హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఒక్కసారి అక్కడ అడుగుపెట్టారంటే అంతే..! ఆశ్చర్యం తప్ప మరో ఎక్స్‌ప్రెషన్‌ ఉండదు..!

Vizag: ఒక్కసారి అక్కడ అడుగుపెట్టారంటే అంతే..! ఆశ్చర్యం తప్ప మరో ఎక్స్‌ప్రెషన్‌ ఉండదు..!

జువాలజీ 

జువాలజీ  మ్యూజియంలో పుర్రె

Vizag: విశాఖ నగర నడిబొడ్డున ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ ఎంతో జ్ఞానాన్ని పెంచే, ఎన్నో వింతలకు నిలయంగా నిలిచింది. ఈ విద్యాలయంలో వింతలేంటి అంటారా..? అయితే యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్‌కి వెళ్లాల్సిందే.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam.

  ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) విద్యార్థుల పాలిట కల్పవృక్షం. ఎంతోమంది మేధావులను, రాజకీయ నాయకులను అందించిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం. విశాఖ నగర (Visakha City) నడిబొడ్డున ఉన్న ఆంధ్రాయూనివర్సిటీ ఎంతో జ్ఞానాన్ని పెంచే, ఎన్నో వింతలకు నిలయంగా నిలిచింది. ఈ విద్యాలయంలో వింతలేంటి అంటారా? అయితే యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్‌కి వెళ్లాల్సిందే.. ప్రస్తుతం మారుతున్న విద్యావిధానంలో ప్రయోగాత్మక బోధనకు పెద్దపీట వేస్తున్నారు. సైన్స్‌ విద్యార్థులకు (Science Students) ఇటువంటి బోధన చాలా అవసరం అని చెప్పవచ్చు.

  చాలా కాలేజీల్లో ఒక్కప్పుడు ప్రయోగశాలలు ఉండేవి కావు. మ్యూజియంల ఊసే లేదు. కానీ, ఇప్పటికీ చాలా కళాశాలల్లో సరైన ప్రయోగశాలలు అందుబాటులో లేవు. ఆంధ్రాయూనివర్సిటీలో జూవాలజీ విభాగంలో అతి పూరాతన మ్యూజియం ఒకటుంది. ఇక్కడ వందల ఏళ్ల చరిత్ర కలిగిన సుమారు 3000 జాతుల జీవుల కళేబరాలను కలిగిన మ్యూజియం చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఆ మ్యూజియం విశేషాలు ఏంటో మనం చూదాం.

  ఆంధ్రాయూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఎవరైనా ఒక్కసారి అడుగుపెడితే ముందుగా వాళ్లను పలుకరించేవి అక్కడున్న తిమింగలాలే ..! అవును మీరు విన్నది నిజమే.. జువాలజీ డిపార్ట్మెంట్‌లో గత కొన్ని దశాబ్దాలుగా భద్రపరిచిన రెండు తిమింగలాల శకలాలు మిమ్మల్ని అబ్బురపరుస్తూ స్వాగతం పలుకుతాయి. ఆ డిపార్ట్‌మెంట్‌లోపల దాదాపు మూడువేలకు పైగా జాతుల జీవులను ప్రత్యేక లిక్విడ్‌తో భద్రపరిచారు.

  ఇదీ చదవండి : ఈ భార్య తెలివికి షాక్ అవ్వాల్సిందే..? ప్రియుడి మోజులో ఏం చేసిందంటే..?

  విద్యార్థులు విద్యతో పాటు వాటిని దగ్గర నుండి వీక్షిండానికి ఇది ఏర్పాటు చేశారు. ఇందులో మానవుని పూర్తి అస్తిపంజిరం (ఒరిజనల్‌), డాల్ఫిన్‌ అస్తిపంజిరం, హ్యూమన్‌ బ్రెయిన్, పాములు కళేబరాలు, కోతరకపు ఆల్చిప్ప మాదిరిగా వుండే కోతరకపు జంతువు అస్థిపంజరం, ఇతర దేశాలలో అరుదుగా దొరికే ప్లెమింగో జాతువు అస్థిపంజరం. భవిష్యత్‌లో అంతరించిపోతున్న తాబేళ్ల జంతువుల అవయవాలను సేకరించారు.

  ఇదీ చదవండి : తుఫాను ముప్పు.. 24 గంటల్లో మరో వాయుగుండం.. ఆ జిల్లాలపై తీవ్ర ఎఫెక్ట్

  ఆంద్రా యూనివర్సిటీలో జూవాలజీ విభాగంలో 1946వ సంవత్సరంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఉన్న వివిధ రకాల వస్తువులని, అస్థిపంజరాలని, దుప్పు తలకాయలని, వేటాడిన పులి యొక్క అస్థిపంజరాన్ని, స్వతంత్ర రాక ముందు అప్పటి మహారాజులు వీటిని ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది.

  ఇదీ చదవండి : బాహుబలి భర్తను చూశారా..? ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

  అంతేగాక మైక్రోస్కోప్స్‌..మోనుక్యులర్‌ అండ్‌ బైనాక్యులర్, ఆటోక్లేవ్స్, సెంట్రిఫూగ్స్, ఎపిడయోస్కోప్, ఫొటోగ్రఫి ఎక్విప్‌మెంట్, రోటరీ మైక్రోటోమ్, డైనోసర్, హిమోగ్లోబిన్‌మీటర్స్, హిమోసైటోమీటర్స్, వాటర్‌ బాత్‌..సెవరల్‌ బయోలాజికల్‌ చార్ట్స్‌ ఇందులో ఉన్నాయి.

  ఇదీ చదవండి : ఏపీలో ఉన్నత విద్య చదవాలి అనుకున్న వారికి గుడ్ న్యూస్.. దరఖాస్తకు గడువు పెంపు.. ఎలా అప్లై చేయాలి? అర్హతలేంటి?

  ఈ మ్యూజియంలో అత్యంత, అరుదైన జీవ జాతులకు సంబంధించి స్పెసిమెన్స్, ట్యాక్సీడెర్మీ సెక్షన్‌ కూడా ఉంది. ఈ మ్యూజియంలో వందల సంఖ్యలో సేకరించి భద్రపరిచిన జీవజాతులను చూసేందుకు జిల్లాలోని విద్యార్థులే కాకుండా.. ఇతర రాష్ట్రాలు నుండి కూడా అధిక సంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు. ఆంధ్రా యూనివర్సిటీ జీవ, జంతు, రసాయన శాస్త్రాలకు సంబంధించి ప్రయోగశాలలను.. ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు.

  ఎలా వెళ్లాలి: విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకోవాలి. గేటు వద్ద నుండి నడిచి వెళ్లే అంత దగ్గరలో జువాలజీ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag

  ఉత్తమ కథలు