Setti Jagadeesh, News 18, Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam) అంటే ఆర్థిక రాజధాని.. విశాఖ అంటే పర్యాటక ప్రాంతం (Tourist Spot).. విశాఖ అంటే స్మార్ట్ సిటీ (Smart City).. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న నగరానికి మరో గుర్తింపు కూడా ఉంది. అదే క్రీడల నగరం.. ఇక్కడ నుంచి ఎంతోమంది క్రీడాకారులు జాతీయ.. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. ఎక ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సైతం వేదికగా నిలుస్తూ వస్తోంది. తాజాగా విశాఖపట్నం క్రీడాకారులకు గుడ్ న్యూస్.. విశాఖలో మరో ఛాంపియన్ షిప్ జరగబోతోంది.
విశాఖపట్నం అంటేనే ఎన్నో క్రీడలకు నెలవు. ఎంతోమంది క్రీడాకారులు ఇక్కడే జరిగే పోటీలలో పాల్గొని ప్రపంచ స్థాయి పోటీలలో ప్రథమ స్థానం దక్కించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తాజాగా ఇప్పుడు విశాఖలో ఇండోనేపాల్ కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీల నిర్వహణకు అంతా సిద్ధం అవుతుంది. విద్యార్థులు ఎవరైనా పాల్గొనాలనుకుంటే ఆయా తేదీల్లో నిర్వాహకులకు తెలియపరచి హాజరుకావాలి.
దీనికి సంబంధించి విశాఖలో ఇప్పటికే బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. విశాఖపట్నం క్రీడలకు అనుకూలమైన ప్రదేశం విశాఖ నగరం అని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆమె క్యాంప్ కార్యాలయంలో ఏపీ వాడే - రూయ కరాటే డో ఆధ్వర్యంలో నిర్వహించే ఇండోనేపాల్ కరాటే ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీల బ్రోచర్ను నగర మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరం క్రీడలకు అనుకూలమైన ప్రాంతమని ఆమె అన్నారు. విశాఖపట్టణం నుండి ఎంతోమంది క్రీడాకారులు దేశ విదేశాలలో వివిధ క్రీడలో పాల్గొన్నారని తెలిపారు. ఇండోనేపాల్ కరాటే ఛాంపియన్షిప్ మే నెల 26,27, 28 తేదీలలోవిశాఖలోనిస్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరుగునని తెలిపారు.
ఇదీ చదవండి: మొన్న అనం.. నిన్న వసంత కృష్ణప్రసాద్.. నేడు మాజీ మంత్రి..? వారి టార్గెట్ అదేనా..?
ఈ కార్యక్రమంలో కరాటే టోర్నమెంట్ నిర్వాకులు చీప్ ఆర్గనైజర్ సిహెచ్ శ్రీనివాసరావు, సెక్రటరీ జి గోపాలరావు, ట్రెజరర్ బి వెంకటరావు, విశాఖ సీనియర్ కరాటే మాస్టర్లు కె చిన్నారావు, పివి రమణమూర్తి, ఏ నూకరాజు, ఎం హరినాధరావు, బి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Visakhapatnam, Vizag