హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: కిటకిటలాడుతోన్న టూరిస్ట్‌ ప్లేస్‌లు..! పర్యాటక ప్రాంతంలో ముందే మొదలైన సందడి

Vizag: కిటకిటలాడుతోన్న టూరిస్ట్‌ ప్లేస్‌లు..! పర్యాటక ప్రాంతంలో ముందే మొదలైన సందడి

ముందే మొదలైన పర్యాటక సందడి

ముందే మొదలైన పర్యాటక సందడి

Vizag: సాధారణంగా వింటర్ మొదలైన తరువాత విశాఖలో పర్యటకుల సందడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడే విశాఖలో టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. అన్ని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఎందుకో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam.

  విశాఖపట్నం సిటీ (Visakha City) అంతా దసరా (Dussehra) పండగ సందడి నెలకొంది. దసరా సెలవులకు విద్యార్థులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు విశాఖ సిటీకి రావడంతో పండగ హడావిడితో సందడిగా మారింది. నగరవాసులు కొత్త వాహనాల కొనుగోలు చేయడం.. పాత వాహనాలకు పూజలు చేసే పనిలో అంతా బిజీ అయ్యారు. వాహనాల కొనుగోలుతో మోటారు షోరూంలు, కొత్త దుస్తులతో షాపింగ్ మాల్స్, సామాగ్రి కొనుగోలుతో వస్త్రదుకాణాలు జనంతో చల్లని సాగరతీరంలో కోలాహలంతో నగరమంతా కిటకిటలాడుతుంది.

  మరో పక్క నగరంలో దసరా పండగను పురస్కరించుకొని దుర్గ అమ్మవార్ల ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఇక బీచ్‌రోడ్ విషయానికి వస్తే నూతన హంగులతో పర్యాటకులు తాకిడితో ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రంగా మారింది.

  దసరా పర్వదినం కావడంతో పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నయి. కొద్ది రోజులుగా బీచ్‌కు వస్తున్న సందర్శకుల సంఖ్య పెరిగినప్పటికీ.. మిగిలిన పర్యాటక ప్రాంతాలైన కురుసుర, టీ యు 142 యుద్ద విమానం, వుడా పార్క్ , ఆర్కే బీచ్ ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ప్రతిరోజు కొద్దిపాటి పర్యాటకులతో సాగిన ఈ పర్యాటక ప్రాంతాలు ఒకసారిగా దసరాకు పర్యాటకులు రావడంతో కిక్కిరిసిపోతున్నాయి.

  ఇదీ చదవండి : రూపాయి డాక్టర్‌ గురించి విన్నారా..? అమ్మ కోరిక నిజం చేస్తూ వైద్యసేవలు

  పర్యాటక ప్రాంతాల లోపలకి వెళ్లేందుకు గంటల కొద్ది కూ లైన్ లో నుంచొని మరి వెళ్తున్నారు. చిన్నారులు పెద్దలు ముసలి వాళ్లు అని తేడా లేకుండా అందరూ లైన్‌లో నుంచొని గంటల తరబడి ఉండి పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌లో ఇసుక తిన్నెలపై పలు ఆటలాడుతూ ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

  ఇదీ చదవండి : ఆ ఆలయంలో కొబ్బరికాయ కొట్టకూడదు..? ఏం చేస్తారో తెలుసా..?

  అదేవిధంగా ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్కు వరకు ఉన్న బీచ్‌ అంతా సందర్శకులతో కిక్కిరిసింది. వుడా పార్కు, కైలాసగిరి ప్రాంతాలను వేలాది మంది పర్యాటకులు సందర్శించారు. దసరా సెలవులు కావడంతో అధిక సంఖ్యలో చిన్నారులతో కలిసి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటక ప్రాంతమైన విశాఖను సందర్శించి వెళ్తున్నారు. దసరా సెలవు కావడంతో పెద్ద ఎత్తున బీచ్‌కి అందరూ వచ్చి స్నానాలు చేస్తూ ఆనందంలో తేలిఆడుతున్నారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Local News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు