Minster Botsa: తెలుగు రాష్ట్రాల్లో భీమ్లానాయక్ (Bheemla Nayak) మాస్ జాతర కనిపిస్తోంది. ఓ వైపు సినిమా సూపర్ హిట్ అంటూ పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీర్(Telangana CM KCR) ను మెచ్చుకుంటూ పవన్ అభిమానులు.. టీఆర్ఎస్ కు జేజేలు పలుకుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh )లో మాత్రం సీఎం జగన్ (CM Jagan) డౌన్ డౌన్ అంటూ పవన్ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో సినిమా రిలీజ్ మొదటి రోజే పలు చోటు అభిమానులకు షాక్ తగిలింది. ఇటీవల ఏపీ లో సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించారు. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమా ఆడుతున్న రోజుల్లో మినహా థియేటర్స్ లో రేట్ల విషయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని థియేటర్లలో డీజే టిల్లూ (DJ Tillu) లాంటి సినిమాలకు కూడా వంద రూపాయలపైనే టికెట్లు విక్రయించారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ సినిమా రిలీజ్ అవ్వడంతో.. ప్రభుత్వం కక్ష కట్టి మళ్లీ రేట్లను తగ్గించిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు సినిమా వీడుదలకు ఒక రోజు ముందే రెవెన్యూ అధికారులు థియేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అదనపు షో వేసినా.. అధిక ధరలకు టికెట్లు అమ్మితే చర్చలు తీసుకుంటామని హెచ్చరించింది.
సడెన్ గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాకు ఒక్క రోజు ముందే ఏపీ ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలను పెట్టింది. అంటే కావాలనే ప్రభుత్వం కక్ష పూరితంగా పవన్ ను టార్గెట్ చేసిందని ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పవన్ సినిమా రిలీజ్ అయిన ముందు రోజే ఇవన్నీ గుర్తొచ్చాయా అని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో పలు చోట్ల సినిమా హాల్స్ మూతపడ్డాయి. ఇంత తక్కువ ధరలతో
సినిమాను ప్రదర్శించలేము అంటూ పలు థియేటర్ల దగ్గర గేట్లకు నోటీసులు అంటించారు..
తాజా వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyanarayana) సైతం స్పందించారు. జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేసంలో పాల్గొన్న ఆయన.. అన్ని విషయాలపై మాట్లాడారు. నాడు-నేడు, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పథకం, హోసింగ్ తదితరుల అంశాలు పై చర్చించామని ఆయన వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఉంటే అన్నిటిని క్లియర్ చేయమని అధికారులను అదేశించామన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో నడుస్తు భీమ్లా నాయక్ వివాదంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ సినిమా టికెట్స్ విషయంపై స్పందిస్తూ మనం ఒక వ్యవస్థలో ఉన్నామని ఆయన అన్నారు.
చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, వ్యక్తుల కోసం కాదు ..ప్రజల కోసం ఆలోచన చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే సినిమా టికెట్ల వ్యవహారంపై ఒక కమిటీని వేశామని, ఆ అంశం ఇంకా నడుస్తుందని ఆయన తెలిపారు. టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమాను పోస్ట్ పోన్ చేసుకోండని ఆయన సినీ నిర్మాతలకు ఓ సలహా ఇచ్చారు.. అలాగే చంద్రబాబుకి ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్టదు. కానీ సినిమా గురించి మాత్రం మాట్లాడుతాడని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి :ఏపీలో షర్మిల పార్టీకి అడుగులు..! ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ.. ఏం చర్చించారంటే
ఇదే విషయంలో ఏపీలో రేట్లు తగ్గించారనే కారణంతోనే పెద్ద సినిమాలు అయిన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లానాయక్ లాంటి సినిమాలు వాయిదా పడ్డాయని మంత్రి పేర్ని నానిని వివరణ కోరాగా.. సినిమా టికెట్ల వ్యవహారంతో.. సినిమా వాయిదాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ మంత్రి బొత్స మాత్రం ఇప్పుడు అదే సలహా ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.