Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
Black Sand Mafia: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాపియా రాయుళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఇప్పటికే అక్రమార్కులు వాగులు, కాలువలు, నదులను కొల్లగొడుతున్నారు. ఇసుక, మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. చివరికు సముద్రాన్ని కూడా వదలడం లేదు. సముద్రం ఒడ్డున (Beach Sand) దొరికే.. నల్ల ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. అది కూడా అందరూ చూసినప్పుడైతే కుదరదని.. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సముద్రపు ఇసుకతో ఏం లాభం అనుకుంటున్నారా..? సముద్రపు నల్ల ఇసుకకు చాలా డిమాండ్ (Full Demand for Black Sand) ఉంటుంది. భోగాపురం (Bhogapuram) మండలంలోని ముక్కాం గ్రామానికి కిలోమీటరు దూరాన సముద్ర తీరం ఉంది. అది కూడా ఈ నల్ల ఇసుక ఆరు అంగుళాల ఎత్తులో సమృద్ధిగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల కన్ను ఇక్కడి ఇసుకపై పడింది. కొందరు స్థానికుల సాయంతో పగలంతా సముద్ర తీరంలో తిరుగుతున్నారు. రాత్రిపూట లారీలలో ఇసుకను నింపి తొలుత జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు.
అలా సరిహద్దులు దాటించిన ఇసుక రాయుళ్లు పోలీసుల కళ్లు కప్పుతూ.. వాహనాలను మార్చి పొరుగు రాష్ట్రాలకు నల్ల ఇసుకను తరలించేస్తున్నారు. ఇటీవల పోలీసులకు సమాచారం రావడంతో వారు దాడులు చేసి లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇటీవల భీమిలి మండలం అన్నవరం సముద్ర తీరం నుంచి భోగాపురం మండలం బసవపాలెం మీదుగా నల్ల ఇసుకతో తరలిపోతున్న లారీని పట్టుకున్నారు.
సాధారణంగా ఇసుకను ఇండ్లు, భారీ భవనాల నిర్మాణాలకే వాడుతారు. అయితే వాటి కూడా నదుల దగ్గర దొరికే ఇసుక.. పెద్ద పెద్ద వాగుల్లో దొరికే ఇసుకను మాత్రమే వాడుతారు.. అయితే సాధారణంగా సముద్రం లేదా ఎడారి ఇసుకను ఉపయోగించరు.. ఎందుకంటే..? ఈ ఇసుక ప్రకాశంగా, మెరుస్తూ కనిపిస్తుంది, అంతేకాదు ఇవి చాలా మేలిమిగా, గుండ్రంగా ఉంటాయి. ఈ రకమైన ఇసుకను ఉపయోగించడంతో స్ట్రక్చర్ బలహీనపడుతుంది. పైగా, సముద్రపు ఇసుకలో ఉప్పు ఉంటుంది. దీని కారణంగా స్టీల్, ప్లాస్టర్కి మంచిది కాదు. దీర్ఘ కాలంలో ఈ ఇసుకను ఉపయోగించడం కారణంగా ఇనుము తప్పు పడుతుంది. ఇంటి మన్నిక, దృఢత్వంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయినా మరి ఈ నల్ల ఇసుకను ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారని డౌట్ పడుతున్నారా..?
ఇదీ చదవండి : అన్న క్యాంటీన్ పై దాడి.. రివర్స్ లో హత్యాయత్నం కేసులా..? మండిపడ్డ టీడీపీ నేతలు
ఈ నల్ల ఇసుక ప్రయోజనం ఏంటంటే..?
సముద్రపు నల్ల ఇసుక అద్దాలు, స్మార్ట్‌ఫోన్ తెరలు, ఫోన్లు, కంప్యూటర్లోని సిలికాన్ చిప్‌లు, క్వార్ట్జ్, అత్యాధునిక పరికరాల తయారీకి ఉపమోగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఇసుక అధిక ధర పలుకుతుండడంతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. స్థానికుల నుంచి సమాచారం వచ్చినప్పుడు వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సముద్రపు ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Black sea, Visakhapatnam