హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakha: సాగరతీరంలో అద్భుత విన్యాసాలు.. అదుర్స్ అనిపిస్తున్న నేవీ రిహార్సల్స్

Visakha: సాగరతీరంలో అద్భుత విన్యాసాలు.. అదుర్స్ అనిపిస్తున్న నేవీ రిహార్సల్స్

X
సాగర

సాగర తీరంలో అద్భుత విన్యాసాలు

Navy Day: తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీ నుంచి నేవీ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి. దీనిలో భాగంగా విశాఖ సాగర తీరంలో నేవీ అధికారులు నిర్వహించిన రిహార్సల్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam 

Navy Day Celebrations: తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ నెల నాలుగో తేదీన నేడీ డే వేడుకలు (Navy Day Celebrations) జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా విశాఖ సాగర తీరం (Vizag Beach)లో నేవీ అధికారులు నిర్వహించిన రిహార్సల్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటర్ బాంబులు దాడి.. విద్యుత్ కాంతులతో యుద్ధనౌకుల (War Ships) సందడి.. ప్యారాచూట్లతో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు నగరవాసులను ఆకర్షితులను చేశాయి. నేవీ డే ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) హాజరవుతున్న నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా అద్దాల గదిని ఏర్పాటు చేయడంతో పాటు భద్రత ఏర్పాట్లపై కూడా జిల్లా అధికార యంత్రంగా దృష్టి సారించింది. సముద్ర తీరంలో నేవీ శక్తిని చాటి చెప్పే విధంగా చేపట్టిన విన్యాసాలు, రక్షణ సిబ్బందిని ఏవిధంగా రక్షించాలని అంశాలపై నిర్వహించిన రిహార్సల్స్ అబ్బురపరిచాయి.

నేవి డే వేడుకలు, రిహార్సల్స్‌ అంతా కూడా నగరవాసులకు అబ్బుర పరిచే రీతిలో సాగాయి. భూమి, ఆకాశంతో పాటు సముద్ర జలాలపై విన్యాసాలు అద్భుత రీతిలో సాగాయి. విశాఖ నావికాదళ ఆయుధ సంపత్తిని, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు అన్ని కూడా విపత్తుల సమయాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందిస్తాయని ప్రజలకు ప్రత్యక్షంగా చూపించనున్నారు.

విశాఖపట్నం నేవీ, భారత నావికా దళానికి వెన్నెముకగా తూర్పు నావికా దళం సేవలు అందిస్తోంది. లుక్ ఈస్ట్ పాలసీ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు అన్నిటికీ తూర్పు తీర ప్రాంత భద్రతకు అంతా కూడా పెద్ద పీట వేస్తున్నాయి. విశాఖ తీరంలో 1968లో ప్రారంభమైన ఈ తూర్పు నావికాదళ పయనం.. 1971లో పాక్ పై భారత్ సాధించిన యుద్ధ విజయంలో అంతా కూడా ఇదే కీలక భూమిక పోషించే స్థాయికి ఎదిగింది. అందుకే వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ లో నేవీ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. 

ఇదీ చదవండి : ఓ రబ్బయ్య.. జంపలకడి జారు మిఠాయా ఈ పాట వెనుక ఇంతక కథ ఉందా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఓ వైపు వింటర్ సీజన్.. అదే సమయంలో విశాఖలో ఉన్న అన్ని పర్యాటక  ప్రాంతాలన్నీ రద్దీగా మారుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకు విశాఖకు చేరుకున్నారు. వారంతా ఈ విన్యాసాలను చూసి.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిహార్సిల్స్ ఇంత అద్భుతంగా ఉంటే.. అసలైన వేడుకలు ఎలా ఉంటాయో.. అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Indian Navy, Local News, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు