హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఇక్కడ తమిళనాడు మార్కెట్ కు ఫుల్ డిమాండ్..! పండగవస్తే ప్రత్యేక సందండి.. స్పెషల్‌ ఏంటంటే..!

Vizag: ఇక్కడ తమిళనాడు మార్కెట్ కు ఫుల్ డిమాండ్..! పండగవస్తే ప్రత్యేక సందండి.. స్పెషల్‌ ఏంటంటే..!

విశాఖలో

విశాఖలో తమిళనాడు మార్కెట్

Vizag: దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం.. విశాఖలో తమిళనాడు మార్కెట్..! అంతేకాదు ఇదీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా పండగొస్తే చాలు విశాఖ నగరవాసులంతా అక్కడ వాలిపోతారు. ఎందుకంత స్పెషల్ తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  VisakhaPatnam:  ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విశాఖ (Visakha) కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ చూడాల్సిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. నగరంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అందాలు కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి. కేవలం సముద్ర తీరమే కాదు.. పార్కులు.. ఆలయాలు, వినోద క్షేత్రాలు.. ఇంకా ఎన్నో ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి విశాఖపట్నం (Visakhapatanam)లో తమిళనాడు మార్కెట్ (Tamilanadu Market).. కూడా ఉంది. అవును మీరు చదివింది నిజమే విశాఖ మహానగరంలో తమిళనాడు మార్కెట్‌ ఉందని మీకు తెలుసా.. ఉండటమే కాదు ఆ మార్కెట్‌ అక్కడ చాలా ఫేమస్‌.. ముఖ్యంగా పండుగ వచ్చిందంటే..? విశాఖ నగరవాసులంతా అక్కడ వాలిపోతారు..

  ఎన్నో ఏళ్ల నుండి పెందుర్తి (Pendurthi) లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తమిళనాడు ప్రజలు. ఇక్కడ పేద, మధ్య తరగతి వారు కొనుక్కునేందుకు కావల్సిన వస్తువులన్ని అందుబాటు ధరలో దొరుకుతాయి. తమిళ వ్యాపారులు వివిధ రాష్ట్రాల నుండి బట్టలు తీసుకువచ్చి తక్కువ ధరకే అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అమ్మకాలు చేస్తూ ఉంటారు.

  సంవత్సరానికి ఒకసారి మాత్రమే వీళ్లు తమ సొంత రాష్ట్రమైన తమిళనాడుకు వెళ్తారు. మిగతా సమయం అంతా కూడా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తూ ఉంటారు. సంవత్సరం అంతా కొద్దిపాటి లాభాలు ఉన్నప్పటికీ ప్రత్యేక పండగ రోజులైన దసరా, సంక్రాంతి సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని అంటున్నారు నిర్వాహకులు.

  ఇదీ చదవండి : పేషెంట్ బంధువులే వార్డ్ బాయ్స్..? కర్నూలు పెద్దాసుపత్రిలో ఇదేం దుస్థితి..!

  విశాఖలో తమిళనాడు మార్కెట్ ఎలా..?                                          విశాఖపట్నంలో ఏళ్ల క్రితం తమిళనాడు (Tamilnadu) నుండి కొంత మంది వచ్చి వ్యాపారం ప్రారంభించారు. పెందుర్తిలో వారికి మంచి ఆదరణ దొరకడంతో కాలక్రమేణా మరికొంతమంది తమిళులు ఇక్కడకు వచ్చి వ్యాపారాలు ప్రారంభించారు. అలా దినదినాభివృద్ధి చెంది ఫేమస్ అయ్యి.. తమిళనాడు మార్కెట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.

  ఇదీ చదవండి : ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వైభవంగా పెద్ద వాహన సేవ.. నేడు చినవాహన సేవ.. ప్రత్యేకత ఏంటంటే..?

  ఉత్తరాంధ్రలో అందరి వ్యాపారులను తమ వైపు తిప్పుకొని ఇప్పుడు వ్యాపారంలో ఓ చక్రం తిప్పుతున్నారు. అందరికంటే తక్కువ ధరలకు నగరవాసులకు కావలసిన రకరకాల మోడల్‌ బట్టలను అందిస్తూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ టెక్స్‌టైల్ మార్కెట్‌లో కిడ్స్‌ వేర్‌, వుమెన్స్‌ వేర్‌, మెన్‌ వేర్‌, శారీస్‌ లాంటి ఎన్నో రకాల బట్టలు దొరుకుతాయి.

  ఇదీ చదవండి : తొలి సీఎంగా జగన్ కు గుర్తింపు.. వెయ్యేళ్ల చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసా..?

  విశాఖపట్నంలో చాలామంది బట్టల షాపు నిర్వాహకులు కూడా ఇక్కడ నుండే హోల్‌సేల్ దరలకు కొనుగోలు చేసి సిటీలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. తమిళనాడు మార్కెట్ ప్రజలు దేశం నలుమూలల నుండి మంచి మంచి బ్రాండెడ్ బట్టలు తీసుకువచ్చి హోల్ సేల్‌గా తక్కువ ధరలకు అందిస్తూ ఉంటారు.

  ఇదీ చదవండి : దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయాలి.. లోకేష్ కు మంత్రి రోజా సవాల్.. ఎందుకో తెలుసా?

  ఇక్కడ ధరలు చాలా తక్కువ ఉండడంతో విశాఖపట్నం , శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల నలుమూలల నుండి ఇక్కడికి నిత్యం వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. వంద రూపాయలు నుండి 5000, 10000 వరకు కూడా ధరలు కలిగిన వస్త్రాలు వీళ్ళ దగ్గర లభిస్తాయి. చుట్టుపక్కల ఏ పెళ్లి అయినా, ఏ శుభకారమైనా తమిళనాడు మార్కెట్‌కు వెళ్లక మానరు. విశాఖపట్నంలో ఎన్ని బ్రాండెడ్ షాపులు ఉన్నప్పటికీ ఎన్నో మార్కెట్లు ఉన్నప్పటికీ తమిళనాడు మార్కెట్ అంటే అంత ఫేమస్..!

  ఇదీ చదవండి : షుగర్ ఉందని టెన్షన్ వద్దు.. అందుబాటులోకి సరికొత్త పరికరం.. ప్రత్యేకత ఏంటంటే?

  త్వరలో దసరా రాబోతుంది.. మీరు వైజాగ్‌లో ఉండిఉంటే ఓ సారి సరదగాగా తమిళనాడు మార్కెట్‌కెళ్లండి.. మీకు కావల్సినన్ని మోడల్స్‌ అక్కడ దొరుకుతాయి.

  అడ్రస్‌: తమిళనాడు మార్కెట్‌, పెందుర్తి జంక్షన్‌, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 531173

  ఎలా వెళ్లాలి..?

  విశాఖపట్నం కాంప్లెక్స్ నుండి పెందుర్తి జంక్షన్‌కి చేరుకోవాలి. జంక్షన్ నుండి 100 మీటర్లు దూరంలో తమిళనాడు మార్కెట్ కనిపిస్తుంది. ఆటో , బస్ సౌకర్యం కలదు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు