వీడియో గేమ్స్ (Video Games), బొమ్మలు (Toys).. ఇలా ఎన్నిటినో చూపిస్తే కానీ సగం భోజనమైనా తింటారు. కానీ ఒక్కసారి మీరు మీ పిల్లలను ఈ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారంటే.. వాళ్లు మారాం చేయకుండా హ్యాపీగా భోజనం చేస్తారు. ఎందుకంటారా.. అక్కడ వాళ్లకు ఎంతో ఇష్టమైన చేప పిల్లలుంటాయి. నీళ్లలో దిగి చేపపిల్లలతో ఆడుకుంటూ తినడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు చెప్పండి..ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్లకు కూడా అదో సరదా..
విశాఖపట్నం (Visakhapatnam) లోని గాజువాక (Gajuwaka) లో ఏర్పాటుచేసిన ఫిష్ ఆక్వేరియం రెస్టారెంట్ ఇప్పుడు ఫుడ్‌లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ రెస్టారెంట్‌లో అడుగుపెడితే ఏదో చేపలచెరువులో కాలు పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది.
భోజనప్రియులను, కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి ‘’బార్బీక్యూ మండి రెస్టారెంట్ ‘’ వినూత్న ప్రయోగం చేసింది.
ఒకప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రోజుకో ఆఫర్లు, గిఫ్ట్ ప్యాక్‌లు పెట్టేవాళ్లు.. కానీ ఇప్పుడు థీమ్ బేస్‌డ్ రెస్టారెంట్‌లతో ఫుడ్‌లవర్స్‌ను తమ రెస్టారెంట్‌లకు క్యూ కట్టేలా చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఈ థీమ్ బేస్‌డ్ రెస్టారెంట్‌ల హావా నడుస్తుంది. ఈ కోవలోనే వైజాగ్‌లో ఆక్వేరియంలోనే రెస్టారెంట్ కాన్సెప్ట్‌తో ఓ ఫిష్ డైనింగ్ థీమ్ రెస్టారెంట్ వెలిసింది. నగరవాసులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్న ఈ రెస్టారెంట్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
ఇదీ చదవండి : ఈ కర్రీ ప్యాకెట్ చాలా ఖరీదు వేయి రూపాయలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
రెస్టారెంట్‌ని ఏకంగా చేపల అక్వేరియంలా మార్చేసింది. చెక్కతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లోరింగ్‌పై నీటిని నింపి..కలర్‌ఫుల్ చేప పిల్లలను వదిలారు.. అందులోనే డైనింగ్ టేబుల్స్, కుర్చీలు ఏర్పాటుచేసి కస్టమర్లను ఆహ్వానించింది. అలా కస్టమర్లు ఆ టేబుళ్లలో నీళ్లలోనే మధ్యలోనే ఎంచక్కా తినొచ్చు. నీళ్లలోని రంగురంగుల చేపలను చూస్తూ తాము అందించే ఆహార పదార్థాలను ఆస్వాదించమని వెల్‌కమ్ చెబుతోంది.
ఆక్వేరియంలో కోయ చేపలు
ఇక్కడ నీటిలో ఉండే చేపలు కోయ రకానికి చెందినవి. ఇవి పెడిక్యూర్ లాంటివి చేయవు. ఇవి మాములు సాధారణ చేపలు…కానీ వీటి జీవిత కాలం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే వీటిని పెట్టినట్లు ఓనర్ విజయ్ తెలిపారు. ఈ ఫిష్ థీమే తమ రెస్టారంట్ స్పెషాలిటీ అంటున్నారు విజయ్. దీనిని చూసేందుకు, ఈ థ్రిల్లింగ్ ఫీలింగ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు చాలా మంది కస్టమర్లు ఇక్కడకు వస్తున్నారని విజయ్ అంటున్నారు.
ఇదీ చదవండి: ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై ఎంపీ రఘురామ అనుచరల దాడి.. ఐదుగురిపై కేసు నమోదు
మండి స్పెషల్ రెస్టారెంట్
ఈ ఆక్వేరియం రెస్టారెంట్‌కు బార్బిక్యూ మండి అని పేరు పెట్టారు. సాధారణంగా ఈ రెస్టారెంట్‌లో మండి బిర్యాని ఫేమస్. అంటే పెద్ద ప్లేట్ పెట్టి అందులో బిర్యాని పెట్టి సర్వ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టంగా ఒకే ప్లేట్‌లో తింటుంటారు. గత కొన్ని ఏళ్లుగా ఈ అరేబియన్ మండి కల్చర్ మన దేశంలోనూ చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకే మండి బిర్యానీతో ఈ ఫిష్ థీమ్ కాన్సెప్ట్ తో ఈ రెస్టారెంట్ పెట్టినట్లు ఓనర్ విజయ్ అంటున్నారు.
అన్ని రకాల వెరైటీలతో పసందైన విందు:
బార్బెక్యూ మండితో అన్ని రకాల వెరైటీ ఫుడ్‌లు మండీ స్టయిల్‌లోనే ఇస్తామంటున్నారు. మటన్ మండి, చికెన్ మండి, చికెన్ టిక్కా, హరియాలి టిక్కా, BBQ టిక్కా, BBQ వింగ్స్, ఫిష్ టిక్కా, తంగ్డి కబాబ్, తందూరి చికెన్ హాఫ్, తందూరి చికెన్ ఫుల్, చికెన్ పాప్‌కార్న్, చికెన్ ఫింగర్స్, కోడి మాంసంతో చేసిన ప్రత్యేక తినుబండారం, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఈ రెస్టారెంట్‌లో దొరుకుతాయి. అంతేనా.. పనీర్ మండి, ఫ్రై మండి, జ్యుసీ మండి, బార్బెక్యూ మండి, బార్బెక్యూ ఫిష్ మండి, రొయ్యల మండి, మటన్ మండి, మిక్స్‌డ్ నాన్ వెజ్ మండి ఇలా మరెన్నో రకాలు ఇక్కడ లభిస్తాయి.
ఇదీ చదవండి : ప్రధాని మోదీ సభకు పవన్ ఎందుకు రాలేదంటే..? క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు.. ఏమన్నారంటే..?
చిన్నా పెద్దా అందరిని ఆకర్షించే రెస్టారెంట్…!
ఈ రెస్టారెంట్‌కి వెళ్లాలంటే చిన్న పిల్లలు ఫుల్ జోష్‌గా రెడీ అవుతారు. ఎందుకంటే అక్కడకు వెళ్తే హ్యాపీగా చేపపిల్లలతో ఆడుకుంటూ తమకు నచ్చిన వంటకాలు తినోచ్చని. అక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ కస్టమర్లకు మంచి రుచిని అందిస్తోంది. వీకెండ్స్‌లో ఈ రెస్టారెంట్‌కు నగరవాసులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని విజయ్ చెబుతున్నారు. అక్కడకు వచ్చిన ఒక కస్టమర్‌ని అడిగితే…ఈ థీమ్ రెస్టారెంట్ నెవర్ బీఫోర్ ఎక్సీరియన్స్ అంటూ కితాబిచ్చారు.
ఇదీ చదవండి : ఏపీలో వారందరికీ శుభవార్త.. ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు నేరుగా డబ్బులు.. అర్హత ఏంటంటే..?
ప్రతి సోమవారం సెలవు..!
ఈ రెస్టారంట్ ప్రతి సోమవారం మూసేస్తారు. అక్కడ చేపల వాటర్ క్లీనింగ్ ప్రతి రోజు చేస్తారు.. కనీసం మూడు గంటలు సమయం పడుతుంది అంటున్నారు. ఆ సమయం లో చాపలు అన్నిటి నీ సేఫ్‌గా ఒక టబ్‌లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటామంటున్నారు విజయ్.
మీరు ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉన్న రెస్టారెంట్‌కు సరదాగా వెళ్లి రండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకెళ్తే మాత్రం వాళ్లకు మంచి అనుభూతిని కలిగించిన వాళ్లవుతారు.. కానీ ఓ మాటండోయ్.. ఈ రెస్టారెంట్ లోపలకు వెళ్లేటప్పుడు చెప్పులు బయటే విప్పండి..లేదంటే నీళ్లలో తడిచిపోతాయి…!
అడ్రస్: కణితి రోడ్, ఎస్‌బీఐ బ్యాంక్ ఎదురుగా, చైతన్యనగర్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్- 530026. ఫోన్ నెంబర్: 7382123374
ఎలా వెళ్లాలి?
విశాఖపట్నం బస్టాండ్ నుంచి 99, 400,38 సిరీస్ బస్సులు ఎక్కితే గాజువాకలో దిగొచ్చు. అక్కడ నుంచి లోకల్ ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. బార్బిక్వ్యూ మండి రెస్టారెంట్ అంటే నేరుగా అక్కడకు తీసుకెళ్లి దించుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag